IED Bombs: కర్రెగుట్టల్లో భారీగా ఐఈడి బాంబులు కలకలం
IED Bombs (imagecredit:swetcha)
Telangana News

IED Bombs: కర్రెగుట్టల్లో భారీగా ఐఈడి బాంబులు కలకలం

IED Bombs: కర్రెగుటల్లో భారీగా ఐడి బాంబులు కలకలం సృష్టిస్తోంది. పామునూరు శివారులోని కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు భారీగా అమర్చిన ఐఈడి(IED) బాంబులను భద్రతా బలగాలు గుర్తించాయి. రోడ్డు నిర్మాణ పనుల భద్రతను పర్యవేక్షిస్తున్న ఆర్ఎస్సిఓ(RSCO) బృందాలు అధునాతన పరికరాలతో తనిఖీలు చేపట్టారు. భూమిలో పాతిపెట్టిన మందు పాత్రలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పామునూరు శివారిలో ఇప్పటివరకు సుమారు వందకు పైగా ఐఈడి లను సాయుధ బలగాలు వెలికి తీసి నిర్వీర్యం చేశారు.

భద్రత బలగాల కదలికలను..

అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కర్రెగుట్టల పరిసర ప్రాంతాల్లో సుమారు 1000 కి పైగా బాంబులు భూగర్భంలో ఉండే అవకాశం ఉందని భద్రతా బలగాలు, నిఘవర్గాలు అంచనా వేస్తున్నాయి. రహదారి నిర్మాణాన్ని అడ్డుకోవడానికి భద్రత బలగాల కదలికలను సైతం నిలువరించడానికి గతంలోనే వీటిని అత్యంత వ్యూహాత్మకంగా మావోయిస్టులు అమర్చినట్లుగా సమాచారం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతమంతా ఒక మైండ్ ఫీల్డ్ ను తలపిస్తోంది. అక్కడి ప్రాంతంలో మొత్తం ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ సాయుధ భద్రత బలగాల పర్యవేక్షణలో రహదారి పనులు ఏమాత్రం ఆగకుండా ముందుకు సాగుతున్నాయి.

Also Read: MP Raghunandan Rao: బావ, బావమరిదితో అవ్వట్లలేదని కేసీఆర్ బయటికొచ్చాడు: రఘునందన్ రావు

కొండలు గుట్టల మధ్య..

ప్రత్యేకంగా మావోయిస్టులు భూగర్భంలో అమర్చిన ఐ ఈ డి బాంబులను బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ సాయంతో ఎప్పటికప్పుడు బయటపడుతున్న ఐ ఈ డిలను క్షేత్రస్థాయిలోనే నిర్వీర్యం చేస్తున్నారు. ముర్నూరు బేస్ క్యాంప్ నుండి ఉన్నతాధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తూ కూలీలకు యంత్రాలకు ఇటువంటి ప్రాణహాని కాల్ కాకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రహదారి పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేకమైన జాగ్రత్త చర్యలను పాటిస్తున్నారు. కొండలు గుట్టల మధ్య ఉన్న ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ రహదారి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులను చేపడుతుంది. మావోయిస్టుల రాబల్యం ఉన్నచోట అడ్డంకులు ఎదురైన జవాన్ల పహారాలో పనులు కొనసాగించేందుకు విశేషంగా కృషి చేస్తోంది. భూమిలో దాగి ఉన్న ల్యాండ్ మైండ్స్ను తొలగిస్తూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేస్తున్న భద్రతా బలగాల సాహసాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.

Also Read: Ministers Visit Villages : కొత్త సంవత్సరం నుంచి గ్రామాల్లో మంత్రులు డ్రైవ్.. వరుస పర్యటనకు ప్లాన్!

Just In

01

Open AI: చాట్‌జీపీటీ మెడకు చుట్టుకున్న యువకుడి మృతి కేసు

CM Chandrababu: అయోధ్య రామయ్య సన్నిధిలో ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రత్యేక పూజలు

Medaram Jatara: మేడారం ఆలయానికి భారీగా పోటెత్తిన భక్తులు

Bhatti Vikramarka: అభివృద్ధిలో మధిర పట్టణం ఉరకలు పెట్టాలి: భట్టి విక్రమార్క

Huma Qureshi as Elizabeth: యష్ ‘టాక్సిక్’ సామ్రాజ్యంలో ‘ఎలిజబెత్’గా హుమా ఖురేషి.. పోస్టర్ పీక్స్..