ముందే చెప్పిన స్వేచ్ఛ
సీఎం కామెంట్స్‌తో మరోసారి చర్చ
సినీ నిర్మాత కేదార్ ఆకస్మిక మరణం
అంతా అనుమానాస్పదం
కేటీఆర్ బావమరిదితో దగ్గరి సంబంధాలు
విచారణకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ సవాల్
రాజలింగమూర్తి, సంజీవ్ రెడ్డి మృతిపైనా డౌట్స్
వరుస మరణాల వెనుక ఏం జరిగింది?
దుబాయ్‌లో పైలట్ రోహిత్ రెడ్డికి ఏం పని?
సినీ, పారిశ్రామిక దిగ్గజాల పార్టీ దేనికోసం?
kedar selagamsetty Demise: పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో క్రిడ్ ప్రో కో (quid pro quo వ్యవహారాలు చాలానే నడిచాయి. అప్పటిదాకా సైకిళ్ల మీద తిరిగిన వాళ్లు, పెళ్లిళ్లకు ఈవెంట్లు చేసుకునేవాళ్లు, డొక్కు స్కూటర్లపై చక్కర్లు కొట్టిన వాళ్లు.. పదేళ్లలో పెద్దపెద్ద భవనాలకు షిఫ్ట్ అయ్యారు. పడవంత కార్లలో షికార్లు చేయడం మొదలుపెట్టారు. ఇంత తక్కువ సమయంలో వారి లైఫ్ టర్న్ తీసుకోవడం వెనుక చీకటి వ్యవహారాలు నడిచాయి. వాటిపై అధికార కాంగ్రెస్ నేతలు అప్పుడప్పుడు ప్రశ్నించడం, బీఆర్ఎస్ సైడ్ నుంచి తప్పుడు ప్రచారం అని కొట్టివేయడం కామన్ అయిపోయింది. అయితే, బీఆర్ఎస్ నేతల డీలింగ్స్ అన్నీ తెలిసిన వారు ఇప్పుడు వరుసగా చనిపోవడం హాట్ టాపిక్ అయింది. వాటిపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
స్వేచ్ఛ స్పెషల్ డెస్క్: బీఆర్ఎస్ నేతలతో సంబంధాలు ఉన్నవారు, వారిపై పోరాటం చేస్తున్నవారు ఈమధ్య వరుసగా చనిపోతున్నారు. ఈ మరణాలు సహజమైనవి కావన్న అనుమానాలు (Suspicious Deaths) ఉన్నాయి. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అక్రమాలపై కేసు వేసిన రాజలింగమూర్తి (Rajalingamurthy) హత్యతోపాటు, కేటీఆర్ (KTR) బావమరిది రాజ్ పాకాలతో (Raj pakala) దగ్గరి సంబంధాలు ఉన్న సినీ నిర్మాత కేదార్ నాథ్ దుబాయ్‌లో చనిపోవడం, కాళేశ్వరం కేసులు హ్యాండిల్ చేస్తున్న సంజీవ్ రెడ్డి (Advocate Sanjeev Reddy) అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోవడంపై సీఎం మాట్లాడారు. ముగ్గురి మృతిపై కేటీఆర్ విచారణ ఎందుకు అడగడం లేదని నిలదీశారు. ప్రభుత్వాన్ని కోరితే విచారణ చేస్తామని చెప్పారని అన్నారు. ఇదే సందర్భంగా దుబాయ్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.
కేదార్‌తో డైరెక్ట్ డీలింగ్స్.. ముందే చెప్పిన స్వేచ్ఛ
కేదార్ నాథ్.. పేరుకే సినిమా నిర్మాత. డ్రగ్స్ కేసులో నిందితుడు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు దగ్గరి మనిషి. బినామీగా పెంచి పోషించాడనే ప్రచారం ఉంది. న్యూజెర్సీలో మిర్చి రెస్టారెంట్‌లో పని చేసేందుకు లేబర్‌ని అక్రమంగా తరలించాడనే ఆరోపణలతో కేసులు నమోదు అవుతాయని హైదరాబాద్‌కు పారిపోయి వచ్చాడు. ఇక్కడకు రాగానే బఫెలో వైల్డ్ వింగ్ పేరుతో బీఆర్ఎస్ బినామీగా ఎదిగి 7 రెస్టారెంట్స్ ప్రారంభించాడు. హైలైఫ్, జూబ్లీ 800 పేరుతో పబ్స్ నడిపించాడు. వీటితో పాటు ఈవెంట్స్ నౌ కంపెనీతో రాజ్ పాకాల నిర్వహించే ఈవెంట్స్‌ను దగ్గరుండి చూసుకునేవాడు. తర్వాత, సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా మారాడు. సినిమాలతో నష్టాలు వచ్చినా విమానాలను అద్దెకు తీసుకొని నడిపించాడు. వీటన్నింటిపై గతంలోనే (మార్చి 1, 2024) స్వేచ్ఛ (Swetcha) ఇన్వెస్టిగేటివ్ కథనాలు ఇచ్చింది. డ్రగ్స్ కేసులో ఈడీ(ED), సిట్ విచారణను ఎదుర్కొన్న వారితో పాటు కేదార్‌తో కలిసి రాజ్ పాకాల ఉన్న ఫోటోలు బయటపెట్టింది. అంతేకాదు, కేదార్ పార్ట్‌నర్ అశ్విన్ జైన్ (Ashwin Jain) కారునే రాజ్ పాకాల వాడుతున్నాడని, వారి చీకటి ఆర్థిక బంధాలను స్వేచ్ఛ బట్టబయలు చేసింది. ఇప్పుడు అతను సడెన్‌గా చనిపోవడంతో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
పైలట్ రోహిత్ రెడ్డితో కేదార్ వ్యాపారం?
కేదార్ దుబాయ్‌లో గుండెపోటుతో చనిపోయారని అతని సన్నిహితులు చెబుతున్నారు. కానీ, డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే చనిపోయినట్టు ప్రచారం జరుగుతున్నది. కేదార్‌తో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి (Pilot Rohith Reddy) ఉన్నట్టుగా సమాచారం. వీరిద్దరూ కలిసి దుబాయ్‌లో (Dubai) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. కేదార్ ద్వారా దుబాయ్‌లో టాలీవుడ్ ప్రముఖులు పెట్టుబడులు పెట్టారు. దానికి సంబంధించిన బిజినెస్ విస్తరణ కోసం తన ఫ్లాట్‌లోనే కేదార్ పెద్ద పార్టీ ఇచ్చాడు. దీనికి తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు, టాలీవుడ్ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు హాజరయ్యారు. పార్టీ ముగిసిన తర్వాత అకస్మాత్తుగా కేదార్ చనిపోయాడు. ఈ మృతి ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదే క్రమంలో రోహిత్ రెడ్డి అరెస్ట్ అయినట్టు ప్రచారం సాగింది. కానీ, ఆయన దీన్ని ఖండించారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లో ఉన్నానని వీడియో రిలీజ్ చేశారు. కానీ, దుబాయ్ వెళ్లలేదని మాత్రం ఆయన చెప్పలేదు. మొత్తంగా బీఆర్ఎస్ లీడర్లతో సత్సంబంధాలు ఉన్నవారు, వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నవారు వరుసగా చనిపోవడం చర్చనీయాంశమైంది.