CM Revanth Reddy Tweet: హైదరాబాద్ లో నిర్వహించిన భారత్ సమ్మిట్ గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో తన లక్ష్యాన్ని పొందుపరచిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇది మన తెలంగాణ సత్తా అనే చాటిచెబుతూ ట్వీట్ చేయడంతో నెటిజన్స్.. సీఎం సార్.. మీరు సూపర్ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భారత్ సమ్మిట్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్‌లో 100 కంటే ఎక్కువ దేశాల నుండి 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో దాదాపు 100 మంది రాజకీయ పార్టీల ప్రతినిధులు, 40 నుండి 50 మంది మంత్రులు, దాదాపు 50 మంది సెనేటర్లు, పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. అంతేకాదు రాజకీయ సంస్థల అధిపతులతో పాటు ప్రఖ్యాత రంగాల నిపుణులు సైతం పాల్గొనడం విశేషం.
చివరి రోజు నిర్వహించిన సమ్మిట్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని పిలుపునిచ్చారు. అలాగే దేశ వ్యాప్తంగా సాగిన భారత్ జోడో యాత్ర గురించి, ఈ యాత్రకు తెలంగాణ ప్రజలు ఎలా బాసటగా నిలిచారో రాహుల్ వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం సాధించిన విజయాలను చెప్పారు.
ఓ వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, మరో వైపు రాష్ట్ర అభివృద్ది కోసం తాము ఎలాంటి చర్యలు తీసుకున్నది వివరించారు, మహిళల ఫ్రీ బస్ స్కీమ్ నుండి దావోస్ నుండి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల సాధన, రాజీవ యువ వికాసం స్కీమ్, ఫ్రీ కరెంట్, రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఫ్యూచర్ సిటీ, సుమారు 60 వేల ఉద్యోగాల భర్తీ, ఇలా తామ ప్రభుత్వం సాధించిన ఘనతను సమ్మిట్ ముందు ఉంచారు.
ఎక్కడెక్కడి నుండో హాజరైన అన్ని దేశాల ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఆతిధ్యాన్ని మెచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన చర్యలను మెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి ఒక్క సమ్మిట్ ప్రపంచం నలుమూలలకు తెలిసింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు.
Also Read: Mahesh Kumar Goud: కవిత వ్యాపారాలు, కేసీఆర్ కుటుంబం.. పై మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!
సీఎం ట్వీట్ ఆధారంగా.. వందకు పైగా దేశాలు.. వందల ఆలోచనల సంఘర్షణలు.. లక్ష్యం ఒక్కటే.. ప్రపంచ ప్రజాస్వామ్యానికి.. ప్రాణం పోయడం.. ప్రజల హక్కులలో.. సమానత్వాన్ని చాటడం.. రాహుల్ గాంధీ దిశానిర్దేశంలో.. అభివృద్ధిలోనే కాదు.. ప్రజాస్వామ్య పునరుజ్జీవనంలో సైతం.. ప్రపంచానికి దిక్సూచి తెలంగాణ అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు. ఇప్పటికే పలు వేదికల మీదుగా ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేస్తానన్న మాటకు కట్టుబడి ఇప్పటికే సీఎం రేవంత్, దావోస్ తో ఆ కల నెరవేర్చారని చెప్పవచ్చు.
అలాగే తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే కూడా యావత్ దేశాన్ని ఆకట్టుకుంది. ఇలా కాంగ్రెస్ మార్క్ పాలన సాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, భారత్ సమ్మిట్ విజయవంతం కావడంపై ప్రపంచానికి దిక్సూచిలా తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణ వేదికగా…
వందకు పైగా దేశాలు…
వందల ఆలోచనల సంఘర్షణలు…
లక్ష్యం ఒక్కటే…
ప్రపంచ ప్రజాస్వామ్యానికి …
ప్రాణం పోయడం.
ప్రజల హక్కులలో …
సమానత్వాన్ని చాటడం.శ్రీ రాహుల్ గాంధీ దిశానిర్దేశంలో…
అభివృద్ధిలోనే కాదు…
ప్రజాస్వామ్య పునరుజ్జీవనంలో సైతం…
ప్రపంచానికి దిక్సూచి… pic.twitter.com/GkDJaPk5ER— Revanth Reddy (@revanth_anumula) April 27, 2025