Mahesh Kumar Goud ( image credit: swetcha reporter)
తెలంగాణ

Mahesh Kumar Goud: రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ కృషి.. పిసిసి చీఫ్ అభివృద్ధి పై దృష్టి!

Mahesh Kumar Goud: రైతు క్షేమంగా ఉండాలని కోరుకునే ప్రభుత్వం మాది అని పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రైతుల పట్ల ప్రవర్తించిన తీరు ఇంకా గుర్తుంది అని, అధికారంలో ఉన్నప్పుడు రైతులు వరి కుప్పల మీద వేచి చూసిన దారుణాలు ఎన్నో జరిగినాయి అని, రైతుల మీద లాఠీఛార్జీలు, బేడీలు వేసిన చరిత్ర బిఆర్ఎస్ దన్నారు. కేంద్రంలో మోదీ రైతు వ్యతిరేక చట్టాలకు ఓటు వేసిన ఘనత దానికే దక్కిందన్నారు.

పార్టీ ಜಿಲ್ಲಾ కార్యాలయంలో మాజీ మంత్రి, బోదన్ ఎమ్మెల్యే సుధర్శన్ రెడ్డితో కలిసి మహేష్ కుమార్ గౌడ్ విలేఖరులతో మాట్లాడుతు..సన్నబియ్యం ప్రతి పేదవాడు తినాలన్నది కాంగ్రెస్ లక్ష్యం అని, ప్రతి ఒక్కరికీ నెలకి ఆరు కిలోల సన్నబియ్యం ఇస్తున్నామని ఆయన అన్నారు. వరి పండించిన రైతులకు క్వింటాలుకు రూ.500 అదనంగా బోనస్ ఇవ్వడం ద్వారా 25 నుండి 40 లక్షలకు సాగు పెరిగింది అని, ఇతర ఏ రాష్ట్రంలో పండని విధంగా వరి పంట మన దగ్గర పండింది అని, 2 లక్షల మెట్రిక్ టన్నుల దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరి దిగుబడి వచ్చిందని దీనికి కారణం ప్రభుత్వ ప్రోత్సాహకం అని ఆయన అన్నారు.

Also Read: KPHB Murder Mystery: కేపీహెచ్‌బీ హత్య కేసులో మిస్టరీ ఛేదించిన పోలీసులు.. భార్య, మరదలు, తోడల్లుని అరెస్ట్!

నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ల పూడిక తీస్తామని అన్నారు. జిల్లాకు నీరు రావాలని ప్యాకేజీ 21, 22, 23 తీసుకువచ్చిన ఘనత సుదర్శన్ రెడ్డిది అని, ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే సుదర్శన్ రెడ్డి కి పేరు వస్తుందని దానిని ఆపింది బిఆర్ఎస్ నాయకులని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు పూర్వ వైభవం తీసుకువస్తాం అన్నారు. ఇంకా లక్షల ఎకరాలకు నీరు అందిస్తాం అని, నిజామాబాద్ జిల్లా అంటే వ్యవసాయ జిల్లా అనే విధంగా ప్రయత్నం చేస్తూ గుత్ప, అల్లిసాగర్ మరమ్మతులు చేస్తామని అన్నారు.

వ్యవసాయం తెలిసిన వాళ్ళుగా నేను సుదర్శన్ రెడ్డి తో కలిసి మంత్రి ని, ప్రభుత్వాన్ని విన్నవించినా మేరకు జిల్లాకు వ్యవసాయ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల కల సాకారం చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఎంతో మంది క్రీడాకారులు తయారవుతున్న సందర్భంలో ఇక్కడ మినీ స్టేడియం, సింథటిక్ ట్రాక్ వస్తుంది అని, ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి ఇండోర్ స్టేడియం నిర్మాణం చేస్తున్నామన్నారు. పారిశ్రామిక విషయంలో ముందుకు వెళ్ళడానికి నందిపేట సేజ్ ను ముందుకు తీసుకువెళ్తాం అని, షుగర్ ఫ్యాక్టరీ స్థాపనకు సుదర్శన్ రెడ్డి కృషి చేస్తున్నారు అని అన్నారు. బిఆర్ఎస్ గుడ్డు మీద వెంట్రుకలు లెక్కపెడుతుంది అని, గడిచిన బిఆర్ఎస్ హయాంలో ఫ్యాక్టరీ తేలేదు అని, అదనంగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు కానీ ముసలి కన్నీరు కారుస్తున్నారు అని అన్నారు.

 Also Read: Mahesh Kumar Goud: మళ్లీ అధికారం మాదే.. పీసీసీ ఛీఫ్ కీలక వ్యాఖ్యలు!

10 సంవత్సరాల కాలంలో నిజామాబాద్ కు ఏం చేశారో ప్రశాంత్ రెడ్డి చెప్పగలడా ಅನಿ ప్రశ్నించారు. జిల్లాలో బిఆర్ఎస్ పని అయిపోయింది. దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు గురించి తెలుసుకుంటున్నారు అని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు, 500 బోనస్, సన్నబియ్యం పంపిణీ వంటి పనుల ద్వారా తెలంగాణ ప్రభుత్వం దేశానికి డిస్కూచిగా మారింది అని, కుల గణన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని, 42 శాతం రిజర్వేషన్ పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని, రాహుల్ గాంధీ ప్రతి సందర్భాలో తెలంగాణ గురించే మాట్లాడుతున్నారు అని అన్నారు.

నిజామాబాద్ జిల్లా అభివృద్ధి మా బాధ్యత అని, తెలంగాణలో ప్రజల చేత మెప్పు పొంది మళ్ళీ 90 సీట్లతో అధికారంలోకి వస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు