Congress vs BRS (image credit:Twitter)
తెలంగాణ

Congress vs BRS: స్ట్రెచర్ పాలిటిక్స్.. ఏది నిజం? ఏది అబద్ధం?

Congress vs BRS: ఇటీవల తెలంగాణ పాలిటిక్స్ స్ట్రెచర్ చుట్టూ తిరుగుతున్నాయి. స్ట్రేచర్ నుండి స్ట్రెచ్చర్ వైపుకు ఒక్కసారిగా పాలిటిక్స్ మళ్లాయని చెప్పవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కేసీఆర్ లక్ష్యంగా స్ట్రెచ్చర్ కామెంట్స్ చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తాను ఆ మాట అనలేదని క్లారిటీ ఇచ్చారు. అసలేం జరిగింది? ఏది నిజం? ఏది అబద్దం?

తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధానంగా నీటి ప్రాజెక్ట్ లకు సంబంధించి బీఆర్ఎస్ అన్యాయం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఓ వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా, వీరి మధ్య కామెంట్స్ సెగ రేగుతోంది. సమ్మర్ సీజన్ ను తలపించే హీట్ పొలిటికల్ లో కనిపిస్తుంది. కాగా ఇటీవల తెలంగాణలో స్ట్రేచర్, స్ట్రెచ్చర్ లక్ష్యంగా విమర్శలు ఊపందుకున్నాయి.

ఇటీవల ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్ట్రేచర్ గురించి చెబుతూ.. పలు విమర్శలు చేశారు. ఆ కామెంట్స్ మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా సీఎం మాట్లాడారని బీఆర్ఎస్ భగ్గుమంది. కేసీఆర్ ను సీఎం స్ట్రెచర్ అంటూ కామెంట్స్ చేయడం ఏమిటని పలువురు బీఆర్ఎస్ నాయకులు మీడియా ముఖంగా అక్కసు వెళ్ళగక్కారు. ఇలాంటి కామెంట్స్ వినిపించడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తాను అలా అనలేదని సీఎం వివరణ ఇచ్చినా, బీఆర్ఎస్ లోని కొందరు నేతలు మాత్రం వదిలేలా లేరు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెన్షన్ చేసిన సమయం నుండి ఇదే రీతిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య హీట్ కామెంట్స్ సాగుస్తున్నాయి. ఇంతకు సీఎం రేవంత్ రెడ్డి అసలు ఆ మాట చెప్పారా లేదా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఓ వైపు చెప్పలేదు మొర్రో అంటూ సీఎం అంటున్నా, బీఆర్ఎస్ మాత్రం చెప్పారు అంటూ ఏకంగా అసెంబ్లీలోనే గళమెత్తింది.

సీఎం చెప్పారా? లేదా?
హైదరబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన “ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండుగ” కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని నియామక పత్రాలు అందజేశారు. ఆ తర్వాత తన ప్రసంగం ప్రారంభించిన సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం అంటే స్ట్రేచర్ చూపడం కాదని, ప్రజలకు సేవ చేయాలయన్నారు. ఉద్యోగం అనేది ఒక భాద్యతగా తీసుకోవాలని అప్పుడే ప్రజల మన్ననలు పొందుతామన్నారు. తనతో తమ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడే చెప్పారని, స్ట్రేచర్ ప్రదర్శించిన వారు స్ట్రెచ్చర్ ఎక్కినట్లు అన్నారన్నారు.

ఇలా సీఎం తనతో ఎమ్మెల్యే ఇలా అన్నారని సభలో చెప్పారు. స్ట్రేచర్ చూపి ఉద్యోగులు కూడా చెడ్డపేరు తెచ్చుకోవద్దంటూ సీఎం సూచించారు. ఈ కామెంట్స్ పై బీఆర్ఎస్ మాత్రం విమర్శల జోరు పెంచగా, సీఎం మాత్రం తాను కేసీఆర్ లక్ష్యంగా ఆ కామెంట్స్ చేయలేదని, వెయ్యేళ్లు కేసీఆర్ ఆయురారోగ్యాలతో బాగుండాలన్నారు.

Also Read: CM Revanth Reddy: ఆ 10 నియోజకవర్గాల గురించే చర్చ.. అసంతృప్తి దూరం చేసేందుకేనా?

బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు మాత్రం వదిలే ప్రసక్తే లేదనే రీతిలో సీరియస్ అవుతున్నారు. చెప్పని విషయాన్ని చెప్పారంటూ ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ అహర్నిశలు శ్రమిస్తుందని కాంగ్రెస్ అంటోంది. ఇలా తెలంగాణ పాలిటిక్స్ స్ట్రేచర్, స్ట్రెచ్చర్ చుట్టూనే తిరుగుతున్నాయి.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు