Medaram Jatara: మేడారం మెయిన్ జాతర కంటే ముందే పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం(Lack of sanitation) దర్శనం ఇస్తోంది. జిల్లా పంచాయతీ అధికారి నిర్లక్ష్య ధోరణితో పారిశుద్ధ్య లోపం జరిగినట్లుగా భక్తులు చర్చించుకుంటున్నారు. నామ మాత్రపు పనులతో జాతరలో పారిశుద్ధ్యన్ని మమ అనిపిస్తున్నారు. ఈగల స్వైర విహారంతో భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పారిశుద్ధ్య లోపంతో భక్తులకు అంటూ వ్యాధులు ప్రబలడంతో పాటు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు.
Also Read: Sarpanch Rights: సర్పంచులపై బెదిరింపులకు దిగిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..!
పునరుద్ధరణ పనులతో..
మంత్రి సీతక్క నిత్యం మేడారం పునరుద్ధరణ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తున్నారు. అయినప్పటికీ మేడారం మెయిన్ జాతర రాకముందే పారిశుద్ధ్య లోపం జరుగుతుండడంతో భక్తులు అసౌకర్యాలకు గురవుతున్నారు. తెలంగాణ కుంభమేళగా, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారాన్ని పునరుద్ధరణ పనులతో తెలంగాణ(Telangana) ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులను చేపడుతుంది. వందల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపం, నామమాత్రపు పనులతో తీవ్ర పారిశుద్ధ్య లోపం దర్శనమిస్తోంది. నిత్యం అధికారులు మేడారంలో ఉంటూ పనులను పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ తీవ్రమైన పారిశుద్ధ్య లోపం పునరావృతం అవుతుంది. పారిశుద్ధ్య లోపం వల్ల పగలంతా ఈగలు, రాత్రి అయితే దోమలు భక్తులపై స్వైర విహారం చేస్తుండడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
Also Read: ND vs NZ 1st ODI: న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

