TS Local Elections
తెలంగాణ, రంగారెడ్డి

Panchayat Elections: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే తేదీ అదేనా?

Panchayat Elections: స్థానిక సమరానికి రంగారెడ్డి జిల్లా సంసిద్ధం!

ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం
జిల్లాలో తగ్గిన ఎంపీటీసి స్థానాలు
వికారాబాద్‌లో పెరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీల సంఖ్య
ఇప్పటికే కౌటింగ్ కేంద్రాలు సిద్ధం
ఈనెల 10న నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్

స్వేచ్ఛ, రంగారెడ్డి బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలు (Panchayat Elections) నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు బిజీబిజీగా ఉన్నారు. త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అధికారులు వడివడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించి ఆయా పార్టీలు కూడా సమాయతం అవుతున్నాయి. ఎన్నికలకు సంబంధించి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అధికారులు కౌంటింగ్ కేంద్రాలు కూడా సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కూడా సంబంధిత అధికారులు పూర్తి చేశారు. ఇదిలావుంచితే, పోలింగ్ కేంద్రాలకు అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది కేటాయింపు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించిన అధికారులు వారికి ఎన్నికల నియమావళికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు, అవకతవకలు జరగకుండా పక్కాగా నిర్వహించాలని ఉన్నత అధికారులు భావించి అందుకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు.

రంగారెడ్డి జిల్లాలో తగ్గిన ఎంపీటీసీలు
గత ఎన్నికల కంటే రంగారెడ్డి జిల్లాలో ఎంపీటీసీల స్థానాలు తగ్గాయి. మున్సిపాలిటీలకు సమీపంలో ఉన్న గ్రామాలను పురపాలికల్లో విలీనం చేయడంతో ఎంపీటీసీల స్థానాలు రంగారెడ్డి జిల్లాలో గణనీయంగా తగ్గాయి. జిల్లాలో గతంలో 21 మండలాలకు కలిపి 258 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 21 జడ్పీటీసీలు, 230 ఎంపీటీసీలు ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలో గతంలో 17 జడ్పీటీసీలు, 224 ఎంపీటీసీలు ఉండగా, ప్రస్తుతం 20 జెడ్పీటీసీలు, 227 ఎంపీటీసీలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్, సరూర్‌నగర్, బాలాపూర్, హయత్ నగర్, శేరిలింగంపల్లి, గండిపేట మండలాలను పూర్తిగా అర్బన్ మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లేవు.

Read Alsoo- 50 Years of NBK: బాలయ్య చేసిన ఆ పాత్ర ఎన్‌టి రామారావు కూడా చేరలేరేమో.. ఈ మాట అంది ఎవరో తెలుసా?

ఈ నెల 10న నోటిఫికేషన్?
ఈనెల 10న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవలే వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించి రాష్ట్ర అధికారులు ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఆయన చెప్పినట్టుగానే  10న నోటిఫికేషన్ వస్తుందని అధికారులు ఇప్పటికే కింది స్థాయి అధికారులను ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. దానిని అసెంబ్లీలో ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో గవర్నర్ వద్దకు ఫైలు పంపిన విషయం తెలిసిందే. ఆఫైల్ రాష్ట్రపతి వద్ద ఉండటంతో మరో సారి 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెస్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆర్డినెన్స్ తోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లో కేటాయించేందుకు సిద్ధమవుతోంది. అందుకు సంబంధించి పక్కా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి గణనీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గ్రామాల్లో తమ సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది. రిజర్వేషన్ల అంశంతో ఇతర పార్టీలను బలంగా దెబ్బ కొట్టాలని హస్తం పార్టీ ముందుకు సాగుతోంది.

సిద్ధమవుతున్న పార్టీలు..
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో వివిధ పార్టీల నాయకులు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎలక్షన్‌లో తమ పార్టీల సత్తా చాటాలని బలంగా భావిస్తున్నారు. అందుకు సంబంధించి ఆయా పార్టీలు ఇప్పటికే ప్రణాళికలను రచిస్తున్నాయి. త్వరలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొన నుంది.

Read Also- Director Krish: అనుష్క విశ్వరూపాన్ని చూస్తారు.. ‘ఘాటి’పై దర్శకుడు క్రిష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Just In

01

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్