Liquor Sales: లిక్కర్ కిక్కు చివరి రోజుల్లో రూ.1,350 కోట్ల ఆదాయం
Liquor Sales (iagecredit:twitter)
Telangana News

Liquor Sales: ఎక్సైజ్ శాఖకు లిక్కర్ కిక్కు.. చివరి ఆరు రోజుల్లో రూ.1,350 కోట్ల ఆదాయం

Liquor Sales: కొత్త ఏడాది మందుబాబులకు కిక్కు ఇచ్చింది. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ మద్యం ప్రియులు ఫూటుగా తాగేశారు. డిసెంబర్ 31న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. మధ్యాహ్నం నుంచే మందుబాబులు దుకాణాల దగ్గర బారులు తీరారు. గతేడాది కంటే అధికంగా లిక్కర్​ అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి.

మొత్తం రూ.1,350 కోట్లు

ఆరు రోజుల్లో మందుబాబులు ఏకంగా రూ.1,350 కోట్ల విలువైన మద్యం తాగేశారు. ఏడాది చివరి ఒక్క రోజే 736 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. కేవలం మూడు రోజుల్లోనే వెయ్యి కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మూడు రోజుల్లో 8.30 లక్షల లిక్కర్‌ కేసులు, 7.78 లక్షల బీర్ల కేసులు విక్రయించారు. గతేడాది ఒక్క డిసెంబర్‌ నెలలో రూ.3,805 కోట్లు విలువైన 38.07లక్షల కేసుల లిక్కర్‌, 45.09 లక్షల కేసుల బీర్లు అమ్ముడు పోయినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. కానీ, ఈసారి రూ.5 వేల కోట్లకు పైగా మద్యం అమ్ముడుపోయినట్టు సమాచారం.

Also Read: Meesaala Pilla Song: 100 మిలియన్ వ్యూస్‌తో 2025 బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్‌గా ‘మీసాల పిల్ల’!

3,231 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులు

మరోవైపు, ఎక్కడికక్కడే డ్రంక్ అండ్ డ్రైవ్స్ నిర్వహించి పోలీసులు మందుబాబులపై ఉక్కుపాదం మోపారు. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో మూడు పోలీస్ క‌మిష‌న‌రేట్ల‌లో దాదాపు 300 వంద‌ల పోలీస్ బృందాలు 3 వేల మంది మందుబాబుల‌పై కేసులు న‌మోదు చేశారు. హైదరాబాద్​ కమిషనరేట్ పరిధిలో 1,198, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,228, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 805 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లుగా పోలీసులు వివరించారు.

పబ్బుల్లో డ్రగ్స్

మ‌రోవైపు, ఈగ‌ల్ టీమ్‌లు న‌గ‌రంలోని 60 పబ్బులపై ఆకస్మిక త‌నిఖీలు చేపట్టాయి. 4 ప్రముఖ పబ్బుల్లో డ్ర‌గ్స్ సేవించినట్లు గుర్తించారు. ఐదుగురు డీజేలు డ్రగ్స్ తీసుకొని మ్యూజిక్ ఆపరేట్ చేస్తున్నట్లు తేల‌డంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. న‌గ‌రంలోని బఫెలో వైల్డ్ వింగ్స్, షెర్లాక్ ఇల్యూషన్, వేవ్ పబ్‌లలో పనిచేస్తున్న డీజేలు డ్రగ్స్ ప్రభావంలో మ్యూజిక్ నిర్వహిస్తున్నారని అధికారులు నిర్ధారించారు. పబ్బుల సంస్కృతిలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భాగ్యనగరంలో డ్రగ్స్ రహిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా తమ సోదాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Also Read: Honey Glimpse: భయపెడుతోన్న నవీన్ చంద్ర.. ‘హనీ’ గ్లింప్స్ ఎలా ఉందంటే?

Just In

01

Nominated Posts: కొంచెం ఓపిక పట్టండి.. అందరికీ గుర్తింపు ఉంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

Anvesh Controversy: యూట్యూబర్ అన్వేష్ ఈ సారి పెద్ద టార్గెట్టే పెట్టుకున్నాడు.. బత్తాయిల అంతు చూస్తాడంట..

CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గౌరవ మర్యాదలకు భంగం కలగనివ్వం: సీఎం రేవంత్

Education Reforms: కొత్త ఏడాదిలో ఉన్నత విద్యా రంగం కొత్త పుంతలు.. జరిగే మార్పులివే..!

Liquor Sales: ఎక్సైజ్ శాఖకు లిక్కర్ కిక్కు.. చివరి ఆరు రోజుల్లో రూ.1,350 కోట్ల ఆదాయం