KTR Counter: భాద్యత కలిగిన ముఖ్యమంత్రి పదవిలో ఉండి ప్రజలకు మంచి చేయాల్సింది పోయి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) టైంపాస్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శలు వ్యక్తం చేశారు. పరిపాలన చేతగాక రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న మరణాల గురించి చీప్ కామెంట్స్ చేస్తున్నారన్నారు. అధికారంలో తామే ఉన్నామన్నది మరిచిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, సీఎంకు చిత్తశుద్ధి ఉంటే మిస్టీరియస్ మరణాలపై (Mysterious Deaths) దర్యాప్తు చేసుకోవచ్చని సవాల్ విసిరారు.
గురువారం ఓ ఆంగ్ల చానెల్ తో మాట్లాడిన కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రమాదంలో వారి అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే సీఎం తమ ప్రభుత్వం పై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. పదేళ్ల పాటు ఆగిన ప్రాజెక్టు పనులని తగిన జాగ్రత్తలు తీసుకోకుండా, నిపుణులను సంప్రదించకుండా ప్రారంభించారని ఆరోపించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు.
8 మంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకుపోవడానికి కారణం రేవంత్ రెడ్డి అని, ఆయనే దీనికి పూర్తి బాధ్యత వహించాలన్నారు. రేవంత్ రెడ్డి కార్మికులను రక్షించాల్సింది పోయి బ్లేమ్ గేమ్ మొదలుపెట్టారని దుయ్యబట్టారు.
కాగా, బుధవారం ఢిల్లీలో మీడియా చిట్ చాట్ లో భాగంగా సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి ప్రశ్నించిన వారు, వారి తరపున కోర్టులలో వాదిస్తున్నవారు అనుమానస్పందంగా చనిపోతున్నారన్నారు. భూపాలపల్లి సామాజిక కార్యకర్త రాజలింగం హత్యకు గురవడం, అంతకుముందే అడ్వకేట్ సంజీవ్ రెడ్డి గుండె పోటుతో ఆకస్మాత్తుగా మరణించడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. దానికి తోడు కేటీఆర్ మిత్రుడు, బిజినెస్ పార్ట్ నర్ అయిన కేదార్ సైతం దుబాయ్ లో ఆకస్మాత్తుగా చనిపోవడం విచారం కలిగించిందన్నారు. ఈ మూడు మరణాల గురించి కేటీఆర్ దర్యాప్తు చేయాలని కోరకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. కోరితే దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటరిచ్చారు.
Also Read:
kedar selagamsetty Demise: కేదార్ డెత్ మిస్టరీ… కేటీఆర్‌తో లింక్స్ వయా రాజ్ పాకాల