Maoists Letter: నక్సల్స్ కేంద్ర ప్రభుత్వంపై ప్రయోగించిన శాంతి చర్చలకు సంబంధించిన నాలుగో లేఖ సత్ఫలితాలను ఇచ్చింది. గతంలో కర్రెగుట్టల ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నప్పటి నుండి మూడు లేఖలను మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వం శాంతిచర్చలకు అవకాశం ఇవ్వాలని ప్రయోగించిన ఫలితం ఆశించిన స్థాయిలో లభించలేదు. అదేవిధంగా శాంతి చర్చల కమిటీ బాధ్యులు సైతం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కలిసి చొరవ తీసుకొని శాంతి చర్చలు నిర్వహించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ మూడు లేఖలతో సరైన సమాధానం కేంద్ర ప్రభుత్వం నుంచి మావోయిస్టులకు అందలేదు.
దీంతో వివిధ కుల సంఘాలు, ప్రజాసంఘాలు, ఆదివాసీ సంఘాలు, వామపక్ష పార్టీలు, తెలంగాణ రాష్ట్రంలోని మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు వరంగల్ ఎల్కతుర్తి రజతోత్సవ సభలో మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని తీర్మానం చేసినట్లుగా ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మావోయిస్టుల చర్యలు శాంతి భద్రతల కు విఘాతం కలిగేలా పరిగణలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.
Also Read: Electrical Supply Stores: భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్‌కు సిద్దం.. సమీక్షలో కీలక నిర్నయాలు!
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని విజ్ఞప్తి కూడా చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం ఇక్కడ గమనార్హం. మావోయిస్టులు కేంద్ర కమిటీ సభ్యులు ఆదేశాలతో అధికార ప్రతినిధి జగన్ పేరిట నాలుగోసారి ప్రయోగించిన లేఖలో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపినట్టు అయితే ఆరు నెలల వరకు కాల్పుల విరమణను అమలు చేస్తామని పేర్కొన్నది.
నాలుగో లేఖకు స్పందించిన కేంద్రం
కర్రెగుటల ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు విభిన్న వాతావరణం అనుకూలించలేదు. అధిక ఉష్ణోగ్రతలకు డిహైడ్రేషన్తో భద్రత బలగాలకు తీవ్ర ఇబ్బందులు చోటు చేసుకున్నాయి. అనారోగ్యాలకు గురైన వారిని ప్రత్యేక హెలికాప్టర్లలో బీజాపూర్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. కర్రెగుట్టల ప్రాంతాన్ని అరవై శాతం వరకు తమ ఆధీనంలోకి తెచ్చుకున్న భద్రత బలగాలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులు విజ్ఞప్తి చేసిన నాలుగో లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
తెలంగాణ – చత్తీస్గడ్ సరిహద్దులు కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ లో భాగంగా కర్రెగుట్టల ప్రాంతంలో భద్రతా బలగాలు నిర్వహిస్తున్న కూంబింగ్ కు బ్రేక్ పడింది. సిఆర్పిఎఫ్ బలగాలు తక్షణమే సంబంధిత హెడ్ కోటర్స్ లో రిపోర్టు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. రేపు సాయంత్రం లోగా సంబంధిత కార్యాలయాల్లో భద్రతా బలగాలు రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. పాకిస్తాన్-భారత్ సరిహద్దు ప్రాంతంలో యుద్ధ వాతావరణం ఉద్రిక్త పరిస్థితులు చూడటం చేసుకున్న నేపథ్యంలో సి ఆర్ పి ఎఫ్, ఇతర కేంద్ర భద్రత బలగాలు వెనక్కి వెళ్లాలని ఆదేశించింది.
Also Read: Sarasvati Pushkaralu: పుష్కరాలకు ప్రత్యేక అధికారులు.. పారిశుధ్య లోపం తలెత్తకుండా చర్యలు!