BC Reservation Bill (image CREDIT: TWITTER)
తెలంగాణ

BC Reservation Bill: ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్

BC Reservation Bill: సీఎం రేవంత్ రెడ్డి, (Revanth Reddy )మంత్రి ఉత్తమ్ కుమార్ మరోసారి ఢిల్లీకి వెళ్లారు. బీసీ రిజర్వేషన్‌పై బిల్లుపై ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీల రిజర్వేషన్స్ పెంచడం, దాని ఆవశ్యకత, దేశంపై బీసీల ప్రభావం వంటివన్నీ ఆయన వివరించనున్నారు. దీంతో పాటు తెలంగాణలో పూర్తి చేసిన కులగణన వంటి అంశాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉన్నది. ఇక, ఈ నెల 21 నుంచి జరగబోయే సమావేశాలలో బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్ వేదికగా పోరాటం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Also Read: Water Disputes: తెలంగాణ ప్రతిపాదనలే ఎజెండాలో చేర్చాలి

9వ షెడ్యూల్‌లో చేర్చాలి

అంతేగాక ఇండియా కూటమి ఎంపీలతో ప్రధాన మంత్రిని కూడా కలవాలని అపాయింట్‌మెంట్‌ను కోరారు. ఉభయ సభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదంతో పాటు 9వ షెడ్యూల్‌లో చేర్చాలని సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల నినాదం దేశ వ్యాప్తంగా వినిపించే దిశగా జాతీయ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుండగా, బీసీ రిజర్వేషన్‌ల‌పై ఇతర పార్టీలు ఏం నిర్ణయం తీసుకున్న తమకే కలిసి వచ్చేలా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తున్నది. కాగా, సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) మీడియాతో మాట్లాడనున్నారు.

 Also ReadWarangal Crime: రాష్ట్రంలో ఘోరం.. పక్కా ప్లాన్‌తో భర్తను లేపేసిన భార్య.. ఎలాగంటే?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!