RRR (imagecredit:twitter)
తెలంగాణ

RRR: రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు పై అనుమానాలు.. స్పష్టత ఇవ్వాలని సిపిఐ డిమాండ్

RRR: రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఆలైన్మెంట్ మార్పు, ప్రజల్లో వ్యక్తమవుతున్న అనుమానాలు, ఆరోపణలతో పాటు నిర్వాసితుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley) డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. 2013 చట్టం ప్రకారం పేర రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 6న సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో హైదరాబాదు(Hyderabada)లో హెచ్ఎండీఏ(HMDA) కార్యాలయం ఎదుట నిర్వాసితులతో ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రైతులతో మాట్లాడకుండా, గ్రామ సభలు, నిర్వహించకుండా, భూమి సేకరణలో స్పష్టతనివ్వకుండా బలవంతంగా భూములను తీసుకోవాలని ప్రయత్నం చేస్తే రైతుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

మొదటి అలైన్ మెంట్..

రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మొత్తం 8 జిల్లాలు, 33 మండలాలు, 163 గ్రామాల పరిధిలో 100 మీటర్ల వెడల్పుతో ఆ రోడ్డును నిర్మించాలని హెచ్ఎండీఏ(HMDA) నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. దీనికోసం భూములు తీసుకుంటామని, రైల్వే ట్రాక్ కోసం మరొక 40 అడుగుల వెడల్పుతో రోడ్డును పెంచుతామని ప్రభుత్వం చెబుతున్నదన్నారు. మొదటి అలైన్ మెంట్ తయారుచేశారని, తర్వాత దాన్ని మార్చి రెండోసారి ఆలైన్మెంట్, ఇప్పుడు మూడో అలైన్మెంట్ను తయారుచేసి విడుదల చేశారన్నారు. ఇందులో రాజకీయ అండదండలు, డబ్బు, పలుకుబడి ఉన్న వారి భూముల జోలికి వెళ్లకుండా లేకుండా ఎకరం, రెండు, మూడెకరాలున్న చిన్న, సన్నకారు రైతులకు సంబంధించిన భూములున్న ప్రాంతాన్నే రింగ్ రోడ్డు కోసం తీసుకుంటున్నట్లుగా పెద్దఎత్తున ఆరోపణలొస్తున్నాయన్నారు.

Also Read: Apple Watch: సముద్ర గర్భంలో యువకుడు.. ఇంతలో ఊహించని సమస్య.. హీరోలా కాపాడిన యాపిల్ వాచ్!

పెద్దల ప్రయోజనాల కోసం..

2013 చట్టం ప్రకారం గ్రామ సభల ద్వారా రైతుల ఆమోదం తీసుకోవాలన్నారు. భూమికి భూమి ఇవ్వాలనీ, మార్కెట్ రేటుకు మూడింతలు అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు తగిన విధంగా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రింగ్ రోడ్డు(RRR) అలైన్మెంటును ఎందుకు మార్చుతున్నారో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. కొద్దిమంది పెద్దల ప్రయోజనాల కోసం సామాన్యమైన చిన్నరైతుల జీవితాలను దెబ్బతీసే వైఖరిని మార్చుకోవాలని సూచించారు.

Also Read: Putin on PM Modi: మోదీతో పెట్టుకోవద్దు.. భారత్ ఎప్పటికీ తలవంచదు.. ట్రంప్‌కు పుతిన్ వార్నింగ్

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!