Tummala Nageswara Rao (imagecredit:swetcha)
తెలంగాణ

Tummala Nageswara Rao: ఆయిల్ పామ్ ప్లాంటేషన్ పై మంత్రి సమీక్ష.. లక్ష్యం చేరాల్సిందే!

Tummala Nageswara Rao: ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 1.25 లక్షల ఎకరాలలో ఈ సంవత్సరంలోగా అన్ని కంపెనీలు ప్లాంటేషన్ పూర్తిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) ఆదేశించారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ అనుకున్న స్థాయిలో జరగకపోవడం పట్ల అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖమ్మం(Khammama), కొత్తగూడం(Kothagudem) జిల్లాలలో పురోగతి కొంతమేర ఉందని, ముఖ్యంగా భువనగిరి, నారాయణపేట, గద్వాల, జనగామ, సిద్దిపేట జిల్లాలలో చాలా తక్కువ స్థాయిలో ప్లాంటేషన్ జరిగిందని, లక్ష్యాన్ని పూర్తి చేయడానికి హార్టికల్చర్(Horticulture), సెరికల్చర్(Sericulture), అగ్రికల్చర్(Agriculture) శాఖల సిబ్బందిని వినియోగించుకోని, గ్రామాల వారీగా లక్ష్యాలను పెట్టుకొని, ప్లాంటేషన్ జరిగేలా చూడాలన్నారు.

ముఖ్యమంత్రి చేతుల మీదుగా

ఆయిల్ ఫెడ్ అధికారులతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. నర్మెట్టలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయిల్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ ఫ్యాక్టరీ ప్రారంభం కానున్న నేపథ్యంలో, సమయానికి అన్ని పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. కల్లూరుగూడం, గద్వాల జిల్లా బీచుపల్లిలో జరుగుతున్న ఆయిల్ పామ్ మిల్లుల నిర్మాణ పనుల పురోగతి గురించి కూడా మంత్రి సమీక్షించి, కల్లూరు గూడెం పనులను వచ్చే ఏడాది జూన్ కల్లా పూర్తి చేయాలని అన్నారు. బీచుపల్లి ఆయిల్ పామ్ కర్మాగార పనుల కోసం టెండర్లు వెంటనే పిలవాలన్నారు.

Also Read: Secunderabad Patny: గుడిలో అమ్మవారి విగ్రహం మాయం?.. ఎక్కడంటే!

బలోపేతం చేసేలా చర్యలు

ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌లో నిర్ధిష్ట దూరం పాటించినట్లయితే, మెకడమియా, కోకో(Co Co), అరికనెట్ వంటి అంతర పంటలను వేసుకోవచ్చని, దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం వస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఆయిల్‌ఫెడ్ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత 10 సంవత్సరాలుగా జరిగిన ఖర్చులపై ఆడిట్ నిర్వహించి, ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి, హార్టికల్చర్ సంచాలకులు యాస్మిన్ బాషా, ఆయిల్ ఫెడ్, హార్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు.

Also Read: Dear Eira Lyrical Song: నారా రోహిత్ సుందరకాండ నుంచి ‘డియర్ ఐరా’ వచ్చేసింది

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!