New Wine Shops: కొత్త వైన్ షాపులు మొదలయ్యయి. లాటరీలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు దేవుడా.. దందా బాగా జరిగేట్టు చూడు అంటూ గుమ్మడికాయలు.. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి సేల్స్ మొదలు పెట్టారు. మరోవైపు రాష్ట్రంలోని కొన్ని చోట్ల మా ప్రాంతంలో వైన్ షాపులు(Wine Shops) వద్దు అంటూ స్థానికులు ఆందోళనలకు దిగారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 వైన్ షాపులు ఉన్న విషయం తెలిసిందే. నవంబర్ 30వ తేదీతో వీటి కాలపరిమితి ముగిసింది. ఈ నేపథ్యంలో గడువు ముగియటానికి ముందే ఎక్సయిజ్ శాఖ వైన్ షాపుల కోసం దరఖాస్తులు సేకరించి లాటరీ ద్వారా వాటిని కేటాయించింది. ఈ క్రమంలో ఇంతకు ముందు నుంచి వ్యాపారంలో ఉన్న వారిలో కొందరికి తిరిగి షాపులు దక్కగా కొత్తవారికి కూడా అదృష్టం పలికి దుకాణాలు వచ్చాయి. వీరి లైసెన్స్ సోమవారం నుంచి అమల్లోకి రావటంతో అందరూ అధికారికంగా మద్యం అమ్మకాలు మొదలు పెట్టారు.
త్వరలో కొత్త బ్రాండ్లు..
కాగా,. మద్యం ప్రియులకు త్వరలోనే కొత్త బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఎక్సయిజ్ శాఖ రాష్ట్రొంలో దేశీయ, విదేశీ మద్యం అమ్మాలని ఆసక్తి ఉన్నకంపెనీలు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. ఈ క్రమంలో వేర్వేరు కంపెనీల నుంచి దరఖాస్తులు కూడా అందాయి. ఎక్సయిజ్ వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం ప్రస్తుతం ఈ అప్లికేషన్లు అధికారుల పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే కొత్త బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయి.
Also Read: Shocking Video: 20 అడుగుల గోడ దూకి.. సింహాల బోనులోకి వెళ్లాడు.. తర్వాత ఏమైదంటే?
ఆదాయంపై దృష్టి..
ఈ సంవత్సరం ఆదాయాన్ని గణనీయంగా పెంచాలని ఎక్సయిజ్ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో 30వేల కోట్ల ఆదాయాన్ని టార్గెట్ గా పెట్టుకున్నట్టు సమాచారం. ఈ లక్ష్యాన్ని సాధించటంలో అందుబాటులోకి రానున్న కొత్త బ్రాండ్లు కీలక పాత్ర పోషించగలవని భావిస్తున్నారు.
