Gram Panchayat: జిల్లావ్యాప్తంగా గ్రామాలలో గ్రామపంచాయతీ పాలకవర్గాలు ఏర్పడ్డాయి ఈ క్రమంలో కొత్తగా ఎంపికైన సర్పంచులు మాజీ సర్పంచ్ వివాదం మేలుకొని ఉంది జిల్లాలోని మాజీ సర్పంచ్గా వారి పదవీకాలంలో చేసిన పనులకు సంబంధించి కోట్లలో బిల్లులు మంజూరు కావాల్సి ఉంది. మాజీ సర్పంచ్లు తమ పదవి కాలంలో చేసిన పనులకు అప్పటి బిఆర్ఎస్(BRS) ప్రభుత్వం బిల్లులను రెండు సంవత్సరాలు పూర్తయిన పెండింగ్ లో పెట్టింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే పరిస్థితి పునరావతమైంది. మాజీ సర్పంచులకు సంబంధించిన వారు కొత్తగా సర్పంచ్ పదవి బాధ్యతలను స్వీకరించిన చోట ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. కొత్తగా ఎంపికైన వారిలో అనేక మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఉన్నారు. మాజీ సర్పంచులలో ఎక్కువ మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాత బకాయిల చెల్లింపుల విషయంలో సానుకూలమైన నిర్ణయం కనిపించడం లేదు.
ఏ గ్రామంలో ఎంత బిల్లు
మాజీ సర్పంచ్ లు తమ బిల్లు బకాయిలను విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై పలుమార్లు పలు జిల్లాలలోని సర్పంచులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో మాజీ సర్పంచులు తమ సమస్యలను విన్నవించారు. స్పందించిన ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు ముందుగానే ఏ గ్రామంలో ఎంత బిల్లు పెండింగ్‌లొ ఉన్నాయని వివరాలను సేకరించింది. ఇప్పటివరకు ఎలాంటి నిధులను మంజూరు చేయకపోవడంతో బిల్లు బకాయిలు పెండింగ్ లోనే ఉండిపోయాయి.
Also Read: The RajaSaab: ఎన్టీఆర్ వివాదంపై అసలు విషయాలు చెప్పిన దర్శకుడు మారుతి.. ఎందుకు చేశారంటే?
పెండింగ్ బిల్లులకు నిధులు విడుదల చేస్తేనే
గ్రామాభివృద్ధిలో భాగంగా మాజీ సర్పంచులు చేసిన పనులకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను విడుదల చేస్తేనే బిల్లు బకాయిలు చెల్లించడానికి మార్గం అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది .గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం పెద్ద పంచాయతీలకు 10 లక్షలు, చిన్న పంచాయతీలకు ఐదు లక్షలు చొప్పున విడుదల చేస్తామని సీఎం కోస్గి మండల కేంద్రంలో సర్పంచులతో సమావేశమైన సందర్భంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పెండింగ్ బిల్లులకు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను విడుదల చేసేందుకు చర్యలు చేపడితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
పంచాయతీ కార్యదర్శులు ఖర్చులు సైతం
రెండు సంవత్సరాలుగా గ్రామపంచాయతీలలో పాలకవర్గం లేకపోవడంతో నిధులు లేని కారణంగా అత్యవసర పరిస్థితులలో పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్న గ్రామాలలో వివిధ కార్యక్రమాలకు వారి సొంత జేబులో నుంచి ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల గ్రామం పాలక వర్గాలు ఏర్పడడంతో రానున్న నిధులలో తమ ఖర్చులను ఇచ్చిన తర్వాతే మిగతా పనులకు కేటాయించాలని కోరుతున్నారు. ఓవైపు మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు మరోవైపు పంచాయతీ కార్యదర్శుల జి పీ ల కోసం చేసిన వ్యక్తిగత సొమ్ము ఖర్చులను రాబట్టుకునేందుకు శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాలలో మౌలిక వసతులు, అభివృద్ధి దృష్ట్యా పెండింగ్ లో ఉన్న బిల్లులకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
Also Read: Aadi Saikumar: రెండో సారి తండ్రి అయిన ఆది సాయికుమార్.. బేబీ బాయ్ పిక్స్ వైరల్..

