Local Body Elections: ఎన్నికలకు లైన్​ క్లియర్ అయినట్లేనా?
Local Body Elections ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
Telangana News, రంగారెడ్డి

Local Body Elections: ఆ జిల్లాలో నామినేషన్లు ప్రారంభం.. స్థానిక సంస్థల ఎన్నికలకు.. లైన్​ క్లియర్ అయినట్లేనా?

Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై (Local Body Elections) ఉన్న ఉత్కంఠకు తెరపడినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, హైకోర్టు నుంచి పూర్తిస్థాయిలో ఉత్తర్వులు వెలువడకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఇంకా కొంత సందిగ్ధత నెలకొంది. అయినప్పటికీ, ఎన్నికల అధికారులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ (నేడు) ఉదయం విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ వెలువడిన క్షణం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 21 జడ్పీటీసీ, 230 ఎంపీటీసీ స్థానాలకు, వికారాబాద్ జిల్లాలో 20 జడ్పీటీసీ, 227 ఎంపీటీసీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Also ReadBC Reservations: బీసీ రిజర్వేషన్లపై నేటికి వాయిదా పడ్డ విచారణ.. లైన్ క్లియర్ అయినట్టేనా?

దశ రంగారెడ్డి జిల్లా స్థానాలు వికారాబాద్ జిల్లా స్థానాలు నామినేషన్ల ప్రారంభం పోలింగ్ తేదీ

మొదటి దశ 10 జడ్పీటీసీ, 110 ఎంపీటీసీ 11 జడ్పీటీసీ, 115 ఎంపీటీసీ నేటి నుంచి (అక్టోబర్ 9) అక్టోబర్ 23
రెండవ దశ 11 జడ్పీటీసీ, 120 ఎంపీటీసీ 9 జడ్పీటీసీ, 112 ఎంపీటీసీ అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 27

నామినేషన్లు, ఓటర్ల సంఖ్య..

మొదటి దశలో నామినేషన్లకు అక్టోబర్ 11 చివరి గడువు కాగా, అక్టోబర్ 12న పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 15 మధ్యాహ్నం వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చి, సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. రెండవ దశలో నామినేషన్లు అక్టోబర్ 15తో ముగుస్తాయి. ఉపసంహరణకు అక్టోబర్ 19 మధ్యాహ్నం వరకు గడువు ఇచ్చి, సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా వెల్లడిస్తారు. ఈ రెండు దఫాల్లో జరిగే పోలింగ్‌లో రంగారెడ్డిలో 7,52,259 మంది, వికారాబాద్‌లో 6,98,472 మంది ఓటర్లు పాల్గొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మొత్తం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను నవంబర్ 11వ తేదీన లెక్కించనున్నారు.

మొదటి దశలో జరిగే ప్రాంతాలు..

జిల్లా మండలాల పరిధి
రంగారెడ్డి చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్​పల్లి, కందుకూర్, మహేశ్వరం, కడ్తాల్, అమన్​గల్లు, తలకొండపల్లి, శంషాబాద్.
వికారాబాద్ కొడంగల్, దౌల్తాబాద్, బోంరాస్‌పేట్, దుద్యాల్, బంట్వారం, వికారాబాద్, మర్పల్లి, ధారూర్, మొమిన్​పేట్, నవాబ్​పేట్, కొట్​పల్లి.

రెండవ దశలో జరిగే ప్రాంతాలు

జిల్లా మండలాల పరిధి
రంగారెడ్డి ఫారూక్‌నగర్, కొత్తూర్, నందిగామ, కేశంపేట్, కొందుర్గు, జిల్లేడ్​ చౌదరిగూడ, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్​మెట్, మంచాల్, యాచారం, మాడ్గుల.
వికారాబాద్ బషీరాబాద్, తాండూర్, యాలాల్, పెద్దెముల్, పూడూర్, పరిగి, దోమ, కుల్కచర్ల, చౌడపూర్.

Also Read: Andhra Pradesh: ఏపీ చరిత్రలోనే రికార్డు.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం.. ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే?

Just In

01

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!