Hyderabad Tourism (imagcredit:twitter)
తెలంగాణ

Hyderabad Tourism: ట్యాంక్ బండ్ చుట్టూ అభివృద్ది అధికారుల స్పెషల్‌ ఫోకస్!

Hyderabad Tourism: హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ చుట్టూ పర్యాటకపరంగా ప్రత్యేకంగా అభివృద్ది పరిచేందుకు బుద్ద పూర్ణిమ ప్రాజెక్టు అధికారులు స్పెషల్‌గా ఫోకస్ చేసినట్లు సమాచారం. పర్యాటకులను, సందర్శకులను ఆకట్టుకుని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంపొందించేలా హుస్సేన్ సాగర్ చుట్టూ మరింత సుందరీకరణ పనులు చేపట్టేందుకు స్పెషల్ మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే అభివృద్ది చెందిన దేశాల్లోని
న్యూయార్క్, లండన్ నగరాల్లో సెంట్రల్ పార్కుల మాదిరిగా అంతర్జాతీయ ప్రమాణాలతో పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అభివృద్ది చెందిన దేశాల్లోని నగరాలు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంటే ఆ స్థాయిలో మహానగరం పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు.

ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా

సాయంత్రం కాగానే అంతో ఇంతో సందర్శకుల సంఖ్య కన్పించే హుస్సేన్ సాగర్ చుట్టూ పరిసరాలు ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా సాగర్ చుట్టూ స్కై వాక్‌ను నిర్మిస్తే, పర్యాటకుల ఆదరణ మరింత దక్కుతుందని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు. ఈ తరహాలో అభివృద్ది చేసేందుకు స్పెషల్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుసమాచారం. ఈ మాస్టర్ ప్లాన్ మొత్తం కూడా పర్యావరణహితంగా పర్యాటకులను ఆకట్టుకునేలా మరింత అభివృద్ది, సుందరీకరణ పనులు చేపట్టాలని బీపీపీ భావిస్తున్నట్లు సమాచారం. పర్యావరణ హితంగా స్ట్రీట్ డవలప్ మెంట్ తోపాటు పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు ఉండేలా చర్యలు తీసుకునేందుకు బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్

ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులకనుగుణంగా పట్టణ ప్రాంతాల ఆధునిక విధానంలో అభివ్రుద్ధి, మౌలిక వసతుల కల్పన, ఐసీటీ నెట్ వర్క్, స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్, ప్రజాభదత్ర, పర్యాటకుల భధ్రత నిమిత్తం అత్యాధునికమైన నిఘా వ్యవస్థ, లేటెస్టు ల్యాండ్ స్కేప్ డిజైనింగ్ ఆర్కిటెక్షరల్ డిజైన్స్, అండ్ డిటైల్డ్ ఇంజినీరింగ్ సర్విసెస్ కోసం ఎక్స్ ఫ్రెషన్ ఇంట్రెస్ట్ టెండర్లు కూడా త్వరలోనే ఆహ్వానించనున్నట్లు తెలిసింది. అభివృద్దికి అయ్యే వ్యయం భరించేందుకు సర్కారు వద్ద నిధుల్లేకపోవటంతో ఈ ప్రాజెక్టులన్నింటినీ బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్(బీఓటీ), పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్(పీపీపీ) పద్దతుల్లో చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.

Also Read: Kangana Ranaut: హనీమూన్ మర్డర్ కేసుపై కంగనా సంచలన వ్యాఖ్యలు

రియల్ రంగంలో దేశంలో రెండో స్థానంలో ఉన్నా

ఆసియా ఖండంలోనే హైదరాబాద్ మహానగరం వేగంగా అభివ్రద్ధి చెందుతూ ప్రపంచ గుర్తింపు పొందుతుంది. ఇటీవలే మహానగరం వేదికగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించటంతో ఈ గుర్తింపు మరింత రెట్టింపయింది. ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ, విద్యా, తయారీ, సేవా రంగాల్లో ఇప్పటికే గణనీయమైన అభివృద్ది సాధించిన నగరం ఇపుడిపుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అభివృద్ది వైపు అడుగులు వేస్తున్న సంగతి తెల్సిందే. గ్రేటర్ హైదరాబాద్‌లో 1500 ఐటీ ఐటీఈఎస్ కంపెనీలతో స్పెషల్‌గా ఐటీ కారిడార్‌ను ఏర్పాటు చేసింది. డైనమిక్ స్కైలైన్ అండ్ కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు పుంజుకుంటున్నాయి.

హుస్సేన్ సాగర్ ఏరియా మొత్తం 902 హెక్టార్లు

దేశంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నా, పర్యాటక పరంగా అంతర్జాతీయ పర్యాటకులను ఎందుకు ఆకట్టుకోవటం లేదన్న విషయాన్ని బేరీజు వేసుకున్న తర్వాతే బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అభివృద్దికి స్పెషల్ మాస్టర్ ప్లాన్ సిద్దం చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే. హుస్సేన్ సాగర్ ఏరియా మొత్తం 902 హెక్టార్లలో విస్తరించి ఉందని ఇప్పటికే సర్కారు పలు దఫాలుగా ప్రస్తావించిన సంగతి తెల్సిందే. 2000 సంవత్సరంలో వరదలు సంభవించినానంతరం హుస్సేన్ సాగర్ ఏరియాను వరద నివారణ జోన్‌తో పాటు పర్యాటక పరంగా అభివృద్ది చేసేందుకు అప్పటి సర్కారు స్పెషల్ డవలప్ మెంట్ ఏరియాగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.

తర్వాత హుడా, బీపీపీఏ, సీడీఏ, హడాలను ఏర్పాటు చేసి అభివృద్దికి భీజం వేశాయి. 2008లో హెచ్ఎండీఏను ఏర్పాటు చేసి బీపీపీ హెచ్ఎండీఏ పరిధిలోనే పనిచేస్తూంది. గతంలో హెచ్ఎండీఏ-2031 మాస్టర్ ప్లాన్ రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఆ మాస్టర్ ప్లాన్ ప్రణాళిక బద్దంగా రూపొందించలేదని గుర్తించి, ఇటీవే హెచ్ఎండీఏ 2050 మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగానే బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఏరియాను ప్రణాళిక బద్దంగా, పర్యావరణ హితంగా అభివృద్ది చేసేందుకే సర్కారు ఈ స్పెషల్ మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

Also Read: MLC Kavitha: తెలంగాణలో సంచలనం.. పోలీసుల అదుపులో కవిత.. ఎందుకంటే?

జీవవైవిధ్య పునరుద్దరణకు చర్యలు

బీపీపీ కొత్తగా రూపకల్పన చేస్తున్న స్పెషల్ మాస్టర్ ప్లాన్ కింద హుస్సేన్ సాగర్‌లో, సాగర్ చుట్టూ జీవవైవిధ్యాన్ని పునరుద్దరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. శుద్ధి జలాలతో హుస్సేన్ సాగర్‌ను నింపనున్నారు. ఇప్పటికే ఉన్న మురుగునీటి శుద్ధి వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు సాగర్‌లోకి మురుగునీటిని రాకుండా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పాటు హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ల్యాండ్ స్కేప్‌కు పునరుజ్జీవనం చేయనున్నారు. పీపుల్స్ ప్లాజాతోపాటు సైకిల్ ట్రాక్స్, గ్రీన్ స్పేస్, హాకర్స్ జోన్స్, రీక్రియేషనల్, టూరిస్టు ఏరియా, స్పోర్ట్స్ ఏరినా, పార్కింగ్ ప్రాంతాలు, కమర్షియల్, రిటైల్ ఏరియాలు, హాస్పిటాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేలా ఐకానిక్ నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నారు. బుద్ద పూర్ణిమ ప్రాజెక్టు ఏరియాను ఫైనాన్సియల్ సెక్టార్ గా మార్చే ఆలోచన కూడా ఉన్నట్లు తెలిసింది. అనేక ప్రయివేటు పైనాన్సింగ్ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం. గతంలో హుస్సేన్ సాగర్ చుట్టూ టవర్స్ నిర్మించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

సాగర్ చుట్టూ స్కైవాట్

హుస్సేన్ సాగర్ చుట్టూ 10.5 కిలోమీటర్ల పొడువు ఉందని అధికారులు గుర్తించారు. 6 మీటర్ల వెడల్పుతో స్కైవాక్ నిర్మించనున్నారు. అవకాశమున్న చోట రోడ్డు మీదగా స్తంభాలు ఏర్పాటు చేసి సందర్శకులు సాగర్ అందాలను ఎంజాయ్ చేసేలా స్కైవాక్‌ను నిర్మించనున్నారు. స్థలం కొరత ఉన్న ప్రాంతాల్లో మాత్రం నీటిలో ఫిల్లర్లు వేయాలన్న ప్రతిపాదనను కూడా బీపీపీ అధికారులు పరిశీలిస్తున్నారు. 6 మీటర్ల వెడల్పులోనే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్‌లను సైతం ఏర్పాటు చేయనున్నారు. దీంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం, అమర వీరుల జ్యోతి, జీహెచ్ఎంసీ, బుద్దపూర్ణిమ ప్రాజెక్టు(బీపీపీ), బోట్స్ క్లబ్, సేయిలింగ్ క్లబ్, ఇందిరాపార్కు, లుంబినీ పార్కుల్లోకి ఎలాంటి ట్రాఫిక్ ఆటంకాల్లేకుండానే పాదచారులు సురక్షితంగా రాకపోకలు సాగించే సౌకర్యాలను కల్పించటంతో సందర్శకులు, పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని బీపీపీ అధికారులు అంఛనాలేస్తున్నారు.

Also Read: Folk Singer: ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం!

 

Just In

01

Warangal District: వేధింపులతో.. మహిళా వీఆర్ఎ ఆత్మహత్యా యత్నం..ఎక్కడంటే..?

Kajal Aggarwal: ” నేను బతికే ఉన్నాను ” చంపేయకండి.. ఆ వార్తల పై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్

Hyderabad News: జీడిమెట్లలో సామాజిక కార్యకర్త అరుదైన ఆలోచన.. ప్రాణానికి కవచం గా ‘గో స్లో’ నినాదం..?

Hanumakonda District: ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం: కలెక్టర్ స్నేహ శబరీష్

Bigg Boss Telugu Season 9: అలాంటి ట్రాక్స్ లేకుండా బిగ్ బాస్ నడపలేరా? ఏకిపారేస్తున్న నెటిజన్స్