Kaleshwaram project (imagecredit:swetcha)
తెలంగాణ

Kaleshwaram project: చంచల్​ గూడ జైలుకు హరీరాం.. ఆస్తుల విలువ తెలిస్తే షాక్!

తెలంగాణ: Kaleshwaram project: అక్రమాస్తుల కేసులో అరెస్ట్​ చేసిన కాళేశ్వరం ఈఎన్సీ హరీరాంను పోలీసులు చెంచల్​ గూడ జైలుకు తరలించారు. మార్కెట్​ రేటు ప్రకారం చూస్తే ఇప్పటికే గుర్తించిన ఆస్తుల విలువ 5వందల కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ వర్గాలు తెలిపాయి. హరీరాం ఆయన కుటుంబ సభ్యుల పేరున ఉన్న మూడు బ్యాంక్​ లాకర్లను తెరవాల్సి ఉందని పేర్కొన్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టులో పలు లోటుపాట్లు ఉన్నాయంటూ ఎన్డీఎస్​ఏ రిపోర్టు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఏసీబీ అధికారులు షేక్ పేటలోని హరీరాం నివాసంపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. దాంతోపాటు హరీరాం బంధువులు, సన్నిహితుల ఇళ్ల్లల్లో కూడా సోదాలు జరిపారు. ఈ క్రమంలో షేక్​ పేట, కొండాపూర్​ లలో రెండు విల్లాలు, శ్రీనగర్​ కాలనీ, మాదాపూర్​, నార్సింగిలలో ఫ్లాట్లు, అమరావతిలో వాణిజ్య స్థలం హరీరాం ఆయన కుటుంబ సభ్యుల పేరన ఉన్నట్టు ఏసీబీ అధికారులు నిర్ధారించుకున్నారు.

Also Read: CM Revanth Reddy Tweet: లక్ష్యం ఇదేనంటూ.. సీఎం రేవంత్ భావోద్వేగ ట్వీట్..

దాంతోపాటు మర్కూక్​ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూములు, పటాన్​ చెరులో 20 గుంటల భూమి ఉన్నట్టు సోదాల్లో వెల్లడైంది. శ్రీనగర్​ కాలనీలో ఓ ఇల్లు కూడా ఉన్నట్టు తెలిసింది. బొమ్మలరామారాంలో ఆరు ఎకరాల మామిడితోట, ఫార్మ్​ హౌస్​ ఉన్నట్టుగా వెల్లడైంది. కొత్తగూడెంలో ఓ ఇల్లు కట్టిస్తున్నట్టు తెలిసింది.

ఇక, కుత్భుల్లాపూర్​, మిర్యాలగూడలో రెండు ప్లాట్లు, బీఎండబ్ల్యు కారు, రెండు ద్విచక్ర వాహనాలు, పెద్ద ఎత్తున బంగారు నగలు ఉన్నట్టుగా తేలింది. ఈ ఆస్తులకు సంబంధించిన వాటితోపాటు బ్యాంక్​ డిపాజిట్ల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టుగా స్పష్టం కావటంతో ఆయనపై కేసులు నమోదు చేశారు. జడ్జి 14 రోజుల రిమాండ్​ విధించటంతో చెంచల్​ గూడ జైలుకు తరలించారు.

Also Read: minister seethakka: మహిళా సంఘాల సక్సెస్ స్టోరీలకు పుస్తక రూపం ఇవ్వాలి.. మంత్రి సీతక్క !

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు