తెలంగాణ: Singareni workers: ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్స్, ఎయిమ్స్ తదితర కోర్సుల ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సింగరేణి కార్మికుల అధికారుల పిల్లలకు ఇప్పటివరకు ఇస్తున్న వార్షిక స్కాలర్ షిప్ మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతూ యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది.
అలాగే కనీస ర్యాంకును 2000 నుంచి 8000 లోపు వరకు పెంచినట్లు స్పష్టంచేసింది. కార్మికుల పిల్లలను ఉన్నత చదువులపై ఆసక్తి పెంచడానికి, ప్రోత్సహించడానికి 1998 లో ఈ స్కాలర్ షిప్ పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు తెలిపారు.
2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశ పరీక్షలకు హాజరై ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని ఏరియాల నుంచి జూన్ 15 లోపు దరఖాస్తులు పంపించాలని స్పష్టంచేశారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం సూచించింది.
Also Read: UPSC CSE 2024 toppers: సివిల్స్ ఫలితాల్లో తెలుగువారి మార్క్.. మన టాపర్లు వీరే!