Gaddam Prasad Kumar: ఉభయ సభలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని, మీడియా ప్రతినిధులు ఇందులో కీలక పాత్ర పోషించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) అన్నారు. తెలంగాణ లెజిస్లేటివ్ మీడియా అడ్వైజరీ కమిటీ తొలి సమావేశాన్ని బుధవారం శాసనసభ భవనంలోని కమిటీ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో కీలకమైన శాసనసభ, మండలి గౌరవం, ప్రాధాన్యతలను కాపాడుతూ మీడియా సలహా మండలి ద్వారా మీ వంతుగా సేవలను అందించడం మంచి అవకాశం అన్నారు.
Also Read: Crime News: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. తల్లి ప్రియుడితో కలిసి ఘాతుకం
ప్రజలకు మంచి జరగాలి
ఉభయ సభలు సజావుగా జరగడానికి తమ వంతు సహకారాన్ని ఎల్లప్పుడూ అందించాలని కోరారు. ఉభయ సమావేశాలు సజావుగా జరిగి, అర్ధవంతమైన చర్చలు జరగాలన్నారు. తద్వారా రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని వ్యాఖ్యానించారు. శాసనసభ సమావేశాల సమయంలోనే కాదు, ఇతర సమయాలలో కూడా శాసనసభకు సంబంధించిన వార్తలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Sukhender Reddy) మాట్లాడుతూ, సమావేశాలు సజావుగా నడవాలి అంటే మీడియా పాత్రనే కీలకమన్నారు.
మార్పలు కూడా చేయాలి
నూతనంగా ఎన్నికైన కమిటీ సభను హుందాగా నడవడానికి అన్ని విధాలుగా సహకారం అందించాలని, రానున్న రోజుల్లో ఉభయ సభలు ఒకే భవనంలోకి రాబోతున్నాయన్నారు. కొన్ని మార్పలు కూడా చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మీడియా కమిటీ సభ్యులకు ఎలాంటి సహాయం కావాలన్నా అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, శాసనసభ, మండలి వ్యవహారాలలో మీడియాకు బాధ్యతను కల్పించడానికి, మరింత పాత్రను పోషించడానికే కమిటీని నియమించినట్లు తెలిపారు.
అందరం కలిసి పని చేయాలి
ఉభయ సభల నిర్వాహణలో అందరి సహకారం అవసరమని తెలిపారు. మీడియా ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలు, వసతులపై ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. జారీ చేసే పాస్‌ల విషయంలో కమిటీ సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని, మంచి వాతావరణంలో అందరం కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేశారు. కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, సమావేశాల సందర్భంగా కవరేజ్ చేసే మీడియా ప్రతినిధులందరికి పాస్‌లు అందేలా సూచనలను అందిస్తామని స్పష్టం చేశారు.
Also Read: Mulugu District: హిడ్మా తప్పించుకున్నాడా? కర్రెగుట్టల వద్ద మళ్లీ కూంబింగ్