MGNREGA Scheme ( image credit: swetcha reporter)
తెలంగాణ

MGNREGA Scheme: ఉపాధి హామీ పథకంలో మార్పులు.. కార్మికులు ఎదుర్కొంటున్న సంక్షోభం!

MGNREGA Scheme: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదైనకార్మికులకు తొలగిస్తున్నారు. ఏకంగా మూడేళ్లలో 21లక్షల కార్డులకు రాష్ట్రంలో మంగళం పాడారు. కొత్తవారిని నమోదు చేయాలని ఉన్నా వారికి అవకాశం కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి దూరమవుతున్నారు. ఇంకోవైపు కేంద్రం పనిదినాలను తగ్గిస్తుండటంతో కార్మికులు ఉపాధి కోతపడుతుంది.

గ్రామాల్లో ప్రజల వలసలు నివారించి వారికి ఉపాధికల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్రం ప్రారంభించింది. అయితే సదుద్దేశ్యంతో పెట్టిన పథకానికి మళ్లీ కేంద్రమే నిర్లక్ష్యం చేస్తూంది. వేసవిలో ప్రజలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక చేయూత నిస్తుంది. అయితే ఈ ఉపాధి పథకంలో నమోదైన కార్మికులను వివిధ కారణాలతో ఓవైపు తొలగిస్తుంది. వారికి అవర్నెస్ కల్పించకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవడం లేదు.

తొలగించినవారి స్థానంలో కొత్తవారిని తీసుకోవడం లేదు. దీంతో గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ కష్టమవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. 2024– 25లో 91లక్షల మంది కార్మికులను కేంద్రం తొలగించింది. దేశవ్యాప్తంగా 119 లక్షల మంది కొత్త కార్మికులు ఈ పథకంలో చేరారు. అయితే అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడినట్లు అధికారుల లెక్కల్లోనే స్పష్టమవుతోంది.

 Also Read: BJP on GHMC Elections: జీహెచ్ఎంసీ మేయర్ కుర్చీపై బీజేపీ కన్ను.. లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికలతో స్ట్రాటజిక్ ఎంట్రీ!

రాష్ట్రంలో గత మూడేండ్లలో రాష్ట్రా వ్యాప్తంగా21 లక్షల మంది కార్మికులను తొలగించినట్లు ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఆధార్, బ్యాంక్ పాస్​ బుక్​ లింక్​ కాకపోవడం, తదితర కారణాలతో కార్డులు తొలగించారు. వాటి స్థానంలో కొత్త జాబ్​ కార్డులు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయినా ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని వ్యవసాయ కూలీలకు ఓ వైపు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మరోవైపు వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ’ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది.

ఉపాధిహామీ పథకంలో వంద రోజులు పనిచేసిన వారిని మాత్రమే ఈ పథకానికి అర్హులుగా నిబంధన పెట్టింది. దీంతో జాబ్​ కార్డుల కోసం ప్రతి గ్రామంలో వందలసంఖ్యలో దరఖాస్తులు వస్తున్నట్లు సమాచారం. కానీ తొలగిస్తున్న జాబ్ కార్డుల స్థానంలో కొత్తకార్డులు ఇవ్వకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Also Read: Gurukulam Admissions: గురుకులాల్లో ప్రవేశాలపై స్పష్టత లేదు.. తల్లిదండ్రుల అసంతృప్తికి ఎండ్ కార్డు ఎప్పుడు?

కేంద్రం ఉపాధి పని దినాల్లో కోత విధించింది. దీంతో మళ్లీ ప్రజలు వలసలబాటపట్టే అవకాశం లేకపోలేదు. ఉపాధిహామీ పథకంలో గతేడాది తెలంగాణ ప్రభుత్వం 12 కోట్ల పనిదినాలు పూర్తి చేసింది. ఈ సారి 6.5 కోట్లకు పనిదినాలను మాత్రమే కేటాయించింది. డిమాండ్ డ్రివెన్ గా కాకుండా సప్లై డ్రివెన్ గా ఉపాధి ప‌నులు కొన‌సాగించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. 2023–24 లో ఒక్కో ఇంటికి సగటున 47.71 రోజులు ఉండగా.. 2024–25 లో అవి 45 రోజులకు తగ్గాయి. తెలంగాణలో వంద రోజులు పనిచేసిన కుటుంబాల సంఖ్య తీవ్రస్థాయిలో తగ్గింది. వంద రోజులు పని చేసిన కుటుంబాల సంఖ్య కూడా1.35 లక్షల నుంచి 93 వేలకు తగ్గింది.

పని దినాలు 12.1 కోట్ల నుంచి12.2 కోట్లకు (1.1శాతం) పెరిగాయి. జాతీయ స్థాయిలో పని దినాలు మాత్రం 7 శాతం తగ్గాయి. అంటే ఈ విషయంలో తెలంగాణలో కొంచెం మెరుగ్గానే ఉంది. అంతేకాకుండా, రాష్ట్రంలో 32 జిల్లాలు ఉండగా.. 17 జిల్లాల్లో పనిదినాలు పెరిగాయి. ఇందులో ములుగు (38.5శాతం), కామారెడ్డి (24.6 శాతం), వరంగల్ (23.7శాతం) తొలి 3 స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో వ్యవసాయాధారిత వ్యయ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూమే 24న కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ లేఖ రాయగా.. జూన్ నుంచి పనిదినాల్లో క్షీణత కనిపించింది. రాష్ట్రంలో 2023-24లో 25.33 లక్షలతో పోలిస్తే 2024-25లో (26.68 లక్షలు) పనుల్లో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 5.3 శాతం పెరిగింది.

 Also Read: Libraries Across Telangana: విద్యార్థిని ఆశయసాధనకు.. సీఎం రేవంత్ సర్కార్ అండగా..

ఉపాధి పథకంలో కొత్త విధానాలను అమలు చేస్తుండటంతో ఏటా లక్షల సంఖ్యలో నిరుపేద కూలీలు ఉపాధికి దూరమవుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద పూర్తిచేసిన తెలంగాణకు హరితహారం, క్రీడా ప్రాంగణాలు, కల్లాలు, వైకుంఠధామాలకు సంబంధించి నిధులను కేంద్రం నిలిపివేసింది. నిబంధనలతో కొత్త పనులు పెరుగకపోవడంతో ఏటేటా కూలి తగ్గుతున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌ఆర్‌ఈజీఏ సాఫ్ట్‌ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌తో లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. కొత్త సాఫ్ట్‌వేర్‌విధానంతో కూలీలు ఉదయం, సాయంత్రం పనులకు తప్పనిసరిగా హాజరుకావాలని షరతులు విధించింది. ఒక గ్రామంలో ఉపాధి పని పూర్తయిన తర్వాతే మరో పని చేపట్టాలనే నిబంధన పెట్టడంతో పనులు ఆలస్యమవుతున్నాయి.

రాష్ట్రంలో ఉపాధి కూలీలు110.77 లక్షలు ఉండగా.. యాక్టివ్‌కూలీలు 54.85 లక్షల మంది ఉన్నారు. జాబ్‌కార్డులు 53.08 లక్షలు ఉండగా.. యాక్టివ్‌జాబ్‌కార్డులు 32.57 లక్షలు ఉన్నాయి. గడిచిన ఐదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కూలీలకు రూ.9,242.86 కోట్లు చెల్లించింది. ప్రభుత్వం స్పందించి కొత్తజాబ్ కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటుందా? లేకుంటే ఉన్నవారితోనే పనులు చేయిస్తుందా? అనేది చూడాలి. ఇప్పటికే కొంతమంది ఉపాధి లేక కుటుంబ పోషణ భారమవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని దృష్టిలో ఉంచుకోనైనా ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టాలని పలువురు విజ్ఞప్తులు చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!