Ponguleti Srinivas Reddy (imagecredit:twitter)
తెలంగాణ

Ponguleti Srinivas Reddy: సీఎం సార్.. మా పాలిట దేవుడయ్యా.. సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులు..

ఖమ్మం భ్యూరో స్వేచ్చ: Ponguleti Srinivas Reddy: సీఎం రిలీఫ్ ఫండ్ తో నిరుపేదలకు ఎంతో ఊరట కలుగుతోందని, అనారోగ్యంతో సతమతమవుతూ వైద్యం చేయించుకోవటానికి ఇబ్బంది పడుతున్న ఎన్నో పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత కలుగుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండల లబ్ధిదారుల చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో జరిగింది.

ఖమ్మం రూరల్ మండలంలో 31మంది లబ్దిదారులకు సుమారు 9.5 లక్షలు విలువ చేసే చెక్కులను, తిరుమలాయపాలెం మండలంలో 24మంది లబ్దిదారులకు 6లక్షలు విలువ చేసే చెక్కులను అందించారు. చెక్కుల పంపిణీ అనంతరం నాయకులు మాట్లాడుతూ మంత్రి పొంగులేటి సిఫారసుతో నియోజకవర్గానికి చెందిన అనేక మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు అనతి కాలంలోనే చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆయన నేతృత్వంలో పాలేరు నియోజకవర్గం కొత్త పుంతలు తొక్కుందని అభివర్ణించారు.

Also Read: MLC Kavitha: కవితమ్మ కోరిక నెరవేరేనా? ఆ పదవి దక్కేనా? 

నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కావాల్సిన సౌకర్యాలను సమకూర్చేందుకు మంత్రి పొంగులేటి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే దాదాపుగా అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటుతో పాటు విద్యుత్ సమస్య లేకుండా చూడటం, చెక్ డ్యాంలను ఏర్పాటు చేయించడం మొదలగు అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజిక వర్గ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: CM Revanth Reddy: బడ్జెట్ సెషన్.. సీఎం రేవంత్ కు కలిసొచ్చిందా?

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!