Push-pull train [image credit: twitter]
తెలంగాణ

Push-pull train: వరంగల్ నుండి హైదరాబాద్ కు పుష్ పుల్ ట్రైన్? ఎంపీ కావ్య ఏమన్నారంటే?

Push-pull train: వరంగల్ నుంచి హైదరాబాద్ కు పుష్​ పుల్ రైలు సర్వీస్ ను ప్రారంభించాలని ఎంపీ కడియం కావ్య కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను కోరారు. ఈ మేరకు ఆమె శుక్రవారం కేంద్ర మంత్రిని ప్రత్యేకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ…వరంగల్ నుండి నిత్యం వేలాది మంది ప్రయాణికులు ,విద్యార్థులు, ఉద్యోగులు, రోజువారీ కూలీలు, కార్మికులు వారి ప్రయాణ అవసరాల కోసం రైలు సేవలపై ఆధారపడుతున్నారని వివరించారు.

ప్రస్తుతం వరంగల్ నుండి హైదరాబాద్ మార్గంలో నడిచే చాలా ఎక్స్‌ప్రెస్ , ప్యాసింజర్ రైళ్లలో సాధారణ కంపార్ట్‌మెంట్లు కిక్కిరిసి ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. చాలా మంది ప్రయాణికులు రిజర్వ్ చేసిన టిక్కెట్లను కొనుగోలు చేయడం లేదా ఆర్టీసీ బస్సులపై ఆధారపడడంతో ముఖ్యంగా బలహీన వర్గాల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు.

 Also Read: Hyderabad Drinking water: హైదరాబాద్ లో నీటి సరఫరాకు అంతరాయం.. ఎక్కడెక్కడంటే?

ఈ నేపథ్యంలోనే వరంగల్, హైదరాబాద్ మధ్య పుష్-పుల్ లోకల్ రైలు సర్వీసును తక్షణమే ప్రారంభించాలని రిక్వెస్ట్ చేశారు. ప్రయాణికుల సౌకర్యం కొరకు బోగీల సంఖ్యను పెంచాలని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అభ్యర్థించారు. కాజీపేట లోకో రన్నింగ్ డిపో ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, ప్రస్తుతం కాజీపేటలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈ ప్ర‌తిపాదన‌ల‌పై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్ సానుకూలంగా స్పందించిన‌ట్లు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!