Rajiv Yuva Vikasam (imagecredit:twitter)
తెలంగాణ

Rajiv Yuva Vikasam: రాజీవ్ యువ వికాసం బిగ్ అప్డేట్స్… పత్రాలు మంజూరు?

 Rajiv Yuva Vikasam: ఉపాధి అవ‌కాశ‌ల క‌ల్పన కోసం రాజీవ్ యువ వికాసం ద్వారా జూన్ 2న ల‌బ్దిదారుల‌కు మంజూరు ప‌త్రాలు అంద‌జేస్తామని మంత్రి సీతక్ర అన్నారు. ల‌క్ష లోపు యునిట్లకు మొద‌టి ద‌శ‌లో ప్రొసిడింగ్స్ ఇవ్వాల‌ని ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం రోజున ఎంపికైన ల‌బ్దిదారుల‌కు ప్రభుత్వం పత్రాల‌ను మంజూరు చేయనుందని, మంత్రి సీతక్క తెలిపారు.

మంత్రి సీత‌క్క

తెలంగాణ నిరుద్యోగ యువ‌త‌కు ఇచ్చిన‌ మాట‌ను నిల‌బెట్టుకున్న ప్రభుత్వం మాదని, ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాల‌ను క‌ల్పిస్తూనే మ‌రో వైపు స్వయం ఉపాది అవ‌కాశాల‌ను క‌ల్పిస్తున్నామని అన్నారు. మొద‌టి విడ‌త‌లో రూ. ల‌క్ష లోపు యునిట్లకు ప్రొసిడింగ్స్ ఇవ్వాల‌ని ప్రభుత్వ నిర్ణయించిందని తెలిపారు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న నిరుద్యోగులంతా రాజీవ్ యువ వికాసాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నిరుద్యోగుల పాలిట వ‌రంగా రాజీవ్ యువ వికాసం నిలుస్తోంది. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు, పేద య‌వ‌త జీవితాల్లో వెలుగులు నింప‌డానికే రాజీవ్ యువ వికాసం పథకం తీసుకొచ్చామని మంత్రి సీతక్క అన్నారు.

Also Rread: GHMC officials: మళ్లీ మునక తప్పదా?.. పూడికతీత పనులపై అనుమానాలు ఎన్నో?

16.22 లక్షల దరఖాస్తలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న రాజీవ్‌ యువ వికాసం పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రేపటితో ముగియనుంది. మొత్తం 16.22 లక్షల మంది ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోగా కమిటీలు పరిశీలన చేపట్టి అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. రేపు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రుల ఆమోదంతో కలెక్టర్లు తుది జాబితాలు ఖరారు చేయనున్నారు.

రూ.6 వేల కోట్లు

జూన్‌ 2 నుంచి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు. ఈ ఏడాది 5 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. మూడు నెలల్లో విడతల వారీగా రూ.6 వేల కోట్లు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పనకు ఇవ్వనున్నారు.

Also Read: MP Raghunandan: కవిత కొత్త పార్టీ వెనక కేసీఆర్.. త్వరలో పాదయాత్ర.. బీజేపీ ఎంపీ

 

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్