Gram Panchayat: గ్రామపంచాయతీల్లో అట్టహాసంగా నూతన
Gram Panchayat ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
Telangana News

Gram Panchayat: గ్రామపంచాయతీల్లో అట్టహాసంగా నూతన పాలకవర్గాల ప్రమాణస్వీకారం!

Gram Panchayat: గ్రామపంచాయతీ నూతన పాలకవర్గాలు అట్టహాసంగా ప్రమాణస్వీకారం నిర్వహించుకున్నాయి. ఉదయం 10 గంటల నుండి పలు గ్రామాల్లో ప్రమాణస్వీకారం కార్యక్రమాలు ప్రత్యేక అధికారుల ద్వారా ప్రారంభమయ్యాయి. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయాలను అందంగా అలంకరించడమే కాకుండా వివిధ గ్రామాల్లో ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలు నిర్వహించారు. నూతనంగా ఎంపికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ప్రత్యేక అధికారి, స్థానిక గ్రామ కార్యదర్శి లు కలిసి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక గ్రామస్తులు ముఖ్యులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Also Read: TG Gram Panchayat Elections: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. మూడు విడతల్లో పోలింగ్

కాగా వర్గల్ మండల కేంద్రంలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీాఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాటకు దారి తీయగా పోలీసులు కల్పించుకొకతప్పలేదు. జగదేవ్ పూర్ పంచాయతి ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

ప్రత్యేక ఆకర్షణగా ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు

పంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి కొన్ని గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చాలా గ్రామాల్లో భోజనం ఏర్పాట్లు చేశారు. కొన్ని గ్రామాల్లో ఫంక్షన్ హాల్లో ప్రత్యేక డెకరేషన్ తో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మిఠాయిలతో ఆనందాన్ని పంచుకున్నారు. కొన్ని గ్రామాల్లో పాత పాలకవర్గాలను కూడా సన్మానం చేశారు. మరికొన్ని గ్రామాల్లో కార్యక్రమానికి హాజరైన వారికి ప్రత్యేక బహుమతులు అందించారు. కాగా గజ్వేల్ నియోజకవర్గంలో  జరిగిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల వివిధ గ్రామాల ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో గజ్వేల్ స్థానిక మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డి సి సి అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొని నూతన పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: Gram Panchayat: పంచాయతీల్లో నకిలీ వేతన చెల్లింపులకు చెక్​!

Just In

01

Rowdy Janardhana: ‘రౌడీ జనార్ధన’ టైటిల్ గ్లింప్స్.. బాబోయ్ అరాచకమే!

Hydra: బ‌డాబాబుల ఆక్ర‌మ‌ణ‌ల‌కు హైడ్రా చెక్.. రూ. 2500 కోట్ల విలువైన భూమికి ఫెన్సింగ్‌!

Thummala Nageswara Rao: చేనేత కార్మికులకు పని కల్పించడమేప్రభుత్వ లక్ష్యం : మంత్రి తుమ్మల!

Pawan Kalyan: పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెడితే బావుంటుంది.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు

Drishyam 3: మళ్ళీ వస్తున్న విజయ్ సల్గాంకర్.. ‘దృశ్యం 3’ అధికారిక ప్రకటన వచ్చేసింది