UK EX PM Tony Blair Praises( image credit: twitter)
తెలంగాణ

Tony Blair Praises: రేవంత్ రెడ్డి విజన్ భేష్‌.. యూకే మాజీ పీఎం ప్రశంసలు!

Tony Blair Praises: తెలంగాణ స‌ర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్‌ 2047 విజ‌న్ అద్భుతంగా ఉన్నదని యునైటెడ్ కింగ్‌డ‌మ్ (యూకే) మాజీ పీఎం టోనీ బ్లెయిర్ (Tony Blair) ప్రశంసించారు. 1997 – 2007 మ‌ధ్య ప‌దేళ్ల పాటు యూకేకు ప్రధానమంత్రిగా, సుదీర్ఘకాలం ఇంగ్లండ్ రాజ‌కీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన టోనీ బ్లెయిర్ (Tony Blair) రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్న త‌ర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని నాయ‌కుల‌కు విజ‌న్, వ్యూహ‌ర‌చ‌న‌ వాటి అమ‌లుకు సహకరించాలనే ఉద్దేశంతో ‘టోనీ బ్లెయిర్ (Tony Blair) ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్’ ను స్థాపించారు. భార‌త్ పర్యటనలో ఉన్న ఆయనతో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)  స‌మావేశ‌మ‌య్యారు.

 Also Read: CM Revanth Reddy: హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌ 2 మంజూరు చేయండి!

అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం

ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో రైతులు, (Farmers)  యువత, (youth) మహిళలు వంటి విభిన్న వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు టోనీ బ్లెయిర్‌కు (Tony Blair) సీఎం తెలియ‌జేశారు. మానవ అభివృద్ధి సూచికల్లో అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పట్టణ, పట్టణ శివారు, గ్రామీణ ప్రాంతాల వారీగా తాము అమ‌లు చేయ‌బోయే సూక్ష్మ ప్రణాళికను తెలియ‌జేశారు. తెలంగాణ రైజింగ్ (Telangana Rising) 2047 ముఖ్య అంశాలను తెలియ‌జేస్తూ, ఈ విజన్‌ను 2025 డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వ రెండో వార్షికోత్సవం సందర్భంగా ప్రజలకు వెల్లడించనున్నట్లు సీఎం తెలిపారు.

భారత్ ఫ్యూచర్ సిటీ

సుస్థిరాభివృద్ధి దిశ‌గా (Revanth Reddy) రేవంత్ రెడ్డికి ప్రత్యేక ప్రణాళిక ఉంద‌ని టోనీ బ్లెయిర్ (Tony Blair) ఈ సందర్భంగా ప్రశంసించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ ((Young India Skills) యూనివర్శిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ వంటి ప్రాజెక్టులపై ఆసక్తి చూపారు. ఇరు నేత‌లు గంట‌కుపైగా స‌మావేశమైన అనంత‌రం తెలంగాణ రైజింగ్  (Telangana Rising) విజన్ రూపకల్పన, అమలులో భాగస్వామ్యానికి తెలంగాణ ప్రభుత్వం, (Telangana Goverment) టీబీఐజీసీ ప్రతినిధులు ఉద్దేశ పత్రాన్ని పరస్పరం మార్చుకున్నారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్, (Uttam) ఎంపీలు మల్లు రవి, (Mallu Ravi)  రఘువీర్ రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఏపీ జితేందర్ రెడ్డి,( Jithender Reddy)  రాష్ట్ర పరిశ్రామిక పెట్టుబడుల విభాగం సీఈవో జయేశ్ రంజన్, పారిశ్రామిక వాణిజ్య విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) తదితరులు పాల్గొన్నారు.

 Also Read: CM Revanth Reddy: రాష్ట్ర ప్రయోజనాలకు.. విరుద్ధంగా ప్రాజెక్ట్ ప్రతిపాదన!

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?