Libraries Across Telangana (imagecredit:swetcha)
తెలంగాణ

Libraries Across Telangana: విద్యార్థిని ఆశయసాధనకు.. సీఎం రేవంత్ సర్కార్ అండగా..

 Libraries Across Telangana: తెలంగాణ రాష్ట్రం అంతటా గ్రంథాలయాలను స్థాపించాలనే ఆశయంతో ముందుకు వెళ్తున్న హైదరాబాదుకు చెందిన 8వ తరగతి విద్యార్థిని ఆకర్షణ సతీష్‌ కు తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ అయిన నెరెళ్ల శారద మద్దతు ప్రకటించారు. హైదరాబాదుకు చెందిన 8వ తరగతి విద్యార్థిని ఆకర్షణ సతీష్, దేశ వ్యాప్తంగా గ్రంథాలయాలను స్థాపించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

ఇప్పటివరకు ఆమె 20 గ్రంథా లయాలను విజయవంతంగా ఏర్పాటు చేయగా, మరిన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. అయితే ఆకర్షణ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నెరెళ్ల శారదను మర్యాదపూర్వకంగా కలిగి, తన అభియాన్‌కు మద్దతు కోరింది. రాష్ట్రంలోని నాలుగు కొత్త గ్రంథాలయాల స్థాపనకు ఈ సమావేశం కీలకంగా నిలిచిందని అన్నారు. వాటిలో రెండు కరీంనగర్ జిల్లాలో, మరికొన్ని గిరిజన ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు ఆకర్షణ తెలిపింది.

Also Read: Hyderabad Alert: హైదరాబాద్ లో పాక్ పౌరులు.. ఓయమ్మా ఇంతమంది ఉన్నారా?

ఈ కార్యక్రమాలకు శ్రీమతి శారద గారి సహకారాన్ని కోరింది. ఇంతకుముందు, తెలంగాణ ముఖ్యమంత్రి ఆకర్షణ సేవలకు అభినందనలు తెలియజేసి, ఆమె స్థాపించబోయే 25వ గ్రంధాలయం ప్రారంభోత్సవానికి హాజరవుతానని హామీ ఇచ్చారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆకర్షణ పనిని ప్రశంసించారు.

ఇప్పటి వరకు ఆమె తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో 20 గ్రంధాలయాలు స్థాపించిందని, సుమారు 6,000 పుస్తకాలు స్నేహితులు, బంధువులు, పొరుగువారు విరాళంగా ఇచ్చినట్లు ఆమే గుర్తు చేశారు. పఠన సంస్కృతిని పెంపొందించి, విద్య ద్వారా సమాజాన్ని సాధికారత దిశగా నడిపించేందుకు ఆకర్షణ చేసే కృషి మిగతా యువతకు ప్రేరణగా నిలుస్తోంది.

Also Read: స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Spring Onions Benefits: ఉల్లికాడ‌ల‌ వలన ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

Megastar Chiranjeevi: చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు వైరల్.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు!

MLC Kavitha: త్వరలో వారి చిట్టా బయటపెడతా అంటూ.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

Bigg Boss 9 Telugu: నువ్వు అమ్మాయిల పిచ్చోడివా.. ఎందుకు డిఫెన్స్ చోసుకోలేదు.. కళ్యాణ్‌ను రఫ్పాడించిన శ్రీజ!

KTR: తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది: కేటీఆర్