Palle Pragati PS App: పల్లెల్లో చెత్త నివారణకు పకడ్బందీ చర్యలకు సిద్ధమైంది. నిత్యం మానిటరింగ్ చేసేందుకు అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏ గ్రామంలో ఎంత చెత్తసేకరిస్తున్నారు? ఆ చెత్తతో ఏం చేస్తున్నారు? సేకరించిన చెత్తను కాల్చుతున్నారా? లేకుంటే డంపింగ్ యార్డులో కాకుండా రోడ్డుపక్కన పారబోతున్నారా? అని తెలుసుకునేందుకు పీఎస్ యాప్ లో నూతనంగా ఒక ఆప్షన్ చేర్చారు. స్వచ్ఛదనం అని ఆప్షన్ ను చేర్చారు. ఇది వారం పదిరోజుల్లో అందుబాటులోకి రానుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కసరత్తులతో యాప్ కొలిక్కి వచ్చింది.
గ్రామాల్లో పారిశుధ్యం నిర్వహణకు ఎన్ని చర్యలు చేపట్టినా పంచాయతీల్లో చెత్త సేకరణ సరిగా ముందుకు సాగడం లేదు. సేకరించిన చెత్తను ఎక్కడో అక్కడ డంప్ చేస్తున్నారు. ఆ చెత్తకు నిప్పు పెట్టడంతో కాలుష్యం సైతం పెరుగుతుంది. వర్షాకాలంలో ఈ చెత్తతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డులు ఉన్నప్పటికీ అక్కడికి తరలించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పల్లెల్లో చెత్తపై ప్రభుత్వం నిఘాపెట్టింది. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. స్వచ్చదనం పెంచే దిశలో కార్యచరణ రూపొందించింది. స్వచ్ఛ పల్లెలే లక్ష్యంగా యాప్ నకు శ్రీకారం చుట్టింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కసరత్తులతో కొలిక్కి వచ్చింది. యాప్ ద్వారా నిత్యం చెత్త సేకరణ ప్రక్రియను పర్యవేక్షించడం ద్వారా గ్రామాల్లో స్వచ్చదనం పెరగనున్నది. చెత్త రహిత గ్రామాలుగా మారనున్నాయి. వారం పది రోజుల్లో యాప్ అందుబాటులోకి రానున్నది.
పీఎస్ యాప్ లో కొత్తఆప్షన్ స్వచ్ఛదనం:
గ్రామపంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణకు ఇప్పటికేయాప్ ఉంది. పంచాయతీ కార్యదర్శులకు మొబైల్ ‘పీఎస్ యాప్’ ను రూపొందించారు. అందులో పారిశుధ్య పనులు, చెత్త సేకరణ అంశాలను, పంచాయతీల నిర్వహణను ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేయాల్సి ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కార్యదర్శలు సమాచారం అప్ లోడ్ చేస్తున్నారు. అయితే ప్రతి రోజు కాలువలు, వీధులు, ఇన్ స్టిట్యూషన్లను శుభ్రపరిచే సమాచారం, ఫొటోలను ఆ యాప్ లో అప్ లోడ్ చేస్తున్నప్పటికీ కొంత నిర్లక్ష్యం, జాప్యం జరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి.
దీంతో ప్రభుత్వం అదే పీఎస్ యాప్ లో మరో నూతన ఆప్షన్ ను ప్రభుత్వంచేర్చింది. వేస్ట్ కలెక్షన్ మేనేజ్మెంట్ కోసం అదనంగా ఒక ఆప్షనను చేర్చారు.. ఆ ఆప్షన్ కి ప్రస్తుతానికి “స్వచ్ఛదనం” అనే పేరు పెట్టారు. ఈ ఆప్షన్ ద్వారా ప్రతి రోజు గ్రామంలో ఎన్ని నివాసాల నుంచి చెత్త సేకరించారు? ఎంత మేర చెత్త పోగయ్యింది, అందులో తడి చెత్త, పొడి చెత్త ఎంత వంటి సమాచారాన్ని అప్ లోడ్ ను పంచాయతీ కార్యదర్శులు చేయనున్నారు.
పర్యవేక్షణకు అధికారులు:
కార్యదర్శులు యాప్ లో అప్ లోడ్ చేసిన సమాచారాన్ని పర్యవేక్షించేందుకు అధికారులకు బాధ్యతలు అప్పగించింది. మండలస్థాయిలో కూడా ఒక అధికారికి మాటరింగ్ బాద్యతలు అప్పగించినట్లు సమాచారం. సేకరించిన చెత్తను ఎక్కడో ఒక చోట పడేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. చెత్తను సేకరించ వాహనానికి సైతం అవసరం అయితే జీఎస్ ను కూడా అమర్చబోతున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల్లో డంప్ చేయకుండగా డంపింగ్ యార్డులకు తరలించాల్సి ఉంటుంది. గ్రామాల్లో ఒక్కో వ్యక్తి కనీసం 100 గ్రాముల చెత్తను జనరేట్ చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
అనుగుణంగా ఆయా గ్రామంలో అంత మేర చెత్త సేకరణ జరగకపోతే..పారిశుధ్య నిర్వహణ సరిగా లేనట్లే అనేది స్పష్టమవుతోంది. అలాంటి సందర్భంలో పంచాయతీ కార్యదర్శిని అప్రమత్తం చేసి చేత్త సేకరణ ప్రక్రియను మెరుగు పరిచేలా ఆదేశాలను ప్రభుత్వం ఇచ్చింది. తడి చెత్తను 60 రోజులో ఎరువుగా మార్చాల్సి ఉంటుంది. కేజీ పొడి చెత్త 60 రోజుల్లో 150 గ్రాముల ఎరువుగా మారుతుంది. ప్లాస్టిక్, సీసాలు వంటి పొడి చెత్తను ప్లాస్టిక్ డిస్ పోస్ కేంద్రాలకు తరలించాలి లేక పోతే అమ్మేయాల్సి ఉంటుంది.
మంత్రి సీతక్క చొరవ:
పారిశుధ్య నిర్వహణకు మంత్రిసీతక్క ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. అందుకు అనుగుణంగా అధికారులకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు ఇస్తున్నారు. పర్యవేక్షిస్తున్నారు. పారిశుధ్య రహిత గ్రామాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
అందులో భాగంగానే పీఎస్ యాప్ లో కొత్త ఆప్షన్ ను స్వచ్ఛదనం పేరుతో తీసుకొచ్చారు. చెత్తపై మానిటరింగ్ చేయడంతో పాటు నిర్లక్ష్యం చేసే కార్యదర్శులు, అధికారులపైనా చర్యలకు సన్నద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రజలు గ్రామాల్లో పారిశుధ్య సమస్యలతో వర్షాకాలం ఇబ్బందులు పడకుండా ఇప్పటి నుంచే ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
Also Read: Jagga Reddy: రాజకీయాల్లో రాహుల్ గాంధీ హీరో.. జగ్గారెడ్డి సంచలన కామెంట్స్!