MLA Veerlapalli Shankar( IMAGE CREDIT: SWETCHA REPORTER)
తెలంగాణ

MLA Veerlapalli Shankar: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

MLA Veerlapalli Shankar: ప్రజలకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ స్వాతంత్రాలను హరించేలా వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి ప్రజా జీవితాలకు భంగం కలిగిస్తున్న వారిని ఉరితీయాలని షాద్ నగర్ (Shad Nagar) ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ (Veerlapalli Shankar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Typping)  వ్యవహారం ఎంతో దుర్మార్గమైనదని ఇదేనా వారి సంస్కారం? అని ప్రశ్నించారు.

కక్ష సాధింపులు ఉండవు

దీనిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని, ఇందులో కాంగ్రెస్ పార్టీ (Congress Party)  జోక్యం చేసుకోబోదన్నారు. నిందితులు ఎవరైనప్పటికీ ఎంత పెద్ద వారైనా సరే ప్రభుత్వం వదిలిపెట్టబోదన్నారు. తమ ప్రభుత్వానికి ఎవరిపైన వ్యక్తిగతంగా కక్ష సాధింపులు ఉండవని ఆయన పేర్కొన్నారు. ఏదైనా చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటారని అన్నారు. రోడ్డుపై ఉండే చిల్లర గాళ్ల కన్నా అధ్వానంగా గత పాలకులు వ్యవహరించారని, ఇలాంటి దుర్మార్గ సంస్కృతిని ఎవరు ఉపేక్షించబోరని విమర్శించారు. మనం తప్ప మరొకరు పాలించకూడదన్న శాడిజం,  అహంకారంతో ప్రజల ఫోన్లను ట్యాపింగ్ (Phone Tyopping) చేసి చివరకు వారు తవ్వుకున్న గోతిలోనే పడ్డారని ఎద్దేవా చేశారు.

 Also Read:Farmer Welfare Initiatives: రైతుల సంక్షేమంపై.. తెలంగాణ ప్రభుత్వం భేష్! 

కేటీఆర్ ది చిల్లర భాష
రోడ్లపై తిరిగే చిల్లర గాళ్ళ కన్నా అధ్వానంగా కేటీఆర్ (KTR) మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (Veerlapalli Shankar) ఘాటుగా విమర్శించారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి (Revanth Reddy) రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ (KCR) మాట్లాడుతున్న చిల్లర భాషను చూస్తే ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. చేసిన తప్పుడు పనులకు ప్రజలు గద్దెను దించి కూర్చోబెడితే ఇంకా అతనిలో మార్పు రాకపోవడం విచారకరమన్నారు. ఇలాంటి చిల్లర భాషలకు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఎప్పుడూ స్వార్ధ రాజకీయాలను, కక్ష సాధింపులను ప్రోత్సహించదని, నిష్పక్షపాతమైన పాలనను కొనసాగిస్తుందని గుర్తు చేశారు.

జైలు పాలు చేశారు

కేసిఆర్ (KCR) అధికారంలో ఉన్నప్పుడు  (Revanth Reddy) రేవంత్ రెడ్డిపై దౌర్జన్యం చేసి ఆయన బెడ్ రూమ్ లోకి వెళ్లి మరీ పోలీసులు లాక్కొచ్చారని, ఆ తర్వాత ఎన్నో నిర్బంధాలకు గురి చేసిన సంఘటనలను ప్రజానీకం మర్చిపోలేదన్నారు. ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ పట్ల కూడా అదే విధంగా వ్యవహరించారని, ప్రొఫెసర్ కోదండరాం లాంటి వారి ఇండ్ల కిటికీలను తలుపులను పగులగొట్టి మరి పోలీసులు అరాచకం సృష్టించారని, ఇంకా మరెందరో ప్రతిపక్ష విపక్ష నాయకులు కార్యకర్తలపై పట్ల అక్రమ కేసులు విధించి జైలు పాలు చేశారని మండిపడ్డారు.

ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు 

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  (Revanth Reddy) ఆ విధంగా వ్యవహరించబోరని అన్నారు. తప్పులు చేసిన వారు చట్టపరంగానే శిక్షించబడతారని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి చెన్నయ్య, జంగా నరసింహా యాదవ్, మాజీ జెడ్పిటిసి పి వెంకట్రాం రెడ్డి, పురుషోత్తం రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, చంద్రశేఖర్, జమ్రుద్ ఖాన్, ఇబ్రహీం, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వం, బసవమప్ప, జాంగారి రవి, వర్ష ఐటీఐరాజు, కొత్తపేట ఉస్మాన్, లింగారెడ్డిగూడెం అశోక్ తదితరులు పాల్గొన్నారు.

 Also ReadPhone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కీలక పరిణామాలు!

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు