Tirumalagiri: వైమానిక దళ యూనిఫాం ధరించిన ఇద్దరు వ్యక్తులు మరో ఇద్దరు మహిళలతో కలిసి తిరుమలగిరిలోని మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్(Tirumalagiri Army College) కాలేజీలోకి వెళ్లటం తీవ్ర కలకలం సృష్టించింది. టెక్నో చౌక్ గేటు నుంచి లోపలికి ప్రవేశించిన వీళ్లు వీడియోలు, ఫోటోలు తీస్తుండగా అనుమానం వచ్చిన జవాన్లు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సరైన సమాధానాలు చెప్పకపోవటంతో వారిని తిరుమలగిరి పోలీసులకు అప్పగించారు. పహల్గాం దాడి ఆపరేషన్సింధూర్తోపాటు ఇటీవలే దేశవ్యాప్తంగా పేలుళ్లు జరపటానికి కుట్రలు పన్ని దొరికిపోయిన సికింద్రాబాద్(SikandraBad) నివాసి సమీర్ ఉదంతాల నేపథ్యంలో దీనిపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. అన్ని కోణాల్లో వీరిని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెలితే..
వింగ్ కమాండర్ రజత్ మిశ్రా పేరుతో
తిరుమలగిరి ప్రాంతంలోని ఆర్మీ కాలేజీకి రాకేశ్‌కుమార్, ఆశిష్కుమార్అనే వ్యక్తులు ఎయిర్ఫోర్స్యూనిఫాం(Air Force Uniform Fraudc) ధరించి ఆలియా ఆబ్షీ, నగ్మా భానులను వెంటబెట్టుకుని వచ్చారు. వింగ్ కమాండర్ రజత్ మిశ్రా పేరుతో తయారు చేసిన నకిలీ గుర్తింపు కార్డును నలుగురు లోపలికి ప్రవేశించారు. కాలేజీ క్యాంపస్‌లోని కీలక ప్రాంతాలను వీడియోలు, ఫోటోలు తీయటం మొదలు పెట్టారు. దాంతో అనుమానం వచ్చిన ఎయిర్ఫోర్స్ఇంటెలిజెన్స్జవాన్లు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఫోటోలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించగా నలుగురు సమాధానం చెప్పలేదు. ఇక, వారు చూపించిన ఐడీ కార్డు నకిలీదని తేలింది. దాంతో లెఫ్టినెంట్ కల్నల్ తిరుమలగిరి పోలీసులకు సమాచారం అందించారు.
ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ జరిపిన విచారణలో ఆర్మీ కాలేజీ క్యాంటీన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని రాకేశ్ కుమార్, ఆశిష్ కుమార్లు తమను తీసుకొచ్చినట్టుగా ఆలియా అబ్షీ, నగ్మా భూనులు తెలిపారు. వీడియోలు, ఫోటోలు తాము తీయలేదన్నారు. రాకేశ్ కుమార్, ఆశిష్కుమార్లు వాటిని ఎందుకు తీశారన్నది తమకు తెలియదని చెప్పారు. దాంతో వారిద్దరిని పోలీసులు సఖీ సెంటర్‌కు తరలించారు.
Also Read: Tony Blair Praises: రేవంత్ రెడ్డి విజన్ భేష్.. యూకే మాజీ పీఎం ప్రశంసలు!
పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్
కాగా, నకిలీ గుర్తింపు కార్డు చూపించి ఆర్మీ కాలేజీలోకి చొరబడ్డ రాకేశ్‌కుమార్, ఆశిష్కుమార్లను పోలీసులు నిశితంగా ప్రశ్నిస్తున్నారు. వారి బ్యాక్‌గ్రౌండ్ ఏంటన్నది తెలుసుకునే దిశగా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్లను విశ్లేషిస్తున్నారు. ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో ప్రశ్నిస్తున్నారు. దీనిపై హైదరాబాద్కమిషనర్సీ.వీ.ఆనంద్(CV Anand) మాట్లాడుతూ ఫేక్ఐడీ కార్డు(Fake ID Card) తో ఆర్మీ కాలేజీలోకి ప్రవేశించటాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నామన్నారు. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్(Operation Sindhoor) అనంతరం దేశవ్యాప్తంగా మిలటరీ సంస్థల వద్ద భద్రత మరింత కట్టుదిట్టమైందన్నారు.
ఇక, ఇటీవలే దేశవ్యాప్తంగా పేలుళ్లు సృష్టించటానికి కుట్రలు పన్ని దొరికిపోయిన సమీర్ నివాసం కూడా సికింద్రాబాద్ప్రాంతంలోనే ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిందితులు మిలటరీ ఏరియాలో వీడియోలు(Videos), ఫోటోలు(Photos) తీయటం అనుమానాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. గతంలో ఉగ్రవాద దాడులు జరిగినపుడు ఇలాగే ఫోటోలు తీశారన్నారు. ఈ క్రమంలోనే పట్టుబడ్డ నిందితులను నిశితంగా ప్రశ్నిస్తున్నట్టు తెలిపారు. నిజంగానే ఉద్యోగాల కోసం వచ్చారా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణాల్లో విచారిస్తున్నట్టు చెప్పారు.
Also Read: Rowdy Sheeter Arrest: ఓరి నీ తెలివి తగలెయ్య.. ఎలా వస్తాయ్‌రా ఈ ఐడియాలు.. ఇక నీకుందిలే!