Jangaon: పెండింగ్ వేతనాలు చెల్లించాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు డిమాండ్
అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌కు వినతి సమర్పణ
జనగామ, స్వేచ్ఛ: పంచాయతీ కార్మికుల పొట్ట కొట్టొద్దని సీఐటీయూ జనగామ జిల్లా (Jangaon) అధ్యక్షుడు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం జనగామ జిల్లా కలెక్టరెట్‌లో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌ను కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పంచాయతీ కార్మికులను మల్టీ పర్పస్ వర్కర్లుగా మార్చి వెట్టి చాకిరి చేపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్టీ పర్పస్ విధానాన్ని అమలు చేస్తున్న జీవో నెంబర్ 51 కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికులకు మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామపంచాయతీలో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అదనపు కార్మికుల పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సమస్యలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఎన్నికల ముందు గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని రాపర్తి రాజు డిమాండ్ చేశారు. కార్మికులను రెండో పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి రామచంద్రం, జిల్లా నాయకులు బస్వ రామచంద్రం, ఏ సాంబయ్య, ఎన్ యాకన్న, సంగీ కరుణాకర్, డీ.నాగరాజు, వెంకటరెడ్డి, కే.సోమన్న, కే రాజు, తదితరులు పాల్గొన్నారు.
Read Also- Viral News: హెల్పర్‌కు స్టీరింగ్ అప్పగించి.. కొద్దిసేపటికే డ్రైవర్ మృతి.. ఏం జరిగిందంటే?
తెలంగాణలో పంచాయతీ వ్యవస్థలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను మల్టీ పర్పస్ వర్కర్లుగా (Multi-Purpose Workers – MPWs) మార్చిన విషయం తెలిసిందే. జీవో నంబర్ 51 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలు పేర్కొనగా, వాటి ప్రకారం, ఒక వ్యక్తి పలు వేర్వేరు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, వేతన భద్రత లేకుండానే కొత్త బాధ్యతలు అప్పగించారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్టీ పర్పస్ వర్కర్‌గా మారిన తరువాత కొత్త బాధ్యతలు పెరిగినా, వేతనం పెరగలేదని చెబుతున్నారు. వెట్టి చాకిరి మాదిరిగా రకరకాల పనులు చేయించుకుంటున్నారని మండిపడుతున్నారు. స్వచ్ఛత, మురుగునీరు, నీటి సరఫరా, వ్యర్ధాల తొలగింపు వంటి పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడుతున్నారు.
Read Also- Thammudu Movie re release: పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్‌గా ‘తమ్ముడు’ రీ రిలీజ్.. హంగామా మొదలైంది
చదువులకు తగిన అర్హతలను పరిగణనలోకి తీసుకోకుండా పనులు అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే, జీవో 51ను రద్దు చేయాలని, మల్టీ పర్పస్ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్లు చేస్తున్నాయరు. పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని, ఆన్‌లైన్‌లో అదనపు కార్మికుల వివరాలను నమోదు చేయాలని కోరుతున్నారు.