Rajiv Swagruha Plots: స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం
Rajiv Swagruha residential layout with developed buildings and infrastructure
Telangana News, లేటెస్ట్ న్యూస్

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు వేలం

రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 137 ప్లాట్లు
మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ
ఫిబ్రవరి 7-8 తేదీల్లో బహిరంగ వేలం
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న 137 ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ (Rajiv Swagruha Plots) నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా తొర్రూర్, కుర్మల్ గూడ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్‌పల్లి ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి చెంది మౌలిక వసతులతో ఉన్న ప్లాట్లకు ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతమ్ సోమవరం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆయా ప్రాంతాలను బట్టి బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరల్లోనే చదరపు గజానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అప్‌సెట్ ప్రైస్‌తో ఈ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. తమ ఆకాంక్షలు, అభిరుచులకు అనుగుణంగా సొంత స్థలంలో ఇంటిని నిర్మించుకోవాలనుకుంటున్న వారికి ఈ ప్లాట్లు చాలా అనుకూలంగా ఉంటాయని గౌతమ్ తెలిపారు. మంచి కనెక్టివిటితో ఎలాంటి వివాదాలు లేని క్లియర్ టైటిల్, ప్రభుత్వ యంత్రాంగమే ఈ లేవుట్లను అభివృద్ధి చేయడం, కొనుగోలు చేసిన వెంటనే భవన నిర్మాణాలను చేపట్టేందుకు వీలుగా ఉన్న ఈ ప్లాట్లకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్లాట్ల కొనుగోలుకు గతంలో పెద్ద ఎత్తున స్పందన రావడంతో మరోసారి ప్లాట్లను వేలం ద్వారా విక్రయిస్తున్నామని ఆయన తెలిపారు. వీటి కొనుగోలుపై ఆసక్తి ఉన్నవారు నిర్ణీత ధరావతును మీ-సేవా కేంద్రాల్లో ఆన్ లైన్/యూపీఐ ద్వారా చెల్లించవచ్చని, అలాగే డీడీ ద్వారా కూడా చెల్లించవచ్చన్నారు. ఓఆర్ఆర్-ఆదిభట్ల, ఐటీ కారిడార్ కు సమీపంలోని తొర్రూర్ లేఔట్ లోని ప్లాట్లకు ఫిబ్రవరి 7, 8 వ తేదీన, ఓఆర్ఆర్ సమీపంలోని బహదూర్ పల్లి, శంషాబాద్ ఎయిర్ పోర్టు కు దగ్గర్లో ఉన్న కుర్మల్ గుడ ప్రాంతాల్లోని ప్లాట్లకు ఫిబ్రవరి 8వ తేదీ మధ్యాహ్నం బహిరంగ వేలం నిర్వహిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు www.swagruha.telangana.gov.in వెబ్ సైట్ సందర్శించాలని వివరించారు. ఫోన్ నంబర్లు 8121022230 (తొర్రూర్), 8347472106 (బహదూర్ పల్లి), 7993455802 (కుర్మల్ గూడ) నంబర్లను సంప్రదించవచ్చన్నారు.

Read Also- RTC Officer Died: ఆర్‌టీసీ డిప్యూటీ ఆర్‌ఎం వెంకట్ రెడ్డి పాడె మోసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

అందుబాటులో ఎన్ని ప్లాట్లు ఉన్నాయంటే?

తొర్రూర్-105 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. చదరపు గజానికి కనీస ధర(అప్ సెట్ ప్రైస్) రూ.25 వేలు కాగా ఇవి 200-500 చదరపు గజాల విస్తీర్ణం లో ఉన్నాయి. బహదూర్ పల్లి-12 ప్లాట్లు ఉన్నాయి. 200-1000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ లేఔట్ లోని కార్నల్ ప్లాట్ కు చదరపు గజానికి కనీస ధర రూ.30 వేలు, ఇతర ప్లాట్లకు రూ. 27 వేలుగాను నిర్ధారించారు. కుర్మల్ గుడ-20 ప్లాట్లు ఉన్నాయి. 200-300 చదరపు గజాల విస్తీర్ణంలో ఉండగా చదరపు గజానికి రూ.20 వేలు కనీస ధరగా నిర్దారించి బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నారు.

దరఖాస్తుకు ఆఖరు తేదీలు

తొర్రూర్ ప్రాంతంలోని ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపేవారు రూ. 2 లక్షల ధరావతుతో ఫిబ్రవరి 6 తేదీలోగా, బహదూర్ పల్లిలోని ప్లాట్లకు రూ.3 లక్షలు, కుర్మల్ గుడలోని ప్లాట్లకు రూ.2 లక్షల ధరావతుతో ఫిబ్రవరి 7 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Read Also- Bandla Ganesh: ఇది రాజకీయ యాత్ర కాదు.. దయచేసి విమర్శలు చేయకండి

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!