RSS Mohan Bhagwat: సమస్యల పరిష్కారం చర్చలతో సాధ్యం కాదు
RSS Mohan Bhagwat (imagecredit:twitter)
Telangana News

RSS Mohan Bhagwat: సమస్యల పరిష్కారం కేవలం చర్చలతో సాధ్యం కాదు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

RSS Mohan Bhagwat: కరుణ, విలువలు వంటి విషయాలను అంతా మరచిపోయామని, అవేమీ పట్టవన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) వ్యాఖ్యానించారు. కన్హా శాంతివనంలో విశ్వ సంఘ్ శిబిర్ ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరై మాట్లాడారు. సమస్యల పరిష్కారం కేవలం చర్చలతోనే సాధ్యం కాదని, ఎవరో ఒకరు ముందడుగు వేయాలన్నారు. కొలంబస్ గుడ్డు కథ ప్రకారం ఆలోచన సరళమైనదైనా.., ఆ పనిని చేయడానికి ధైర్యం కావాలని, చేసినవాడే మార్పునకు కారణమవుతారని వివరించారు. పిల్లి మెడలో గంట కథ ప్రకారం జరగాలని అందరూ కోరుకుంటారని, కానీ బాధ్యత తీసుకునే వ్యక్తి లేకపోతే ఎలాంటి మార్పు జరగదని వెల్లడించారు. డాక్టర్ హెడ్గేవార్ భావన ప్రకారం దేశంలో జరగాల్సిన కార్యాలు తన నుంచే ప్రారంభమవ్వాలని సూచించారు. స్వార్థంతో, భయంతో, బలవంతంతో, పేరు కోసం చేసే సేవ నిజమైన సేవ కాదన్నారు. నిస్వార్థంగా, ప్రతిఫలాపేక్ష లేకుండా, ప్రామాణికంగా చేసే సేవే నిజమైన సేవ అని మోహన్ భగవత్ వివరించారు. సేవనే పరమావధిగా భావించే వారే నిజమైన స్వయం సేవకులని కొనియాడారు. సంఘం పెరుగుతున్న కొద్దీ స్వయం సేవకుల సంఖ్య పెరుగుతోందని వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉన్నా వ్రతం మారదని, హిందూ ధర్మం, సంస్కృతి, సంప్రదాయం ప్రపంచానికి మార్గదర్శకాలు కావాలని సూచించారు. భారత్ ఆచరణే ప్రపంచానికి ఆదర్శం కావాలని, అదే ప్రత్యేక మార్గమని ఆకాంక్షించారు.

సైన్స్ అంటే ప్రశ్నించడమే..

అనంతరం భారత్ బయోటెక్ కో ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఎంటర్ ప్రెన్యూర్షిప్ అంటే సమాజంలోని సమస్యల పరిష్కారమని తెలిపారు. సైన్స్ అంటే ప్రశ్నించడమేనన్నారు. ఆలోచనలు విస్తృతంగా ఉంటే ఆవిష్కరణలు పుట్టుకువస్తాయని వ్యాఖ్యానించారు. దేశంలో స్వతహాగా ఎన్నో ఆవిష్కరణలు జరిగాయని, అందరికీ వాటి గురించి తెలియాలని పేర్కొన్నారు. తాను భారత్ బయోటెక్ అని పేరు పెట్టడం వల్ల రెండుసార్లు పెట్టుబడులు రాకుండా రిజెక్ట్ అయ్యాయిని, ఎందుకంటే ఆ పేరు చాలా పాతది అనుకున్నారని వెల్లడించారు. కానీ భారత్ బయోటెక్ పేరుతోనే తాను ముందుకు వెళ్లి, ఈ స్థాయికి చేరినట్లు వెల్లడించారు. కరోనా సమయంలో ఆఫ్రికా కోసం కూడా వ్యాక్సిన్ తయారుచేసి ఇచ్చామని, మోస్ట్ సేఫెస్ట్ వ్యాక్సిన్ ఏదంటే కోవ్యాక్సిన్ మాత్రమేనని తెలిపారు. టీబీ ముక్త్ భారత్ కోసం తాము పనిచేస్తున్నట్లు వెల్లడించారు. భారత్ అభివృద్ధిలో యువత పాత్ర చాలా కీలకమని కృష్ణ ఎల్లా వ్యాఖ్యానిఆంచారు.

Also Read: Noida: నోయిడాలో యువతి హత్య.. బాగ్‌లో దారుణ స్థితిలో మృతదేహం?

హిందూ సమాజాన్ని..

విశ్వానికేతన్ ప్రతినిధి శ్యాం పరాండే జీ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 6 విశ్వ సంఘ్ శిబిర్ సమావేశాలు ముగిశాయని, కన్హా శాంతివనంలో జరిగేది 7వ విశ్వ సంఘ్ శిబిర్ అని వివరించారు. ప్రతీ ఐదేళ్లకోసారి విశ్వ సంఘ్ శిబిర్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 1990లో మొదటి విశ్వ సంఘ్ శిబిర్ జరిగిందని ఆయన తెలిపారు. 2020లో హైదరాబాద్ లో ఈ సమావేశం జరగాల్సి ఉండగా కొవిడ్ కారణంగా జరగలేదని తెలిపారు. హిందూ సమాజాన్ని ఒక్కతాటిపైకి తీసుకురావడం. దేశ సంస్కృతి సంప్రదాయాలు, గొప్పతనాన్ని గురించి తెలుసుకోవడం, సొంత దేశానికి సేవ చేయాలనే ధృఢసంకల్పం నెలకొల్పడం. సేవా గుణాన్ని అలవరచడం దీని ప్రధాన ఉద్దేశ్యమని వివరించారు. ఈసారి శిబిర్ కు అత్యధికంగా 75 దేశాల నుంచి 1,610 మంది డెలిగేట్స్ వచ్చారని శ్యాం పరాండేజీ తెలిపారు. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ పేరుతో శాఖలు, విదేశాల్లో హెచ్ఎస్ఎస్ పేరిట శాఖలు జరుగుతాయని తెలిపారు. హెచ్ఎస్ఎస్ అంటే హిందూ స్వయం సేవక్ పేరుతో శాఖలు జరుగుతాయన్నారు.

ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం

ఆర్ఎస్ఎస్ కు, హెచ్ఎస్ఎస్ శాఖకు కొంచెం తేడా ఉంటుందన్నారు. వారంలో ఒకసారి హెచ్ఎస్ఎస్ లో కుటుంబ శాఖ ఉంటుందన్నారు. రక్షా బంధన్, గురు వందనం, దీపావళి, హోళీ పండుగలు విదేశాల్లో నిర్వహించి భారత సంస్కృతిని విదేశాల్లో ప్రమోట్ చేస్తున్నట్లు చెప్పారు. సేవా ఇంటర్నేషనల్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. సేవా ఇంటర్నేషనల్ ద్వారా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం సమయంలో 5 వేల మంది భారత్ విద్యార్థులను వెనక్కి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. 5 ఆఫ్రికా దేశాలకు చెందిన 1200 మంది స్టూడెంట్స్ ను సైతం వారి దేశాలకు తరలించినట్లు గుర్తుచేశారు. ఈ శాఖ నిర్వహిస్తున్నది ఒక మహిళ సంగీత తక్కర్ అని, తను యూకేలో ప్రచారక్ అని శ్యాంపరాండేజీ వివరించారు. దాదాపు 600 మంది మహిళలు,150 మంది యువకులు, 100 మంది బాలకిషోరులు ఇందులో పాల్గొన్నారని తెలిపారు. దేశంలో భారత్ మాతాకీ జై అంటామని, విదేశాల్లో విశ్వ ధర్మ్ కీ జై అంటామని తెలిపారు. విశ్వ సంఘ్ శిబిర్ ముగింపు కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ డీకే అరుణ, ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్టీ నేతలు, రామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ పటేల్, విశ్వ నికేతన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ భాటియా, శిబిరాధికారి బన్వరిలాల్ పురోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Adulterated liquor: ఖాకీ ముసుగులో కల్తీ మద్యం వ్యాపారం… కాపాడే ప్రయత్నాలు?

Just In

01

Medak Tragedy: మూడు కార్లలో గోవా టూర్.. తిరిగొస్తుండగా బిగ్ షాక్.. ముగ్గురు స్పాట్ డెడ్

Xiaomi 17 Ultra vs Google Pixel 10 Pro .. వీటిలో ఏ ఫోన్ బెస్ట్?

Telangana Women Died: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు అమ్మాయిలు మృతి

iPhone 16: భారత వినియోగదారుల ఫేవరెట్‌గా ఐఫోన్ 16.. అమ్మకాలలో అగ్రస్థానం

Sathupalli Medical Shops: సత్తుపల్లిలో అనధికార ‘సిండికేట్’ దందా!.. రెచ్చిపోతున్న మాఫియా..!