KTR
తెలంగాణ

KTR: ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు..

ఫార్మా సిటీ భూములను తన స్నేహితుల, కుటుంబ సభ్యుల కోసం వాడుకోవడం ఫలించదు
రియల్ ఎస్టేట్ కోసం వాడలేరనీ అసెంబ్లీలోనే హెచ్చరించా
విజన్ లేని రేవంత్ రెడ్డితో ప్రజాధనం వృధా
వేలకోట్ల ఫార్మా సిటీ పెట్టుబడులు వెనక్కి పోయాయి
లక్షల ఉద్యోగాల కల్పన ఆగిపోయింది
ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతన్నలు మోసపోయారు

KTR: ఊహాజనిత ఫ్యూచర్ సిటీ (Future City)కి భవిష్యత్తు లేదని, కేవలం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న ఆకాంక్ష నెరవేరదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Leader KTR) అన్నారు. తెలంగాణ ఫార్మా సిటీ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ లేని నాయకుడని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజాధనం వృధా అవుతుందని ఆరోపించారు. ఫార్మా సిటీ కోసం భూములిచ్చిన రైతులు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేసి, దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ, ఊహాజనిత ప్రాజెక్టును ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు.

Also Read- Clash Over Ganja: గంజాయి బ్యాచ్ హల్చల్.. యువకునికిపై ఎక్సైజ్ సిబ్బంది దాడి చేశారంటూ ఫిర్యాదు

ఒక నిర్లక్ష్య నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తే ఏమవుతుందో దానికి ఫ్యూచర్ సిటీ ప్రచారం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక నిర్దిష్ట ప్రజా ప్రయోజనం కోసం సేకరించిన భూమిని ఇతరుల ప్రయోజనం కోసం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మళ్లించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని ఉటంకిస్తూ, తాను రెండేళ్ల క్రితమే అసెంబ్లీలో ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించానని గుర్తుచేశారు. అయినా రేవంత్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు పీఆర్ కోసం ఖర్చు చేసి, ఇప్పుడు న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంటోందని, చివరికి అధికారులు కూడా దీనిని అంగీకరిస్తున్నారన్నారు.

బీఆర్‌ఎస్‌ పాలనలో 56 గ్రామాల పరిధిలో హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం 20 వేల ఎకరాలతో ప్రతిపాదనలను తయారు చేసిందని, స్థానిక రైతులు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వచ్చి తమ భూములను హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం ఇచ్చారని తెలిపారు. కొంతమంది తమ భూములు ఇవ్వడం పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి రాగానే హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించిన ప్రతి ఎకరాన్ని తిరిగి రైతన్నలకు ఇస్తామని హామీలు ఇచ్చిందన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం అవే భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వారిని నిండా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నలు ఫార్మా కంపెనీల కోసం కేటాయించిన భూముల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు.

Also Read- Rashmika – Vijay: ‘గీత గోవిందం’.. వైరల్ అవుతున్న విజయ్, రష్మికల లిప్ లాక్ వీడియో

ఫార్మా సిటీ ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనంతో మౌలిక వసతుల కల్పనను ప్రారంభించినా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానిని పక్కనపెట్టి, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో భూములను అక్రమంగా రియల్ ఎస్టేట్‌కు మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. దీంతో ప్రజలు, రైతులు నష్టపోతారన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించి ప్రజలకు, రైతులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని హెచ్చరించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?