Ponguleti Srinivasa Reddy: ముస్లీం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
Ponguleti Srinivasa Reddy (imagecredit:twitter)
Telangana News

Ponguleti Srinivasa Reddy: ముస్లీం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..

ఖమ్మం స్వేచ్ఛ: Ponguleti Srinivasa Reddy: రంజాన్ పండుగను సోమవారం జరుపుకోనున్న సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలోని ముస్లింలందరికీ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.

నెల రోజులు ఎంతో నిష్ఠతో ఉపవాసాలు ఉండి.. ఆకలిదప్పుల విలువ తెలుసుకొని.. పవిత్రంగా జరుపుకునే పండగ ఇదని పేర్కొన్నారు. సహనం, త్యాగం, జాలి, దయ, సేవాగుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలనే దృఢ సంకల్పంతో..పిల్లలు, యువతకు దిశా నిర్దేశం చేసిన మాసం ఇదని తెలిపారు.

Also Read: BRS Rajatotsava Sabha: రజతోత్సవ సభపైనే గులాబీ ఫోకస్.. ప్లాన్స్ ఫలించేనా?

మహమ్మద్ ప్రవక్త ఆదేశానుసారం.. అనాది నుంచి నేటి వరకు ఫిత్రా పేరిట ఆహారం, వస్త్రాలు, నగదు రూపంలో పేదలకు సాయం చేస్తూ వస్తోన్న సంప్రదాయం ఎంతో గొప్పదని మంత్రి పొంగులేటి అభివర్ణించారు.

ఈద్గాలు, మసీదులలో ప్రత్యేక ప్రార్థనల నడుమ రంజాన్ పండుగను సంబురంగా జరుపుకోవాలని, ఈద్ ముబారక్, ఆత్మీయ శుభాకాంక్షలతో ఆనందం వెల్లివిరియాలని మంత్రి పొంగులేటి ఆకాంక్షించారు.

Also Read: Electricity Tariffs: ప్రజలకు భారీ ఊరట.. విద్యుత్ ఛార్జీల పెంపు లేనట్లే!

Just In

01

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!