Operation Sindoor (imagecredit:swetcha)
తెలంగాణ

Operation Sindoor: ఆసుపత్రులపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. దవాఖాన్లకు ప్రత్యేక సింబల్స్!

Operation Sindoor: ఇండియా, పాకిస్థాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రులకు ఎలాంటి నష్టం జరగకుండా సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఆసుపత్రులపై ప్రత్యేకంగా రెడ్ మార్క్ సింబల్స్ వేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లు, మెటర్నిటీ అండ్ చైల్డ్ కేర్ యూనిట్లు, సెంట్రల్ మెడిసిన్స్ స్టోర్లపై రెడ్ క్రాస్ పెయింట్స్ వేశారు. ప్రతి ఆసుపత్రి రూప్ పై ఇలాంటి మార్క్ ను వేసినట్లు అధికారులు తెలిపారు. యుద్ధాలు జరిగే సమయంలో ఆసుపత్రులపై ఇలాంటి మార్కులు వేస్తారని, ప్రస్తుతం మన దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు ఈ మార్కులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ప్లస్ ఆకారంతో కూడిన ఈ రెడ్ మార్క్ ల వలన యుద్ధం సంభవించే సమయంలో ఆయా మార్క్ లపై ఎలాంటి దాడి జరగదనేది అధికారులు భావన. ఇవి యుద్ధ నిబంధనల్లో ఉంటాయని ఓ డాక్టర్ తెలిపారు. వీటి వలన పేషెంట్లకు రక్షణ లభించనున్నది. అంతేగాక గాయపడిన వాళ్లకు వైద్యం అందించేందుకు వెసులుబాటు ఉంటుంది. పరస్పర దాడుల్లో ఆసుపత్రులు డ్యామేజ్ అయితే, పేషెంట్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది.

అంతటా అలర్ట్..

డైరెక్టర్ ఆఫ్​ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలోని 51 దవాఖాన్లు ఉండగా, గురువారం సాయంత్రం వరకు 47 ఇనిస్టిట్యూషన్స్ కు రెడ్ మార్క్ లు వేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఇతర దవాఖన్లు కలిపి 124 ఉండగా, 112 కు మార్క్ లు పడ్డాయి. 33 సెంట్రల్ మెడిసిన్ స్టోర్ లు ఉండగా, 5 సీఎంఎస్ లకు మార్క్స్ వేశారు. అన్ని సంస్థలు కలిపి దాదాపు 164 చోట్ల రెడ్ మార్క్ లు వేసినట్లు అధికారులు తెలిపారు. మిగతా వాటికి శుక్రవారం సాయంత్రం వరకు పూర్తి చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.

Also Read: Miyapur Phase 5: అక్రమార్కులకు అధికారుల సపోర్ట్.. లబోదిబోమంటున్న బాధితులు!

వీటి వలన ఆసుపత్రుల్లో సేఫ్టీ లభించడమే కాకుండా, ఎమర్జెన్సీ లో కీలకంగా ఉపయోగపడుతుందని వైద్యులు వివరిస్తున్నారు. మరోవైపు ఆస్పత్రిలో ప్రతి డిపార్ట్మెంట్ లో ఎలక్ట్రిసిటీ, పార్కింగ్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఇలా ప్రతిదీ సమకూర్చుకుంటున్నారు. ఆధునాతన పరికరాలు, ఆక్సిజన్ సదుపాయం వంటివి కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆసుపత్రుల్లో పనిచేసే స్టాఫ్​ కు మాక్ డ్రిల్ వంటివి కూడా పూర్తి చేస్తున్నారు.

సెలవులు రద్దు…?

యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖల సెలవులు రద్దు చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. వార్ పరిస్థితుల్లో అవసరమయ్యే సౌకర్యాలు, సదుపాయాలు వంటివన్నీ ముందస్తుగానే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అన్ని దవాఖాన్లలో మూడు నెలల బఫర్ స్టాక్ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అత్యవసర వైద్యం నిమిత్తం వినియోగించే మందులన్నీ అందుబాటులో ఉండాలని కోరారు.

యుద్ధం జరిగే సమయంలో అన్ని విభాగాలు ఎమర్జెన్సీ విధానాల్లో వర్క్ చేయాలని ఆదేశాలిచ్చారు. ఇందుకు అవసరమైన స్టాఫ్​, సపోర్టెడ్ స్టాఫ్​, మందులను అందుబాటులో ఉంచుకోవడంతో పాటు డాక్టర్లు కూడా ఆసుపత్రుల్లోనే ఉండేలా ఆయా హెచ్ వోడీలు బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం నొక్కి చెప్పింది.

Also Read: Colonel Sophia Qureshi: ఎవరీ కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా.. ఈ ఇద్దరి ట్రాక్ రికార్డ్ చూస్తే…?

Just In

01

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం