Local Body Elections: పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలిచి తీరాల్సిందే.. ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు.. నువ్వానేనా అన్నట్లు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందుకోసం ఖర్చుకు సైతం వెనుకాడటం లేదు. ఇజ్జత్ కా సవాల్ అని పేర్కొంటూ ప్రచారం స్పీడ్ పెంచారు. తటస్థ అభ్యర్థులపై సైతం ఫోకస్ పెట్టారు. యువతకు ప్రత్యేక ఆఫర్లు సైతం ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలివిడత పోలింగ్‌కు మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది. రెండో విడుత ఈ నెల14న, మూడో విడుత 17న పోలింగ్ జరుగనున్నది. అయితే, సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ఆశావహులు ఉవిళ్లురుతున్నారు. ఒక గ్రామంలో ఇద్దరు.. మరో గ్రామంలో ముగ్గురు.. ఇంకో గ్రామంలో నలుగురైదురు బరిలో నిలిచారు. అయితే, సర్పంచ్‌గా పోటీ బరిలో నిలిచినవారు మాత్రం గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. కులం, మతమంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు గెలవాల్సిందేనని.. లేకుంటే ఇజ్జత్ పోతుందని, ప్రెస్టేజ్ కా సవాల్(ఇజ్జత్ కా సవాల్).. ఆయన మీద నేను ఓడిపోతానా.. ఎంతవరకు అయినా పురస్తు అంటూ సవాల్ చేసి ప్రచారం ముమ్మరం చేశారు. అందుకోసం ఎంత ఖర్చు అయినా వెనుకాడేది లేదంటూ తేల్చి చెబుతున్నారు.. వచ్చిన అవకాశాన్ని వదులుకునేది లేదు.. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అంటూ ముందుకు సాగుతున్నారు. అందుకోసం అవకాశం ఉన్న దగ్గర అప్పులు తీసుకొస్తున్నారు.. అంతటితో ఆగకుండా ఆస్తులు(భూములు, ప్లాట్లు, ఇండ్లు) ఇలా కుదువపెడుతూ మరీ అప్పులు తెచ్చి ప్రచారం ముమ్మరం చేశారు.
గెలుపు కోసం ప్రయత్నాలు
గ్రామాల్లో ఉదయం వ్యవసాయ ఇతర పనుల్లో నిమగ్నమవుతున్న ప్రజలకు సాయంత్రం వేళల్లో ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారు. పోటీచేస్తున్న అభ్యర్థులు ఓటర్లకు మందు పార్టీలు ఇస్తున్నారు.. విందులు సైతం ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఓట్ల పండుగ మొదలైంది. గ్రామాల్లో సందడి నెలకొంది. ఒక సర్పంచ్ అభ్యర్థులే కాదు.. వార్డు సభ్యులు సైతం గెలుపుకోసం ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక్కో అభ్యర్థి వార్డు సభ్యుడిగా గెలుపొందేందుకు లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆ వార్డు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ఇంటిపెద్ద ను పిలుచుకొని పోయి దావత్‌లు ఇస్తున్నారు. తనకు ఓటువేయాలని అభ్యర్థిస్తున్నారు. అంతేకాదు కుల, మత సమీకరణలు చేస్తున్నారు. మన కులానికి సర్పంచ్ అవకాశం వచ్చింది.. గెలుద్దాం.. లేకుంటే ఇతర కులం ముందు మనం ఓడిపోయి తలదించుకోవద్దు.. అందరం ఏకతాటిపైకి వద్దాం.. గెలిపించుకుందా.. గ్రామంలో మన సత్తా చాటుదాం అని విజ్ఞప్తులు చేస్తూ రాజకీయ సమీకరణాలు చేస్తున్నారు.
Also Read: New Year Drugs Supply: న్యూఇయర్ వేడుకలకు డ్రగ్స్ సిద్ధం చేసి.. అడ్డంగా దొరికారు.. వాటి విలువ ఎంతంటే?
యువతకు స్పెషల్ ఆఫర్లు
యువతకు మాత్రం ఆఫర్లు ఇస్తున్నారు. క్రికెట్ గ్రౌండ్లతో పాటు లైబ్రరీ ఏర్పాటు, ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తామని, ఎమ్మెల్యే, మంత్రులు, ఎంపీలతో కలిసి ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషిచేస్తామని హామీలు ఇస్తున్నారు. అంతేకాదు టూర్లకు సైతం డబ్బులు ఇస్తామని చెప్పడంతో అందుకు ప్రణాళికలు సైతం రూపొందిస్తున్నట్లు సమాచారం. మరో వైపు యువతకు తాయిలాలు సైతం ఇస్తున్నట్లు సమాచారం. తటస్థ ఓటర్లపైనా అభ్యర్థులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వారిని ఆలయాలకు దర్శనాలు, టూర్లకు సైతం తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అంతిమంగా గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. దీంతో గ్రామాలు ఎన్నికల హీటెక్కింది.
Also Read: IND vs SA 2025 3rd ODI: వైజాగ్ వన్డేలో రాణించిన భారత బౌలర్లు.. టీమిండియా ముందు మోస్తరు టార్గెట్!

