SP K Narasimha [ image credit: AI ]
తెలంగాణ

SP K Narasimha: ఫ్రీ అంటే ఆశపడ్డారో.. ఇక అంతేనట.. హెచ్చరించిన ఎస్పీ

సూర్యాపేట, స్వేచ్ఛ : SP K Narasimha: సైబర్ మోసగాళ్ల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ  ఒక ప్రకటనలో తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని, ఉచితంగా బహుమతులు ఇస్తామని చెబితే దానిని గుడ్డిగా నమ్మవద్దని పేర్కొన్నారు. దీని వెనక తప్పక సైబర్ మోసగాళ్ళు ఉంటారనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. ఏ బ్యాంక్ ఉద్యోగి ఖాతాదారునికి ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు అడగరనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

Crime: ప్రియుడి పై ప్రియురాలికి కోపం.. ఏకంగా 14 బైక్స్ కాల్చేసింది..

అప్రమత్తత, అవగాహన ద్వారా సైబర్ నేరాలను అరికట్టవచ్చన్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బును పోగొట్టుకుంటే టోల్ ఫ్రీ నంబర్1930 కు ఫోన్ చేసి పిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరం జరిగిన మొదటి గంటలోనే (గోల్డెన్ అవర్) ఫిర్యాదు చేయడం ద్వారా స్కామర్ అకౌంట్ ను ఫ్రీజ్ చేసి పోయిన డబ్బు రికవరీ సులభతరమవుతుందన్నారు. ఫోన్ కు, మెయిల్ కు, సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రాం లాంటి మాధ్యమాలలో వచ్చే మెస్సేజ్ లు, బ్లూ లింక్ లు అనుసరించవద్దని పేర్కొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!