Thummala Nageswara Rao: చేనేత కార్మికులకు లక్ష వరకు రుణమాఫీ కోసం 16.27 కోట్లకు అదనంగా పరిపాలన అనుమతులు జారీ అయినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గతంలో 33 కోట్లు రూపాయలు నిధులు చేనేత కార్మికులు రుణమాఫి వారి అకౌంట్స్ లో జమ చేయుటకు ఆయా జిల్లాలకు విడుదల చేయడం జరిగిందనీ తెలిపారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. 1.4.2017 నుంచి 31.3.2024 వరకు లక్ష రూపాయలు వరకు ఉన్న చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలు మాఫీ కానున్నాయి. మొత్తం 6784 మంది చేనేత కార్మికులకు రుణమాఫీ ద్వారా లబ్ధి పొందుతున్నట్లు మంత్రి వెల్లడించారు.
Also Read: Thummala Nageswara Rao: నష్టపోయిన సోయాబీన్ రైతులకు న్యాయం చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సంక్షేమం కోసం దాదాపు 960 కోట్లు ఖర్చు
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి చేనేత కార్మికుల సంక్షేమం కోసం దాదాపు 960 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. చేనేత కార్మికులకు ఎల్లప్పుడు పని కల్పించాలనే ఉద్ధేశ్యంతో అన్ని ప్రభుత్వ శాఖలు టెస్కో నుండే వస్త్రాలు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు, అందుకు అనుగుణంగా ఇప్పటికే 896 కోట్ల విలువైన వస్త్రాలకు వివిధ ప్రభుత్వ శాఖల నుండి ఆర్ఢర్లు వచ్చాయని తెలిపారు.ఇందిరా మహిళాశక్తి చీరల పథకం ద్వారా 30 వేల మర మగ్గాలకు నిరంతరం పని కల్పించడానికి చర్యలు తీసుకున్నామన్నారు.
290 కోట్లను నేతన్నకు చేయూత
150 కోట్ల రూపాయలతో చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వం కార్మికులకు చెల్లించకుండా వదిలేసిన 290 కోట్లను నేతన్నకు చేయూత పథకం కింద కార్మికుల ఖాతాలలో జమ చేశామన్నారు. చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేసి చేనేత వస్త్ర ప్రదర్శన మరియు వర్కింగ్ క్యాపిటల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరంలో జిల్లా సహకార బ్యాంకులు ద్వారా 78 సహకార సంఘాలకు 19 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ మంజూరు చేశామని మంత్రి పేర్కొన్నారు. మా ప్రభుత్వం చేనేత కార్మికుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని మరోసారి మంత్రి తెలిపారు.
Also Read: Thummala Nageswara Rao: చేనేత కార్మికులకు పని కల్పించడమేప్రభుత్వ లక్ష్యం : మంత్రి తుమ్మల!

