Gold medal Switches Wires: గోల్డ్ మెడల్ కంపెనీ అంటే దాదాపు అన్ని వర్గాల ప్రజలకు తెలిసిన బ్రాండె. కానీ ఆ గోల్డ్ మెడల్ బ్రాండ్ లో ప్రస్తుతం నకిలీ వైర్లు, స్విచ్లు ఇళ్లలో చిచ్చు పెట్టి మంటల్ని రేపుతోంది. గోల్డ్ మెడల్ కంపెనీకి చెందిన వైర్లు, స్విచ్లు డూప్లికేట్ వస్తువులను వినియోగదారులకు అంటగడుతున్నారు. ఇటీవల కాలంలో గోల్డ్ మెడల్ కంపెనీకి చెందిన కొంతమంది ప్రత్యేక అధికారులు రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా సహా పలు ప్రధాన నగరాల్లో గోల్డ్ మెడల్ కంపెనీకి చెందిన డూప్లికేట్ వైర్లు, స్విచ్లు అమ్ముతూ అక్రమ వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇళ్లలో కాంట్రాక్ట్ వర్కులు చేసే ఎలక్ట్రిషన్ సహకారంతో ఎలక్ట్రికల్ షాపుల నిర్వాహకులు ఈ దందాకు పాల్పడుతున్నట్లుగా తనిఖీల్లో వెళ్లడైంది. గోల్డ్ మెడల్ వైర్లు స్విచ్లు వాడాలని ప్రముఖంగా రైల్వేస్టేషన్లో పెద్ద ఎత్తున టీవీల్లో, వివిధ ప్రచార మాధ్యమాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.
బ్రాండెడ్ పేరుతో నకిలీ ఎలక్ట్రికల్ పరికరాలు
అయితే మహబూబాబాద్ జిల్లాలో బ్రాండెడ్ పేరుతో నకిలీ ఎలక్ట్రికల్ పరికరాలు (ఇళ్లలో వినియోగించే విద్యుత్ ఉపకరణాలు) విక్రయిస్తున్న పలు షాపుల్లో గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించిన ప్రత్యేక బృందాలు, ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్ సర్వీస్ అధికారుల నేతృత్వంలో సంయుక్తంగా జిల్లా కేంద్రంలోని నీలం ఎలక్ట్రికల్ అండ్ సానిటరీ షాపులో గోల్డ్ మెడల్ బ్రాండెడ్ ఎలక్ట్రికల్ పేరుతో నకిలీ పరికరాలు విక్రయిస్తున్నారని సమాచారంతో ఆ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఇందులో నకిలీ ఎలక్ట్రికల్ పరికరాలు విక్రయిస్తున్నట్లుగా గుర్తించి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకకు ఫిర్యాదు చేసినట్లుగా ఆ అధికారులు వివరించారు.
ఆఫర్ల పేరిట బురిడీ
రాజస్థాన్ నుంచి వచ్చిన వారు ఈ షాపులను నిర్వహిస్తూ నూతనంగా నిర్మించుకునే గృహ యాజమానులకు ఆఫర్ల పేరిట బురిడీ కొట్టిస్తూ గోల్డ్ మెడల్ కంపెనీ అని వివరిస్తూ డూప్లికేట్ పరికరాలను అంటగడుతున్నట్లుగా గుర్తించారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లలో, అపార్ట్ మెంట్లలో, షాపింగ్ మాల్స్ లో విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్ సర్వీస్ అధికారుల ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ కంపెనీకి చెందిన విద్యుత్ ఉపకరణాలు విక్రయించే సంబంధిత షాపులపై ప్రత్యేక నిఘాతో తనిఖీలను చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో భయంకరమైన నిజాలు వెళ్లడవుతున్నాయి. గోల్డ్ మెడల్ అంటే సెక్యూరిటీ పరంగా ఉంటాయని గృహ వినియోగదారులు నమ్ముతూ ఆ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
Also Read: Traffic Challan: ఇన్ని చలాన్లు ఉన్నాయేంట్రా బాబోయ్.. బైక్ అమ్మేసినా సరిపోదే!
బాక్స్ గోల్డ్ మెడల్.. లోపల అంతా డూప్లికేట్
బాక్స్ మాత్రం గోల్డ్ మెడల్ అనే లోగో తోనే ఉంటుంది. కానీ అందులో ఉండే వైర్లు, స్విచ్లు, స్విచ్ బోర్డులు వంటి వస్తువులు మాత్రం డూప్లికేటివిగా ఉంటాయని ఇటీవల మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నీలం ఎలక్ట్రికల్ అండ్ సానిటరీ షాపుల్లో తనిఖీ చేసిన సమయంలో బట్టబయలైంది. ఇలాంటి డూప్లికేట్ వస్తువులను కేవలం రాజస్థాన్ నుండి వచ్చిన వ్యాపారస్తులు మాత్రమే తయారు చేసేందుకు సాహసిస్తారని వివరించినట్లుగా తెలిసింది. తెలంగాణలో ఉండే ఎలక్ట్రికల్ సంబంధిత బ్రాండ్ నిర్వాహకులు ఈ సాహసానికి ముందుకు రారని అధికారులే స్వయంగా స్పష్టంగా వివరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ, హైదరాబాద్ వంటి నగరాల్లోనూ గోల్డ్ మెడల్ బ్రాండ్ పేరు మీద నిర్వహిస్తున్న షాపుల్లో తనిఖీలు చేయగా దాదాపుగా విక్రయించే గృహపకరణాలు మొత్తం డూప్లికేట్ గా తేలాయని సంబంధిత తనిఖీల అధికారులు వెల్లడిస్తున్నారు.
ఎలక్ట్రిషన్ల కక్కుర్తి కమిషన్ల కోసమే
నూతనంగా నిర్మించుకునే గృహాలు, షాపింగ్ కాంప్లెక్స్ లు, అపార్ట్మెంట్లు, బ్యాంక్ వగైరా సంబంధిత నిర్మాణాల ప్రాంతాల్లో పనిచేసే స్థానిక ఎలక్ట్రిషియన్లు కమిషన్ల కోసం కక్కుర్తి పడి గోల్డ్ మెడల్ పేరిట ఉన్న డూప్లికేట్ వస్తువులను యాజమాన్యులకు అంటగడుతున్నట్లుగా తనిఖీల్లో వెల్లడైంది. ఈ డూప్లికేట్ వస్తువులు సాధారణంగా ఎలక్ట్రిషన్ లకు, అదేవిధంగా ఎలక్ట్రికల్ షాపులకు సంబంధించిన వారికి మాత్రమే ఇవి అర్థమవుతుంటాయని ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్ సర్వీస్ అధికారులు స్వయంగా వెల్లడిస్తున్నారు.
Also Read: Chandrababu: ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా.. ఆ మంత్రులపై చంద్రబాబు తీవ్ర అసహనం!