AI in TG Schools: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
AI in TG Schools (imagectedit:twitter)
Telangana News

AI in TG Schools: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కార్ బడుల్లో ఏఐ పాఠాలు..!

AI in TG Schools: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు పెరిగాయి. అలాగే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యపై కీలక ప్రణాళికలను రూపొందించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పాఠాలకు శ్రీకారం చుట్టింది. డిజిటల్ యుగానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నది. తద్వారా, ప్రభుత్వ బడుల విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించే అవకాశం ఉంటుంది. సర్కార్ విద్యార్థుల కోసం ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకుని నీట్, జేఈఈ కోచింగ్ ఫ్రీగా ఇస్తున్నది.

ఉచితంగా విద్యుత్ సరఫరా

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వాతావరణం కల్పించేందుకు కీలక చర్యలు చేపట్టారు. ఇకపై, అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇది పాఠశాలల నిర్వహణ వ్యయాన్ని తగ్గిస్తుంది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి సర్కార్ బడులన్నింటికీ ప్రభుత్వమే ఫ్రీ కరెంట్ ఇస్తున్నది. ఇందుకోసం ఏడాదికి రూ.140 కోట్లు భరిస్తున్నది. ఇక ఇంటర్ స్టూడెంట్లకు ఫ్రీగా టెక్స్ట్ బుక్స్ ఇస్తూ, కాలేజీ బిల్డింగ్‌ల కోసం రూ.93 కోట్లు ఖర్చు పెట్టింది. సర్కార్ కాలేజీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు స్పోర్ట్స్ మెటీరియల్ అందించింది. ఈ ఏడాది నుంచి కాలేజీలకు మెయింటైన్ చార్జీలను కూడా ప్రభుత్వం ఇస్తున్నది. అలాగే, కళాశాలలకు సొంత భవనాలను నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని యోచిస్తున్నది. తద్వారా అద్దె భవనాల్లో కొనసాగుతున్న కళాశాలలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

Also Read: Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

విద్య సంస్థల్లో నియామకాలు

విద్యా సంస్థల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల మంది టీచర్లు, లెక్చరర్ పోస్టులను భర్తీ చేసింది. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఎస్సీని రేవంత్ సర్కార్ క్లియర్ చేసింది. స్కూళ్లలో 10,006 టీచర్ పోస్టులను, ఇంటర్ కాలేజీల్లో 1,286 మంది జూనియర్ లెక్చరర్లను(జేఎల్), 40 లైబ్రేరియన్, 68 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసింది. ఈ నియామకాలతో విద్యా బోధనలో నాణ్యతను పెంచడంతోపాటు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించినట్టు అయింది. అంతేకాకుండా సర్కార్ బడుల్లో 34 వేల మంది టీచర్లకు ట్రాన్స్‌ఫర్లు, 25 వేల మందికి ప్రమోషన్లు ఇచ్చి వాళ్ల కష్టాలను తీర్చింది.

నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్

నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో, ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రతీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో సకల హంగులతో వీటిని నిర్మిస్తున్నారు. దీనికోసం ఏకంగా రూ.15,600 కోట్లు కేటాయించారు. దీనితో పాటు పాత బడుల రూపురేఖలు మార్చేందుకు ‘అమ్మ ఆదర్శ కమిటీల’ ద్వారా రూ.642 కోట్లతో రిపేర్లు, టాయిలెట్లు బాగు చేయించారు. 824 బడుల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్స్ కొత్తగా ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరం వెయ్యి బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు మొదలుపెట్టారు. ఈ పాఠశాలలు ఆయా నియోజకవర్గాల్లో ఆదర్శ విద్యా సంస్థలుగా నిలవాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నది. ఈ విప్లవాత్మకమైన మార్పులతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుందని, విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు లభిస్తుందని విద్యా శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: TG Christmas Celebrations: క్రిస్మస్ వేడుకలకు సర్కారు నిధులు.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క