Speaker Gaddam Prasad (imagecredit:swetcha)
తెలంగాణ

Speaker Gaddam Prasad: ఆ గ్రామాన్ని నేను దత్తత తీసుకున్న: గడ్డం ప్రసాద్ కుమార్

Speaker Gaddam Prasad: బురాన్ పల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) అన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ మండలంలోని బురాన్ పల్లిలో పల్లెల్లో పనుల జాతర – 2025 లో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రూ.20 లక్షల వ్యయంతో చేపట్టే బురాన్ పల్లి గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన, పిడబ్ల్యుడి రోడ్డు నుండి బురాన్ పల్లి వరకు రూ.63 లక్షలతో చేపట్టిన నూతన బిటి రోడ్డుకు, బురాన్ పల్లి నుండి ధన్నారం వరకు రూ. 63 లక్షలతో నూతనంగా చేపట్టిన బిటి రోడ్డులకు సభాపతి ప్రారంభోత్సవం గావించారు. ఈ సందర్భంగా సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

చౌకధర దుకాణాల ద్వారా

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతుందన్నారు. ఇంకా ప్రజలకు ఇచ్చిన హామీలు అయిన మహాలక్ష్మి పథకం కింద ఇంటి యజమానికి 2500 ఆర్థిక సహాయం, కళ్యాణ లక్ష్మి(Kalyana Lakshmi)కి ఇవ్వాల్సిన తులం బంగారం త్వరలోనే చెల్లించనున్నట్లు ఆయన అన్నారు. గత ప్రభుత్వం 6 వేల కోట్ల అప్పు చేసిందని, వీటికి 6500 కోట్ల వడ్డీ చెల్లిస్తూనే ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వము ఇంటికి ఒక ఉద్యోగం, పేద కుటుంబాలకు రేషన్ కార్డులు(Ration cards), ఉండడానికి ఇల్లు ఇవ్వలేక పోయిందని, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండ్లు, రేషన్ కార్డులతో పాటు చౌకధర దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని సరఫరా చేయడంతో పాటుగా పెన్షన్లను కూడా అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం రద్దు చేసిన అసైన్మెంట్ కమిటీని పునరుద్ధరించి భూములు లేని పేదలకు భూములు ఇచ్చే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు స్పీకర్ తెలిపారు.

Also Read: Harish Rao: కాళేశ్వరంపై బురద రాజకీయాలొద్దు.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

ఒక్కో సంఘానికి 10 లక్షల రూపాయలు

పంట పొలాలకు వెళ్లే దారులకు రోడ్లు వేసేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారికి స్పీకర్ సూచించారు. గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని తహసిల్దార్(MRO) కు స్పీకర్ సూచించారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళా సంఘాలను ప్రోత్సహించడం జరుగుతుందని అదేవిధంగా డ్వాక్రా సంఘాలకు మిత్తి లేని రుణాలను ఒక్కో సంఘానికి 10 లక్షల రూపాయల చొప్పున అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రతి సంక్షేమ పథకం మహిళల పేరున ఉండాలని ఉద్దేశంతో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా ఉపాధి హామీ కింద ఉద్యానవన మొక్కలు నాటేందుకు ప్రొసీడింగ్ కాపీలను స్పీకర్ చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమాల్లో డి ఆర్ డి ఓ శ్రీనివాస్(DRDO Srinivass), తహసీల్దార్ లక్ష్మి నారాయణ(MRO Lxmi Narayana), ఎంపిడిఓ వినయ్ కుమార్(MPDO Vinay Kumar), పంచాయత్ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్(Srinivass), ఆర్టిఎ సభ్యులు జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Srinivas Goud: ఎప్పుడూ అబద్ధాలే మాట్లాడతారా?.. కాంగ్రెస్‌పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్!

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?