Medaram Jatara 2026: వనం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ట
చిలకలగుట్ట సిద్ధ బోయిన పూజారులు
చిలకల గుట్ట నుంచి సమ్మక్క ప్రతిరూపం కుంకుమ భరణి రూపం లో గద్దె పైకి
ఎదురు కోళ్లకు గుర్తుగా జిల్లా ఎస్పీ గాలిలో కాల్పులు
మూడు రోప్ బృందాల భద్రత నడుమ సమ్మక్క గద్దెకు పయనం
మేడారం స్వేచ్ఛ: చిలకలగుట్ట వనం నుంచి జనంలోకి సమ్మక్క ఆగమనం చేసింది. మేడారం సమ్మక్క గద్దెపైకి రాకముందే గిరిజన పూజారులు కంకవనం తీసుకొచ్చి మేడారం గద్దెలకు అతిసమీపంలో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద వనం పోతురాజు చెట్టు వద్ద ఉన్న గద్దెలపై ప్రతిష్ట చేసి ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు గద్దెల ప్రాంగణం నుంచి ఆదివాసీ సంప్రదాయ ప్రకారం సమ్మక్కను చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో తీసుకువచ్చేందుకు బయలుదేరి వెళ్లారు. అక్కడ సిద్ధబోయిన, కొక్కెర, పెనక, అర్రెమ్, మునుపటి వంశం కుటుంబ సభ్యులు మొత్తం ఐదుగురు సమ్మక్క కుంకుమ భరణి వద్ద 2 గంటల పాటు అత్యంత కట్టుదిట్టమైన పకడ్బందీ బందోబస్తు లో ప్రత్యేక అంతరంగిక పూజలు నిర్వహిస్తారు.
ఈ వంశీయుల్లో కొక్కెర కృష్ణయ్య ప్రధాన పూజారితో పాటు మరో నలుగురు పూజారులు కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెల వరకు తీసుకొస్తారు. అలా తీసుకొచ్చే సమయంలో ఎదురుకోళ్ల, ఆగమనానికి గుర్తుగా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ గాలిలో మూడు రౌండ్ల కాల్పులు జరుపుతారు.
Read Also- Municipality Elections: మహబూబాబాద్‌లో కాంగ్రెస్, సీపీఐ పొత్తుపై ఉత్కంఠ.. మధిరలో సమీకరణం ఎలా ఉందంటే?
5 రోప్ బృందాల భద్రత నడుమ గద్దెకు సమ్మక్క ఆగమనం
గురువారం సాయంత్రం మేడారం మహా జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. చిలకలగుట్ట నుంచి గిరిజన పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గద్దెల ప్రాంతానికి సమ్మక్కను తీసుకొచ్చే సమయంలో ఐదు రోప్ భద్రత నడుమ సమ్మక్కను గద్దె పైకి తీసుకొచ్చారు. సమ్మక్క తీసుకొచ్చే సమయంలో కొంతమంది ఉన్నతాధికారులు, ఐదు వంశాలకు చెందిన 50 మంది గిరిజనులు రోప్ నడుమ సమ్మక్క ప్రతి రూపంలో ఉన్న కుంకుమ భరణి ని గద్దెకి తీసుకొస్తున్న సమయంలో పాల్గొన్నారు. తుడుం దెబ్బ, ఆదివాసి, మూడంచెల పోలీస్ రోప్ లను పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో కట్టుదిట్టంగా నిర్వహించి సమ్మక్క గద్దెల రాకకు ఎలాంటి ఆటంకం భక్తుల నుండి కలువకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. సమ్మక్కను తీసుకొచ్చే సమయంలో, గద్దెల ప్రాంగణంలో, మేడారం జాతర మొత్తం 15000 మంది పోలీసులు మోహరించి భద్రతా చర్యలను చేపడుతున్నారు.
సమ్మక్కకు బంగారం ప్రీతిపాత్రమైంది
సమ్మక్క మేడారం సమీపంలోని చిలకల గుట్టలో అమ్మవారి ప్రతిరూపం కుంకుమ భరణి రూపంలో వెలసిన తర్వాత మేడారంలో వెదురు కంకవనం తీసుకొచ్చి గద్దెల వద్ద ప్రతిష్టించి పూజలు నిర్వహించేవారు. ఈ క్రమంలో అమ్మవారికి ఏం చెల్లించుకోవాలని భక్తుల సందేహానికి సమ్మక్క తన భర్త పగిడిద్దరాజు అంటే అమితమైన ప్రేమ ఉండడంతో పగిడిద్దరాజులో “పగిడి” అంటే బంగారం. బంగారాన్ని ఆదివాసీలు చెల్లించుకోలేరు కాబట్టి అదే కలర్ లో ఉన్న బెల్లాన్ని మొక్కుగా చెల్లించుకోవాలని సూచించినట్లుగా గిరిజన పూజారులు చెప్పారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణానికి వెలుపల ఉన్నప్పుడు బెల్లం, గద్దెల ప్రాంగణానికి లోపలికి వెళ్లి వనదేవతలకు సమర్పించుకున్నాక ‘బంగారం’గా పిలుస్తారని పూజారులు వెల్లడించారు.
Read Also- Annagaru Vostaru: ఓటీటీలోకి అన్నగారు వచ్చేశారు.. స్పందన ఎలా ఉందంటే?
మంత్రులు పొంగిలేటి సీతక్క.. కొండ సురేఖ సమ్మక్కకు స్వాగతం
చిలకలగుట్ట నుంచి మేడారంలోని సమ్మక్క గద్దె పైకి వచ్చే సమయంలో అమ్మవారి ప్రతిరూపం కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కకు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక స్వాగతం పలికారు. అమ్మగారికి ఇష్టమైన కుంకుమ, పసుపు, బెల్లం, కొబ్బరికాయ సమర్పించి గద్దె పైకి ప్రతిష్టించేందుకు తీసుకెళ్లారు. మేడారం ఆధ్యాంతం ఆధ్యాత్మికం కనిపించడంతో భక్తులంతా పులకించి పోయారు.

