Ponguleti Srinivas Reddy: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge)ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Min Ponguleti Srinivass Reddy) పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్న ఖర్గేను ప్రత్యేకంగా బెంగళూరులో కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై రిపోర్టు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి తన శాఖల్లోని స్కీమ్ లు, కార్యక్రమాలు, పాలసీలను వివరించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పధకం విజయవంతంగా అమలవుతోందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పధకం అమలు, చెల్లింపులు లబ్దిదారుల ఎంపిక విధానం, ఒక్కో ఇంటికి యూనిట్ కాస్ట్ తదితర అంశాలపై ఖర్గే కు వివరించారు.
పధకాలలో కేంధ్రం
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణ(Telangana) రాష్ట్రంలోనే పేదలకు ఐదు లక్షల రూపాయిలతో ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకునే సదుపాయాన్ని కల్పించిందని వివరించారు. ఇండ్ల పధకాలలో కేంద్రం ఇస్తున్న నిధులతోనే అన్ని రాష్ట్రాలు సరిపెడుతున్నాయని కానీ తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు లక్షల రూపాయిలతో నాలుగు వందల చదరపు అడుగులు తగ్గకుండా ఇండ్లను లబ్దిదారుడే నిర్మించుకునేలా పధకాన్ని రూపొందించామన్నారు.
Also Read: Medicine Nobel 2025: వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ అవార్డు.. ఏం సాధించారో తెలుసా?
లబ్దిదారుల ఎంపిక పూర్తికాగా..
రాష్ట్రంలో గడచిన పది సంవత్సరాలలో పేదలు ఆశించిన మేరకు ఇండ్ల నిర్మాణాలు జరగకపోవడంతో ఇందిరమ్మ ఇండ్లకు డిమాండ్ అధికంగా ఉందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మొదటి దశలో ఈ ఏడాది రూ.22,500 కోట్ల రూపాయిలతో నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. లబ్దిదారుల ఎంపిక పూర్తికాగా దాదాపు 3 లక్షలకు పైగా ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇంటి నిర్మాణ దశలను బట్టి లబ్దిదారులకు ప్రతి సోమవారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేస్తున్నామని తెలిపారు. ఇక గత ప్రభుత్వంలో దరణితో పేదలు ఎంతో ఇబ్బంది పడ్డారని, ఈ దఫా అలాంటి సమస్యలు లేకుండా భూ భారతిని తీసుకువచ్చి, ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. దీని వలన రైతులు, సామాన్యులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు, పాలసీలు తీసుకువచ్చామన్నారు.
Also Read: CM Revanth Reddy: హైకోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే.. పార్టీ పరంగా రిజర్వేషన్లు
