TG Electricity Charges(image credit:X)
తెలంగాణ

TG Electricity Charges: సామాన్యులకు ఉపశమనం.. విద్యుత్ ఛార్జీల పెంపు ఇప్పట్లో లేనట్లే..

TG Electricity Charges: రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచబోమని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ స్పష్టం చేసింది. విద్యుత్​ సంస్థలు ప్రతిపాదించిన అగ్రిగేట్​ రెవిన్యూ రిక్వైర్​మెంట్​ (ఏఆర్​ఆర్​)పై ఇప్పటికే బహిరంగ విచారణ పూర్తి చేశారు. విద్యుత్​ పంపిణీ సంస్థలు ఎదుర్కొనే లోటును రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో దీంతో వినియోగదారులపై భారం తప్పినట్లయింది.

ఈఆర్​సీ చైర్మన్​ జస్టిస్​ దేవరాజు నాగార్జున్​ పవర్​ టారీఫ్​ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలోని 1కోటి 90లక్షల వినియోగదారులు ఉండగా అగ్రికల్చర్​ సెక్టార్​లో 1కోటి 37లక్షల గృహవినియోగదారులు , 29.15లక్షల అగ్రికల్చర్​ కనెక్షన్​లు , 19.89లక్షల కమర్షియల్​ కనెక్షన్లు ఉన్నాయని మరో నాలుగున్నర లక్షల వరకు ఇండస్ట్రియల్​ కనెక్షన్లు ఉన్నట్లు చెప్పారు.

వీటిల్లో ఏ సెక్టార్​లో పవర్​ టారీఫ్​ పెంచడం ఉండదని జస్టిస్​ నాగార్జున్​ స్పష్టం చేశారు. విద్యుత్​ పంపిణీ సంస్థలు 2025-26 వార్షిక ఆదాయ అవసరాల నివేదికల్లో రూ.65849.74కోట్లు ప్రతిపాదించింది.
ఈ ప్రతిపాదనలపై ఈఆర్​సీ బహిరంగ విచారణ చేసి రూ.58628.09కోట్లకు ఆమోదం తెలిపింది. అయితే డిస్కంలకు విద్యుత్​ ఛార్జీల ద్వారా రూ.45710.05కోట్ల ఆదాయం చేకూరనుంది.

Also read: YS Sharmila: షర్మిల ఇంటి వద్ద హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు..

విద్యుత్​ సంస్థలు రూ.13499.41కోట్లు లోటును ఎదుర్కొంటున్నాయి. అయితే రాష్ట్ర సర్కారు లోటును భరించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఈఆర్​సీకి రాతపూర్వంగా సమర్పించింది.
దీంతో రాష్ట్ర ప్రజలపై విద్యుత్​ చార్జీల భారం తప్పినట్లయింది.

ఈ నేపథ్యంలో టారీఫ్​ పెంచకుండానే కొత్త టారీఫ్​ను ప్రకటించింది. ఇదిలావుండగా డిస్ట్రిబ్యూషన్​ ట్రాన్స్​మీషన్​ ఛార్జీలు ట్రూడౌన్​ రూ.685.78కోట్లు, ట్రాన్స్​మీషన్​ ట్రూడౌన్​ రూ.1608కోట్లు ఉందని, ఇలా అన్ని కలిపి ఏఆర్​ఆర్​ అంచనాల్లో కోత విధించినట్లు ఈఆర్​సీ వెల్లడిచింది. కాగా ఎలక్ట్రిక్​ వెయికిల్స్​ ఛార్జింగ్​ స్టేషన్​ కాంటాక్ట్​ లోడ్​ను 58కివాట్​ పర్​ 75హెచ్​పి నుంచి 150కిలోవాట్​ పర్​ 201హెచ్​పీకి విస్తరించింది.

గ్రిడ్​ సపోర్ట్​ ఛార్జీలు నెలకు రూ.20.04కిలోవాట్​ గా డిస్కంలు ప్రతిపాదించగా ఈఆర్​సీ నెలకు రూ.18.48కిలోవాట్​కు అనుమతించింది. 2014 నుంచి డిస్కంల ఆర్థిక పరిస్థితి బాగలేదని జస్టిస్​ నాగార్జున్​ అన్నారు. ప్రభుత్వాలు డిస్కంలకు స్వతంత్రం ఇవ్వలేదన్నారు. ట్రాన్స్​మిషన్​ లాసెస్​ తగ్గించుకోవాలని సూచించారు.

 

 

Just In

01

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!