TG SPDCL ( image creddit: swetcha reporter or twitter)
తెలంగాణ

TG SPDCL: అవినీతిని సహించం. దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థ సీరియస్!

TG SPDCL: : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) (TG SPDCL) అవినీతిపై ఉక్కుపాదం మోపుతోంది. అవినీతిని నిరోధించేందుకు సంస్థ పరిధిలో ఏర్పాటుచేసిన యాంటీ బ్రైబరీ సెల్ తో సత్ఫలితాలు వస్తున్నాయి. ఈ యాంటీ బ్రైబరీ సెల్ ను గతేడాది సెప్టెంబర్ లో సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. నేరుగా సంస్థ సీఎండీ పర్యవేక్షణలో ఈ సెల్ కొనసాగుతోంది. ఏదైనా ఫిర్యాదు అందితే నేరుగా సీఎండీకి వెళ్తుంది. ఫిర్యాదు ఎవరిపై వెళ్లింది? ఎవరు చేశారనే డేటా బయటకు లీక్ అవ్వకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో సీఎండీ నుంచి నేరుగా విజిలెన్స్ అధికారులకే ఈ సమాచారం చేరేలా ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో విషయం బయటకు పొక్కి జాగ్రత్త పడేందుకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నారు.

Also Read: Gatha Vaibhava: పవన్ కళ్యాణ్ అద్భుతమైన మాట చెప్పారు.. అందుకే తెలుగు నేర్చుకుని వచ్చానన్న హీరో!

63 అవీనీతి ఫిర్యాదుల్లో 28 ఫిర్యాదులపై విచారణ

యాంటీ బ్రైబరీ సెల్ ఏర్పాటుచేసి ఏడాది పూర్తయింది. ఇప్పటి వరకు దాదాపు మొత్తం 125 ఫిర్యాదులు కాల్స్ ద్వారా వచ్చినట్లు తెలిసింది. అందులో దాదాపు 63 ఫిర్యాదులు అవినీతికి సంబంధించినవే కావడం గమనార్హం. కాగా మిగతావి సదరు ఉద్యోగి, సిబ్బంది పనిలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ వచ్చినవి ఉన్నట్లుగా తెలతిసింది. కాగా 63 అవీనీతి ఫిర్యాదుల్లో 28 ఫిర్యాదులపై విచారణ ఇంకా కొనసాగుతోంది. కాగా 5 కేసుల్లో అవినీతి నిరూపితమైంది. దీంతో వారిపై చర్యలు తీసుకున్నారు. సస్పెన్షన్ వేటు వేశారు. ఇందులో మెదక్, జీడిమెట్ల, బంజారాహిల్స్ పరిధిలో ఏఈ, ఆర్టీజన్లు ఉన్నారు.

ఏసీబీ అధికారులు ఏడీఈ అంబేద్కర్

సంస్థ పరిధిలో ఎక్కడ ఏ అధికారి లంచమడిగినా వెంటనే యాంటీ బ్రైబరీ సెల్ 040-23454884 లేదా 7680901912 నంబర్లకు కాల్ చేయాలని అధికారులు చెబుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఇటీవల ఏసీబీ అధికారులు ఏడీఈ అంబేద్కర్ తో పాటు ఆయన బంధువుల ఇంట్లో పలు బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో రూ.2 కోట్ల నగదు, ఇతర అక్రమ ఆస్తులున్నట్లు తేలింది. దీంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. అయితే దీనికంటే ముందే అంబేద్కర్ పై యాంటీ బ్రైబరీ సెల్ తో పాటు ప్రజావాణిలోనూ ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. దీంతో సంస్థ అంబేద్కర్ ను కార్పొరేట్ సంస్థకు అటాచ్ చేసింది. కొద్దిరోజులకే ఏసీబీ తనిఖీల్లో ఆయన పట్టుబడ్డారు. చివరకు సస్పెన్షన్ వేటు పడింది.

అవినీతిని సహించబోం

సంస్థ పరిధిలో ఒకరిద్దరు చేసే అవినీతి పనుల వల్ల సంస్థకు చెడ్డపేరు వస్తోంది. అందుకే దీన్ని ఏమాత్రం సహించబోం. విధుల్లో అత్యంత పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. సంస్థ పరిధిలో ప్రతిరోజు రివ్యూలు చేపడుతున్నాం. సర్వీస్ కనెక్షన్లు, పెండింగ్ పనులపై ఆరా తీస్తున్నాం. ఎక్కడి వరకు పనులు చేపట్టారు. ఎందుకు ఆలస్యమైంది అనే అంశాలపై సమీక్షలు చేపడుతున్నాం. పలువురు డూప్లికేట్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు పెడుతున్నారని ఫిర్యాదులు అందాయి. అందుకే జీహెచ్ఎంసీ పరిధిలో చీఫ్ ఇంజినీర్లకు కూడా అథెంటికేషన్ ఇచ్చాం. మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా దీని యాక్సెస్ వారికి ఉంటుంది. దీంతో అవినీతికి అడ్డుకట్ట పడనుంది. తమ శాఖ పరిధిలో సమస్యలున్నాయని ఫిర్యాదు చేసిన వారికి పూర్తి వివరాలు అందుబాటులో ఉంచాం. ఏ పనికి ఎన్నిరోజుల సమయం పడుతుంది? ఎన్ని రోజుల్లో పూర్తిచేస్తామనే వివరాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. అయినా ఆలస్యమైతే సదరు అధికారి, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.

Also Read: Mohan Babu University: కోర్టు ఉత్తర్వును ధిక్కరించారు.. కాంట్రవర్సీపై మంచు విష్ణు స్పందనిదే!

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?