Sabitha Indra Reddy: ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పై రేవంత్ వి మాటలే తప్ప చేతలు లేవు అని, అసలు ఆ స్కూళ్ల పై ప్రభుత్వానికే స్పష్టత లేదని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. కేవలం బిల్డింగ్ లు కడితే సరిపోతుందా?అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో గురువారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను ఏనాడు వ్యతిరేకించలేదన్నారు. ఎదుటి వాళ్ళ మీద సీఎం నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల అంచనా వ్యయాన్ని 80 కోట్ల నుంచి 200 కోట్లకు ఎందుకు పెంచారని నిలదీశారు.
Also Read: College Donations: డొనేషన్ల పేరుతో.. కళాశాలల దందాను అరికట్టాలి!
స్కూల్లకు ఇంకా బిల్డింగ్ లే పూర్తి కాలేదు ..అపుడే ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్ల ను ఏమి చేస్తారని నిలదీశారు. ఎంత మంది విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో అవకాశం ఇస్తారో చెప్పాలన్నారు. ఉన్న ప్రభుత్వ పాఠశాలలను రేవంత్ మూసేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే 2 వేల ప్రభుత్వ స్కూళ్ల ను మూసేశారన్నారు. గురుకులాల్లోనూ పరిస్థితులను దారుణం గా మార్చేశారన్నారు. మన ఊరు మనబడి ఈ ప్రభుత్వానికి ఎందుకు నచ్చలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యా వ్యవస్థ కేసీఆర్ పాలనలో మెరుగుపడిందన్నారు. గురుకులాల్లో నాణ్యత గల విద్య లభిస్తోందని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం లో వెల్లడైందన్నారు. మన ఊరు మనబడి కింద చేసిన పనులకు నిధులు కేటాయించాలని, ఓవర్సీస్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. ప్రతీ దానికి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు నిర్మిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం కాదు ..వాటిపై స్పష్టత నివ్వండి అనిడిమాండ్ చేశారు.
Also Read: Adi Srinivas: కవితపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు!