R&B vs Finance Dept: ఆర్ అండ్ బీ ఫైనాన్స్ శాఖల మధ్య గ్యాప్ నెలకొన్నది. రెండు శాఖల మధ్య సమన్వయం కొరవడిందని స్వయంగా ఆఫీసర్లే చెప్తున్నారు. రెండు శాఖల మధ్య తాజాగా పైసల పంచాయితీ ఏర్పడింది. ఇటీవల ఆర్ అండ్ బీ శాఖ కు కేంద్రం నుంచి ప్రత్యేకంగా సీఆర్ ఎఫ్(సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్) రూ. 300 కోట్లకు పైగా నిధులు వచ్చాయి. ఆ నిధులను కూడా స్టేట్ ఫైనాన్స్ శాఖ వినియోగించినట్లు తెలిసింది. ఆ నిధులను వేర్వేరు వర్క్స్ లకు కేటాయించినట్లు సమాచారం. పైగా కేంద్రం నుంచి పట్టుబట్టి నిధులు రావడానికి కారణమైన ఆర్ అండ్ బీ(R&B) మంత్రి కి తెలియకుండానే ఫైనాన్స్ శాఖ ఆ ఫండ్స్ ను డైవర్షన్ చేయడం గమనార్హం. ఈ విషయంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Min Komati Reddy Venkat Reddy) కూడా తన అసహానాన్నివ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక ఇటీవల వర్షాలు, వరదలు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోనూ రోడ్ల డ్యామేజ్((Roads Damage)) జరిగింది. వీటికి తాత్కాలిక మరమ్మత్తుల తో పాటు శాశ్వత ప్లాన్ లను ఆర్ అండ్ బీ తయారు చేసి ఫైనాన్స్ శాఖకు అందజేసింది. కానీ నిధులపై ఆర్ధిక శాఖ నుంచి ఎలాంటి అప్రూవల్, క్లియరెన్స్ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లు ఎలా డెవలప్ అవుతాయని సచివాలయంలోని ఓ కీలక అధికారి ఆఫ్ ది రికార్డులో తెలిపారు.
పూర్తి స్థాయి రిపేర్లకు వెయ్యి కోట్లు…?
ఇటీవల కురుసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 781 ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు డ్యామేజ్ అయ్యాయి. 18 జిల్లాల్లో ఎక్కువ రోడ్ల నష్టం జరిగింది. అన్ని జిల్లాలు కలిపి శాశ్వత రిపేర్లకు రూ. 1062 కోట్లను ఆర్ అండ్ బీ ఇంజినీర్లు అంచనా వేశారు. తాత్కాలిక మరమ్మత్తులకు కనీసం రూ. 51.07 కోట్లు ఖర్చు అవుతాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం నుంచి కూడా ఆర్ధిక శాఖకు కమ్యూనికేషన్ జరిగింది. కానీ ఇప్పటి వరకు నిధుల కేటాయింపుపై ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆర్ అండ్ బీ శాఖ అధికారులు చెప్తున్నారు. రోడ్లు వెంటనే రిపేర్లు చేయాల్సిన అవసరం ఉన్నదంటూ తాజాగా జరిగిన మంత్రుల మీటింగ్ లోనూ చర్చ జరిగింది. కానీ ఖజానాలో డబ్బు లేదంటూ ఆర్ధిక శాఖ(Finance Department) డిలే చేస్తున్నట్లు సమాచారం.
Also Read: KCR: కలిసిరాని ఎర్రవల్లి రాజకీయం?.. రూటు మార్చిన గులాబీ బాస్!
రోడ్లతోనే మైలేజ్…?
ఓ ప్రాంతం అభివృద్ధి స్పష్టంగా కనిపించాలంటే రోడ్లు మెరుగ్గా ఉంటేనే సాధ్యమవుతుంది. ప్రభుత్వ అభివృద్ధి రోడ్ల తోనే తేటతేల్లమవుతుంది. మంచి రోడ్లు కనిపిస్తే ప్రభుత్వానికి ప్రజల్లో పాజిటివ్ సంకేతాలు పెరుగుతాయి. సర్కార్ కు మైలేజ్ వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక నిధుల కోసం కేంద్రం మంత్రులపై ప్రెజర్ పెట్టి మరీ విడుదల చేయించారు. వాటినీ స్టేట్ ఫైనాన్స్ వినియోగించడంపై మంత్రి కూడా గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మాన్ సూన్(MOON SOON) లో డ్యామేజ్ అయిన రోడ్లను వెంటనే రిపేర్లు చేయాల్సిన అవసరం ఉన్నదని ఆర్ అండ్ బీ ఇంజినీర్లు ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. ఇటీవల కొంత మంది ఎమ్మెల్యేలు సైతం రోడ్ల రిపేర్లు చేయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు రోడ్లు ఖరాబ్ ఉంటే నష్టం జరుగుతుందని వివరించారు. కానీ ఇప్పటి వరకు రోడ్ల రిపేర్లకు ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ కాలేదు.
మాన్ సూన్ డ్యామేజ్ వివరాలు…(అత్యధిక నష్టం)
ప్రాంతాలు- కోట్లు
ఆదిలాబాద్ 62.95
నిర్మల్ 38.52
ఆసిఫాబాద్ 69.45
నిజామాబాద్ 74.02
కామారెడ్డి 38.89
కరీంనగర్ 45.65
సిరిసిల్ల 24.18
ఖమ్మం 34.3
సత్తుపల్లి 30.57
భద్రాచలం 56.92
కొత్తగూడెం 48.30
మల్కాజ్గిరి 29.70
మెదక్ 52.98
నారాయణపేట్ 54.67
గద్వాల 63.30
వనపర్తి 28.45
నాగర్ కర్నూల్ 63.62
Also Read: Tummala Nageswara Rao: ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పై మంత్రి సమీక్ష.. లక్ష్యం చేరాల్సిందే!