National Medical Commission: మెడికల్ కాలేజీల పర్మిషన్లలో ఎలాంటి సమస్య ఉండదని ఎన్ఎంసీ(నేషనల్ మెడికల్ కమిషన్) తేల్చి చెప్పింది. సీట్ల కోత వంటి ఆలోచనే లేదని క్లారిటీ ఇచ్చింది. విద్యార్ధులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడమే తమ లక్ష్యం అని స్పష్టం చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ అధికారులతో హెల్త్ సెక్రటరీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మెడికల్ కాలేజీల్లో ఫాకల్టీ, వసతులపై హెల్త్ సెక్రటరీ, డీఎంఈ ఇచ్చిన సమాచారంతో ఎన్ ఎంసీ అధికారులు సంతృప్తి చెందారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో కాలేజీలు ఏర్పాటు అవడం వల్ల ఫాకల్టీ కొరత, మౌళిక వసతుల కల్పనలో ఇబ్బందులు ఏర్పడ్డాయని అధికారులు వివరించారు.
బిల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి
మెడికల్ కాలేజీలు, అనుబంధ హాస్పిటళ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, కాలేజీలు, హాస్పిటళ్ల బిల్డింగుల పనులు కొనసాగుతున్నాయని డీఎంఈ వివరించారు. అవసరమైన నిధులు కేటాయించడం జరిగిందని, ఫాకల్టీ నియామకానికి అనుమతులు కూడా జారీ అయ్యాయని డీఎంఈ క్లారిటీ ఇచ్చారు. వీలైనంత త్వరగా ఫాకల్టీని నియమించుకోవాలని, వసతులను మెరుగుపర్చుకోవాలని ఎన్ ఎంసీ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగానికి సూచించింది. ఈ సందర్భంగా డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్ మాట్లాడుతూ అకాడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందు, మెడికల్ కాలేజీలలో ఎన్‌ఎంసీ ఇన్‌స్పెక్షన్లు చేయడం, నోటీసులు ఇవ్వడం సహజంగా జరిగే ప్రక్రియ అని వివరించారు.
Also Read: Indus Water Treaty: భారత్ దెబ్బకు పాక్ విలవిల.. సంచలన రిపోర్ట్ విడుదల
నోటీసులు రావడం ఇదే మొదటిసారి
ఈ సంవత్సరం ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా అన్ని రాష్ట్రాల్లోని కాలేజీలకూ నోటీసులు వచ్చాయన్నారు. అయితే మన రాష్ట్రంలోని కాలేజీలకు మాత్రమే నోటీసులు వచ్చినట్టుగా, నోటీసులు రావడం ఇదే మొదటిసారి అన్నట్టుగా కొందరు అపోహలు సృష్టించి, తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. ఒకేసారి ఎక్కువ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల ఫాకల్టీ కొరత, మౌళిక వసతుల కల్పనలో ఇబ్బందులు వచ్చాయని, అందుకే వాటన్నింటినీ అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు. అవసరమైన బడ్జెట్ కేటాయిస్తూ జీవోలు ఇవ్వడం జరిగిందన్నారు. అన్ని కాలేజీలకు పర్మిషన్లు పక్కాగా వస్తాయని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని డీఎంఈ నరేంద్రకుమార్ నొక్కి చెప్పారు.
Also Read: Honeymoon Case: హనీమూన్ కేసులో వెలుగులోకి మరో వాస్తవం.. అందరూ షాక్