GHMC (imagecredit:twitter)
తెలంగాణ

GHMC: జీహెచ్ఎంసీలో రోడ్ల పేరిట భారీ కుంభకోణం.. సంచలన విషయాలు వెలుగులోకి!

GHMC: ఆర్థిక సంక్షోభంలో కోట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీలోని అధికారులు, పాలక మండలి కుమ్మక్కై మరో దోపిడీకి తెరదీసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్కువ వ్యయంతో రోడ్ల నిర్వాహణను చేపట్టాల్సిన జీహెచ్ఎంసీ రెట్టింపు వ్యయానికి మరో 1142.54 కి.మీ.ల రోడ్ల నిర్వాహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. నాలుగు నెలల క్రితమే ఈ ప్రతిపాదన స్టాండింగ్ కమిటీ ముందుకు రాగా, కమిటీ తిరస్కరించినట్లు సమాచారం. 2017లో అప్పటి అప్పటి గులాబీ సర్కారు నడిచిన బాటలోనే ప్రజాపాలన కొనసాగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సర్కారు నగరంలోని మెయిన్ రోడ్లకు మెరుగైన నిర్వహణ పేరిట కాంప్రహెన్సీవ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రొగ్రాం (సీఆర్ఎంపీ) మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా ఆరు జోన్లలోని దాదాపు 744.22 కి.మీ.ల రోడ్ల నిర్వహణను రూ.2491 కోట్లకు అయిదేళ్ల పాటు (2025-2030) వరకు నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించింది. నగరంలోని మొత్తం 30 సర్కిళ్లలో సీఆర్ఎంపీ రోడ్ల స్ట్రెచ్ లుగా విభజించి, ఈ రోడ్డు సీఆర్ఎంపీకి చెందినదిగా బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.

ఫోన్లు చేసినా స్పందన కరువు

నిర్వహణ పరమైన ఫిర్యాదులు, సూచనల కోసం ఫోన్ నెంబర్లను కూడా సూచించారు. కానీ రోడ్ల నిర్వహణకు సంబంధించి సామాన్యులు, కొన్ని సందర్భాల్లో జీహెచ్ఎంసీ అధికారులు, ఇంజనీర్లు ఫోన్లు చేసినా, స్పందన వచ్చేది కాదు. ఈ రకంగా సీఆర్ఎంపీ-1 ప్రాజెక్టులో భాగంగా నిర్వహణ పనుల్లో పారదర్శకత, పనులకు సంబంధించి జవాబుదారి తనం లేని సీఆర్ఎంపీ రెండో దశ ప్రాజెక్టును కొనసాగించేందుకు అధికారులు ప్రతిపాదనలను సిద్దం చేయటం, బుధవారం జరగనున్న కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ముందుకు ప్రతిపాదనలు రావటం చర్చనీయాంశంగా మారింది. సీఆర్ఎంపీ-1లో కేటాయించిన సుమారు 744.22 కి.మీ.ల రోడ్లకు మరిన్ని రోడ్లను జోడించి, మొత్తం 1142.54 కి.మీ.ల రోడ్ల నిర్వాహణను రానున్న అయిదేళ్ల పాటు (2025-2030) ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేందుకు, అందుకు రూ. 3825 కోట్లకు మంజూరీ కోరుతూ బుధవారం జరగనున్న కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ముందు ప్రతిపాదనలు పెట్టేందుకు అధికారులు, పాలక మండలి సిద్దం కావటం చర్చనీయాంశంగా మారింది.

Also Read: Kishan Reddy: అభివృద్ధి కాదు, అవినీతి పెరిగింది.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్!

అగ్రిమెంటు ఏం చెబుతుంది?

ఆరేళ్ల అయిదేళ్ల క్రితం అప్పటి గులాబీ సర్కారు రోడ్ల నిర్వహణను ప్రైవేటుపరం చేస్తూ కాంప్రహెన్సీవ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రొగ్రాం (సీఆర్ఎంపీ) ని తెరపైకి తీసుకువచ్చింది. అప్పట్లో ఏజెన్సీలతో జీహెచ్ఎంసీ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక్కో కిలోమీటరు కొత్త రోడ్డు వేసి, అయిదేళ్ల పాటు దాని నిర్వహణను చేపట్టేందుకు కనిష్టంగా సుమారు రూ. 3 కోట్ల నుంచి గరిష్టంగా రూ. 4 కోట్ల వరకు కేటాయించారు. ఈ కాంట్రాక్టును పొందిన ఏజెన్సీలు అయిదేళ్ల పాటు ఆ రోడ్డులో స్వీపింగ్ పనులతో పాటు మరమ్మతులు, గ్రీనర్ మెయింటనెన్స్ వంటి ఇతరత్రా నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. కానీ ఏజెన్సీలు అగ్రిమెంట్ ప్రకారం పని చేయకపోయినా, చర్యలు తీసుకోవటంలో అధికారులు విఫలమవుతున్నారు. పైగా కోట్లాది రూపాయలు కట్టబెట్టిన ఏజెన్సీలు మెడలు వంచి పని చేయించాల్సిన అధికారులు సికిందరాబాద్, ఎల్బీనగర్ జోన్లలో సీఆర్ఎంపీ రోడ్లలో స్వీపింగ్ చేసేందుకు స్వీపింగ్ మిషన్లను అద్దె ప్రాతిపదికన ఎంగేజ్ చేసి, మరో రకంగా బల్దియా నిధులను జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. గత గులాబీ సర్కారులోని కొందరు పెద్దలకు జీహెచ్ఎంసీ నిధులను సంతర్పణ చేసేందుకే సిద్దం కాగా, గులాబీ పాలన బాటలోనే నడుస్తున్న ప్రజాపాలనలోని పెద్దలు కూడా జీహెచ్ఎంసీ నిధులను రోడ్ల నిర్వహణ పేరిట ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టేందుకు సిద్దమయ్యారన్న ఆరోపణలు లేకపోలేవు.

ఒక్కో కిలోమీటరకు అయిదింతలు నిధులు కేటాయింపు

కానీ ఎలాంటి రోడ్డునైనా ఒక్కో కిలోమీటరకు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వేయవచ్చునని, దాన్ని సీజన్ నుంచి సీజన్ వరకు కనీసం ఏడాది కాలం ఎలాంటి నిర్వహణ లేకుండా వినియోగించవచ్చునని కొందరు జీహెచ్ఎంసీ ఇంజనీర్లే బాహాటంగా చెబుతున్నారు. ఈ రకంగా లెక్కేసుకున్నా, అయిదేళ్లకు గాను కేవలం రూ. రెండు నుంచి రెండున్నర కోట్లలో కొత్త రోడ్డు నిర్మాణం, నిర్వహణ చేపట్టవచ్చునని, అందులో రోడ్ల నిర్వహణకు జీహెచ్ఎంసీలో స్పెషల్ గా మ్యాన్ పవర్, మిషనరీ ఉండటంతో వ్యయం మరింత తగ్గే అవకాశాలుండగా, నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించటం, ముమ్మాటికి జీహెచ్ఎంసీ నిధులను దారి మళ్లించి, ప్రైవేటు ఏజెన్సీలకు ధారదత్తం చేయటమేనన్న విమర్శలున్నాయి.

Also Read: Kaleshwaram Vigilance Report: కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక.. వారిపై క్రిమినల్ చర్యలు!

Just In

01

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది